News June 2, 2024

రాబోయే ప్రభుత్వంతో ఏపీ పరిస్థితి మారాలి: ఉండవల్లి

image

AP: రాబోయే ప్రభుత్వంతో అయినా ఏపీలో పరిస్థితి మారాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆకాంక్షించారు. తెలంగాణలో అవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారని, ఏపీ పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందని అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉమ్మడి సమస్యలు పరిష్కరించాల్సి ఉందని రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. గత పదేళ్లుగా చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదని ఆరోపించారు.

News June 2, 2024

కూటమికి తిరుగులేని విజయం: చంద్రబాబు

image

AP ఎన్నికల్లో NDA కూటమి తిరుగులేని విజయం సాధించబోతోందని TDP అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూటమి అభ్యర్థులతో సమీక్షించిన ఆయన.. ‘3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేశారు. కౌంటింగ్ రోజు అల్లర్లకు పాల్పడేందుకు, పోస్టల్ ఓట్లపై కొర్రీలకు YCP ప్లాన్ చేస్తోంది. డిక్లరేషన్ ఫాం తీసుకున్నాకే అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు రావాలి’అని సూచించారు.

News June 2, 2024

దంపుడు బియ్యంతో ఆరోగ్యం భేష్

image

పాలిష్ పట్టిన బియ్యం కంటే దంపుడు బియ్యంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధకులు ఎప్పటినుంచో చెప్తున్న మాట. తెల్లబియ్యం వాడకాన్ని తగ్గించి వీటిని తీసుకుంటే మధుమేహం, రక్తపోటు ముప్పుని తగ్గిస్తాయి. నియాసిన్, విటమిన్ బి3, మెగ్నీషియం ఇందులో పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ నివారిణిగా పనిచేయడంతో పాటు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. పిండి పదార్థం తక్కువగా ఉండటంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగవు.

News June 2, 2024

తెలుగు జాతి నంబర్ 1 అవ్వాలి: చంద్రబాబు

image

AP: పేదరికం లేని సమాజం దిశగా తెలుగు రాష్ట్రాల ప్రయాణం సాగాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాక్షించారు. ‘ఏపీ, తెలంగాణ ఏర్పడి నేటికి పదేళ్లు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే. 10కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష. స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి ప్రపంచంలో భారతీయులు అగ్రస్థానంలో ఉండాలి. అందులో తెలుగు జాతి నంబర్ 1 అవ్వాలని ఆకాంక్షిస్తున్నా’ అని పోస్ట్ పెట్టారు.

News June 2, 2024

APని తాకిన రుతుపవనాలు

image

AP: నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. తొలుత ఈ నెల 4-5 తేదీల్లో రుతుపవనాలు ఏపీని తాకుతాయని భావించగా.. ముందుగానే ప్రవేశించాయి.

News June 2, 2024

అరుణాచల్ వృద్ధి కోసం పనిచేస్తాం: మోదీ

image

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ <<13362827>>విజయం<<>> సాధించడంపై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి రాజకీయాలకు ఈ విజయంతో ప్రజలు స్పష్టమైన ఆదేశాలిచ్చారని ట్వీట్ చేశారు. రాష్ట్ర వృద్ధి కోసం తమ పార్టీ కృషి చేస్తోందని పేర్కొన్నారు. మరోవైపు సిక్కింలో విజయం సాధించిన SKM పార్టీకి, CM ప్రేమ్ సింగ్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు. సిక్కిం అభివృద్ధితో పాటు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు పనిచేస్తామన్నారు.

News June 2, 2024

మూడు జోన్లుగా తెలంగాణ: సీఎం రేవంత్‌రెడ్డి

image

మూడు జోన్లుగా తెలంగాణను విభజిస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. HYD ORR పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు ప్రాంతం వరకు సబ్ అర్బన్, రిజినల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దు వరకు రూరల్ ప్రాంతంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మూడు ప్రాంతాలకూ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. త్వరలో రీజినల్ రింగ్ రోడ్డును కూడా పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.

News June 2, 2024

అందుకే హరీశ్ రావు అమెరికా వెళ్లారు: మంత్రి కోమటిరెడ్డి

image

TG: మాజీ మంత్రి హరీశ్ రావు ఫోన్ ట్యాపింగ్ దొంగ ప్రభాకర్‌ రావును కలిసేందుకే అమెరికా వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని మీడియా సమావేశంలో తెలిపారు. దొంగచాటుగా వెళ్లి HYD రావొద్దని ప్రభాకర్‌తో చెప్పారని ఆరోపించారు. ఒకవేళ ఆయనను హరీశ్ రావు కలవలేదని ప్రమాణం చేస్తే తాను దేనికైనా సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు.

News June 2, 2024

కూటమి ఏజెంట్లు సంయమనం పాటించాలి: సీఎం రమేశ్

image

AP: సర్వే అంచనాలు ప్రతికూలంగా రావడంతో తగాదాలు సృష్టించేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ నేత సీఎం రమేశ్ ఆరోపించారు. ఓట్ల లెక్కింపు రోజున కూటమి ఏజెంట్లు సంయమనం పాటించాలని కోరారు. తప్పుడు సర్వేలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని వైసీపీ చూస్తోందని మండిపడ్డారు. జగన్ పాలనతో విసిగిపోయిన ఏపీ ప్రజలు కూటమికి పట్టం కట్టారని చెప్పుకొచ్చారు.

News June 2, 2024

T20WC: భారత ప్రాబబుల్ జట్టు ఇదేనా?

image

టీ20 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్‌తో మ్యాచ్ కోసం కొంతమందిని బెంచ్‌కే పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది. యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్ లాంటి ఆటగాళ్లు డగౌట్‌కే పరిమితం కానున్నట్లు సమాచారం. మేనేజ్‌మెంట్ ఇప్పటికే జట్టుపై ఒక అంచనాకు వచ్చినట్లు టాక్. ప్రాబబుల్ జట్టు: రోహిత్ (C), కోహ్లీ, రిషభ్ పంత్, SKY, శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్ష్‌దీప్.