News June 2, 2024

‘విద్యాకానుక’ రెడీ.. 12న పంపిణీకి ఏర్పాట్లు

image

AP: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందించే విద్యాకానుక కిట్లను అధికారులు సిద్ధం చేశారు. వాటిని మండల స్టాక్ పాయింట్లకు చేరవేశారు. జూన్ 12న స్కూళ్లు తెరిచిన తొలిరోజే వాటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాకానుక కిట్‌లో బ్యాగు, బెల్టు, బూట్లు, సాక్సులు, పాఠ్య, నోటు పుస్తకాలు, వర్క్‌బుక్స్, డిక్షనరీ, యూనిఫామ్ క్లాత్ ఉంటాయి. ఈ ఏడాది 38లక్షల మంది స్టూడెంట్లకు కిట్లను అందించనున్నారు.

News June 2, 2024

నేడో, రేపో సీమలోకి నైరుతి.. భారీ వర్షాలు

image

AP: నైరుతి రుతు పవనాలు నేడో, రేపో రాయలసీమలోకి ప్రవేశిస్తాయని IMD వెల్లడించింది. దీని ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతుండగా, రానున్న నాలుగు రోజులు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. ఇవాళ అల్లూరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంది.

News June 2, 2024

జనసేనకు జై కొట్టిన ఎగ్జిట్ పోల్స్!

image

AP: జనసేన పార్టీకి అన్ని ఎగ్జిట్ పోల్స్ జై కొట్టాయి. ఆ పార్టీ దాదాపు 15 నుంచి 18 అసెంబ్లీ స్థానాల్లో గెలవనుందని అంచనా వేశాయి. అలాగే పోటీ చేసిన 2 ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకుంటుందని వెల్లడించాయి. దాదాపు పోటీ చేసిన మొత్తం సీట్లను జనసేన గెలుచుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ 40 వేల నుంచి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని అన్ని సర్వేలు తెలిపాయి.

News June 2, 2024

‘పోస్టల్ బ్యాలెట్’పై సుప్రీంకోర్టుకు వెళ్తాం: సజ్జల

image

AP: పోస్టల్ <<13358298>>బ్యాలెట్<<>> విషయంలో EC నిర్ణయం అనైతికమని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని YCP ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఓట్ల లెక్కింపుపై EC గత ఏడాది స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. ‘పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌లో అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీలు కచ్చితంగా ఉండాలి. సీలు లేకుంటే హోదా వివరాలుండాలని చెప్పారు. పోలింగ్ అయ్యాక అవి అవసరం లేదనడం సరికాదు’ అని పేర్కొన్నారు.

News June 2, 2024

వాహనదారులకు బ్యాడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలు పెంపు

image

దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు సగటున 5% పెరిగాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఏటా APR 1న NHAI టోల్ ఛార్జీలు పెంచుతుంది. ఈసారి ఎన్నికలు ఉండటంతో EC ఆదేశాలతో వాయిదా వేసింది. HYD-విజయవాడ హైవేపై కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి రూ.5, రెండు వైపులా కలిపి రూ.10 పెరిగింది. తేలికపాటి వాణిజ్య వాహనాలు రూ.10-20, బస్సులు, ట్రక్కులు రూ.25-35, భారీ రవాణా వాహనాలకు రూ.35-50కి పెరిగాయి.

News June 2, 2024

T20 WC: బౌలింగ్ ఎంచుకున్న USA

image

డల్లాస్ వేదికగా కెనడాతో జరుగుతున్న టీ20 WC తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు అమెరికా టాస్ గెలిచింది. కెప్టెన్ మొనాంక్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నారు.
కెనడా: జాన్సన్, నవనీత్, పర్గత్, కిర్టన్, శ్రేయాస్, దిల్‌ప్రీత్, సాద్ బిన్ జాఫర్, నిఖిల్, హేలిగర్, కలీమ్ సనా, జెరెమీ గోర్డాన్
USA: టేలర్, మొనాంక్ , ఆండ్రీస్, జోన్స్, నితీష్, అండర్సన్, హర్మీత్, షాల్క్‌విక్, జస్దీప్, అలీఖాన్, సౌరభ్

News June 2, 2024

నేటి నుంచే T20 WC.. కాసేపట్లో మ్యాచ్

image

IPL ముగిసినా క్రికెట్ అభిమానులను అలరించేందుకు T20 WC సిద్ధమైంది. ఇవాళ ఉ.6 గం.కు USA-కెనడా మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో పొట్టి కప్ సంగ్రామానికి తెర లేవనుంది. రా.8 గం.కు విండీస్-పపువా న్యూగినియా మ్యాచ్ జరగనుంది. WC తొలి సీజన్‌(2007)లో టైటిల్ గెలిచిన IND.. ఇప్పటివరకు మళ్లీ కప్పు కొట్టలేదు. ఈసారైనా ఆ కోరిక తీరాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈనెల 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో IND టైటిల్ వేట మొదలవుతుంది.

News June 2, 2024

ఇవాళ స్థానిక సంస్థల MLC ఉపఎన్నిక ఫలితాలు

image

TG: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ MLC ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉ.8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 1,439 ఓట్లలో 1,437 పోలయ్యాయి. ఈ ఎన్నికలో మన్నె జీవన్‌రెడ్డి(కాంగ్రెస్), నవీన్‌కుమార్ రెడ్డి(బీఆర్ఎస్), సుదర్శన్ గౌడ్(స్వతంత్ర) పోటీ చేశారు. MLC కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది.

News June 2, 2024

నేడు తెలంగాణ దశాబ్ది వేడుకలు

image

తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావడంతో నేటి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఉ.9.30గం.కు CM రేవంత్ గన్‌పార్క్‌లోని అమరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తారు. 9.55గం.కు పరేడ్ గ్రౌండ్‌లో జాతీయజెండా ఆవిష్కరిస్తారు. ‘జయజయహే తెలంగాణ’ను రాష్ట్ర అధికార గేయంగా జాతికి అంకితమిస్తారు. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కళాకారుల ధూం ధాం ప్రదర్శనలు, లేజర్ షో, ఫైర్ వర్క్స్, కార్నివాల్ కార్యక్రమాలు ఉంటాయి.

News June 2, 2024

24వేల మార్క్ దాటేందుకు నిఫ్టీ రెడీ?

image

బీజేపీదే మరోసారి అధికారం అని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్న నేపథ్యంలో మార్కెట్లలో ఒడుదొడుకులకు చెక్ పడొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రేపటి నుంచి మార్కెట్లు దూసుకెళ్లొచ్చని అంచనా వేశారు. ఒకవేళ 4న వెల్లడయ్యే ఫలితాలు కూడా బీజేపీకి సానుకూలంగా వస్తే నిఫ్టీ 24వేల మార్క్‌ను దాటుతుందని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం 100 రోజుల్లో తీసుకునే నిర్ణయాలపై మార్కెట్లు దృష్టి సారిస్తాయని తెలిపారు.