India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఈ నెలాఖరులోగా HYDలో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఆస్పత్రి నిర్మాణంపై సమీక్షించిన ఆయన, భూ బదలాయింపుతో సహా ఇతర పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్‌లను అధికారులు వివరించగా, సీఎం పలు మార్పులు సూచించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నమూనాలను రూపొందించాలన్నారు.
ఓ ఫౌండరేమో వారానికి 70hrs పనిచేయాలంటారు. ఆ కంపెనీలో న్యూ జాయినీ సగటు వేతనం పదేళ్లుగా పెరగలేదని సమాచారం. మరో ఛైర్మనేమో భార్యనెంత సేపు చూస్తారు? వారానికి 90hrs పనిచేయాలంటారు. ఆయన వేతనమేమో కంపెనీ సగటు ఉద్యోగి కన్నా 534 రెట్లు ఎక్కువ. కొందరు వీరికి సపోర్టు. మరికొందరు వ్యతిరేకం. ఇంతకీ ఉద్యోగి ఏం కోరుకుంటున్నాడో ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అధిక పని, అధిక వేతనం, రెస్ట్, ఫ్యామిలీ టైమ్‌లో మీ కోరికేంటి?
రేపు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ యువతతో గడపనున్నారు. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయాన్ని ప్రధాని తన Xలో పోస్ట్ చేశారు. యువతతో వివిధ అంశాలపై చర్చించడంతో పాటు వారితో కలిసే భోజనం చేయనున్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏటా జనవరి 12న నేషనల్ యూత్ డే నిర్వహిస్తారు.
మహారాష్ట్రలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్, రోహింగ్యాల వెనుక ఉన్న డాక్యుమెంట్ల ఫోర్జరీ సిండికేట్‌కు రాజకీయ నేతలు, అధికారులు, NGOలతో లింకులు ఉన్నట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అక్రమ వలసదారులకు ధ్రువపత్రాలు మంజూరు చేసి వారిని ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నట్టు వెలుగులోకొచ్చింది. పాస్‌పోర్టులు కూడా పొందుతున్నట్టు తేలింది. ఈ విషయమై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.
కేరళలో దారుణ ఘటన జరిగింది. అథ్లెట్‌గా ఉన్న ఓ బాలిక(18)పై ఐదేళ్ల పాటు 60మందికి పైగా మృగాళ్లు లైంగిక అకృత్యాలకు పాల్పడ్డారు. శిశు సంక్షేమ కమిటీ ముందు ఆమె తాజాగా తన గోడును వెళ్లబోసుకోవడంతో విషయం వెలుగుచూసింది. తనకు 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచీ ఇరుగు పొరుగు వ్యక్తులు, కోచ్‌లు, తోటి అథ్లెట్లు లైంగికంగా వేధించారని ఆమె ఫిర్యాదు చేసింది. 40మందిపై పోక్సో కేసులు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
టీమ్ ఇండియా సెలక్షన్ విధానాలపై వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ విమర్శలు గుప్పించారు. ‘మన స్టార్ క్రికెటర్లను ఫామ్ లేకపోయినా తప్పించరు. చిన్న ఆటగాళ్లను మాత్రం నిర్దాక్షిణ్యంగా తప్పిస్తారు. ఒకవేళ పెద్ద ఆటగాళ్లను తప్పించినా, ఆ విషయానికి తేనెపూసి గాయమనో, ఆటగాడే తప్పుకున్నాడనో చెబుతారు. ఇది తప్పుడు సందేశాన్ని ఇస్తుంది. సూపర్ స్టార్ కల్చర్‌కి దారి తీస్తుంది. సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలి’ అని పేర్కొన్నారు.
పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిపే స్పెషల్ బస్సులకు కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను సవరించినట్లు TGSRTC తెలిపింది. 2003లో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 16 ప్రకారమే కేవలం 5 రోజులపాటు ధరలను సవరించినట్లు పేర్కొంది. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ లేకపోయినా బస్సులను వెంటనే వెనక్కి రప్పిస్తున్నట్లు వివరించింది. సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను <<15112625>>50% పెంచిన<<>> సంగతి తెలిసిందే.
TG: భూ భారతి చట్టం కోసం చాలా కష్టపడ్డామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 15 నుంచి 28వ తేదీ లోపు ఈ చట్టం పూర్తిగా అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా దీనిని అమలు చేస్తామని చెప్పారు. ధరణి ద్వారా ఆక్రమించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని, ధరణిని వాడుకుని తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
ODIల్లో రోహిత్ శర్మ మరో 134 రన్స్ చేస్తే అత్యంత వేగంగా 11వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలవనున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (222 ఇన్నింగ్స్‌లు), సచిన్ (276 ఇన్నింగ్స్‌లు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. రోహిత్ ఇప్పటివరకు 257 ఇన్నింగ్స్‌లలో 10,866 రన్స్ చేశారు. నెక్స్ట్ 19 ఇన్నింగ్స్‌లలో 134 పరుగులు చేసి ఈ మైలురాయిని చేరుకుంటే సచిన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలుస్తారు.
ప్రస్తుత పాలకులు ఇంకెంతకాలం ప్రజలను మోసగిస్తారంటూ DMKపై TVK అధినేత, యాక్టర్ విజయ్ మండిపడ్డారు. ‘అధికారంలోకి వస్తే నీట్ ఎగ్జామ్‌ను రద్దు చేస్తామని 2021 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. రద్దు చేయించే సీక్రెట్ తెలుసని ఊదరగొట్టారు. ఇప్పుడేమో నీట్‌ను రద్దుచేసే అధికారం కేంద్రానిదే అంటున్నారు. దీనికోసమే మీకు ఓటేసిన వారిని ఇది మోసం చేసినట్టు కాదా’ అని ప్రశ్నించారు. తమిళంలో ఓ పాట లిరిక్స్‌ను షేర్ చేశారు.
Sorry, no posts matched your criteria.