India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరాన్ని కార్చిచ్చు సర్వనాశనం చేసింది. వైల్డ్‌ఫైర్ కారణంగా ఎటుచూసినా శ్మశానాన్ని తలపిస్తోంది. మంటలంటుకున్న అన్ని ఇళ్లూ అగ్నికి ఆహుతయ్యాయి. కానీ ఒకే ఒక ఇల్లు మాత్రం ఫైర్‌కు ప్రభావం కాలేదు. నగరంలో ‘మాలిబు మాన్షన్’ ఈ అగ్ని కీలల నుంచి తప్పించుకుంది. ఈ భవనాన్ని ఫైర్ ప్రూఫ్‌గా నిర్మించడంతోనే ఇది మంటలకు దగ్ధం కాలేదు. అలాగే భూకంపం వచ్చినా తట్టుకునేలా దీనిని నిర్మించారు.
ఇటీవల క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే వాటి వాడకంలో జాగ్రత్తలు తీసుకోకపోతే సిబిల్ స్కోర్ తగ్గి ఇబ్బందులు ఎదురవుతాయి.
✒ కార్డులపై క్యాష్ అడ్వాన్స్ తీసుకోవద్దు
✒ రోజువారీ కొనుగోళ్లు, మేజర్ మెడికల్ ఖర్చులకు ఉపయోగించొద్దు
✒ ఆర్థిక ఇబ్బందుల్లో అనవసరమైన కొనుగోళ్లు వద్దు
✒ ఓల్డ్ క్రెడిట్ కార్డులను రద్దు చేసుకోవద్దు
✒ అలర్ట్స్ సెట్టింగ్స్, కాంటాక్ట్ వివరాలను అప్డేట్ చేసుకోండి
TG: రాష్ట్రంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ స్పెషల్ షోలను రద్దు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. దీంతో రేపటి నుంచి మార్నింగ్ స్పెషల్ షోలు నిలిచిపోనున్నాయి. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. బెనిఫిట్ షోలను రద్దు చేసి స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడాన్ని న్యాయస్థానం ఆక్షేపించింది. దీనిపై పునరాలోచించాలని చెప్పింది. దీంతో ఆ షోలను ప్రభుత్వం రద్దు చేసింది.
వైడ్ల విషయంలో బౌలర్లకు ఊరట కలిగించే విషయంపై పనిచేస్తున్నట్లు ICC క్రికెట్ కమిటీ మీడియా ప్రతినిధి షాన్ పొలాక్ వెల్లడించారు. లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్‌లో బ్యాటర్లు క్రీజు దాటినప్పుడు బౌలర్ సరైన చోట బంతిని వేయలేరని పేర్కొన్నారు. బ్యాటర్ ముందుకొచ్చినప్పుడు అతను ఉన్న స్థానం నుంచి బాల్ దూరాన్ని పరిశీలనలో తీసుకునే యోచన ఉందన్నారు. సౌతాఫ్రికాకు చెందిన పొలాక్ టెస్టు, వన్డేల్లో 814 వికెట్లు పడగొట్టారు.
AP: సంక్రాంతి కానుకగా పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. GPFకు రూ.519cr, CPSకు రూ.300cr, TDSకు రూ.265cr పోలీసుల సరెండర్ లీవ్ బకాయిలు రూ.241cr, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.788cr, 26 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.506 cr, 651 కంపెనీలకు రూ.90 cr రాయితీ, విద్యుత్ శాఖకు రూ.500 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.400 cr, రైతుల కౌలు బకాయిలకు రూ.241 కోట్లు రిలీజ్ చేయనున్నారు.
వారంలో 90 గంటలు పనిచేయాలంటూ L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కాగా ప్రపంచంలోనే భూటాన్ దేశస్థులు అత్యధిక గంటలు పనిచేస్తున్నారు. వీరు వారానికి 54.4 గంటలు కష్టపడుతున్నారు. ఆ తర్వాత యూఏఈ-50.9 గంటలు, లీసోతో-50.4, కాంగో-48.6, ఖతర్-48, లైబీరియా-47.7, మారిటానియా-47.6, లెబనాన్-47.6, మంగోలియా-47.3, జోర్డాన్ దేశస్తులు 47 గంటలు. ఇండియాలో 48 గంటలు పని చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు పండుగ సమయాన్ని తమ మోసాలకు కొత్త ఎత్తుగడగా ఎంచుకున్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. ‘పండుగ సందర్భంగా బంపర్ ఆఫర్ అని ఉచిత రీచార్జ్ అంటూ మెసేజ్‌లు పంపుతారు. వాటిని నమ్మకండి. ఆశపడి క్లిక్ చేయొద్దు. లింక్ మరో 10 మందికి షేర్ చేయకండి. అది రీచార్జ్ కాదు.. మాల్‌వేర్. అత్యాశకు వెళ్లి సైబర్ మోసాలకు గురికావొద్దు’ అని Xలో పోలీసులు ప్రకటన చేశారు.
AP: తెలుగు యూట్యూబర్ ఫన్ బకెట్ <<15118839>>భార్గవ్‌ను <<>>పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లారు. ఈ కేసులో 25 మంది సాక్షులను విచారించిన పోలీసులు, 17 మందితో సాక్ష్యం చెప్పించారు. ఈ తీర్పుపై భార్గవ్ అప్పీల్‌కు వెళ్లినా పైకోర్టు స్వీకరించదని పోక్సో కోర్టు స్పెషల్ PP మూర్తి వెల్లడించారు.
చాలా ప్రాంతాల్లో మరణం తర్వాత మళ్లీ పుడతామని విశ్వసిస్తుంటారు. అలాంటి వారు అధికంగా ఉన్న దేశం బంగ్లాదేశ్. అక్కడ మొత్తం జనాభాలోని 98.8 శాతం మంది మరోసారి జన్మ ఉంటుందని నమ్ముతున్నట్లు వరల్డ్ వాల్యూస్ సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత మొరాకో (96.2%), లిబియా (95.2%), టర్కీ(91.8%), ఇరాన్(91.3%), పాకిస్థాన్ (89.3%), ఈజిప్ట్ (88.1%), ఫిలిప్పీన్స్(83.8%), నైజీరియా (83.1%) ఉన్నాయి.
తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇచ్చేశారు. స్కూళ్లకు ఇవాళ్టి నుంచి జనవరి 17 వరకు, కాలేజీలకు 16 వరకు సెలవులు ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు తప్పనిసరిగా సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ హెచ్చరించింది. అందుకు విరుద్ధంగా విద్యాసంస్థలు నడిపితే గుర్తింపు రద్దు చేస్తామని తేల్చి చెప్పింది. అటు ఏపీలో జనవరి 10 నుంచి 19 వరకు ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.