News June 2, 2024
‘పోస్టల్ బ్యాలెట్’పై సుప్రీంకోర్టుకు వెళ్తాం: సజ్జల
AP: పోస్టల్ <<13358298>>బ్యాలెట్<<>> విషయంలో EC నిర్ణయం అనైతికమని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని YCP ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఓట్ల లెక్కింపుపై EC గత ఏడాది స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. ‘పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌లో అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీలు కచ్చితంగా ఉండాలి. సీలు లేకుంటే హోదా వివరాలుండాలని చెప్పారు. పోలింగ్ అయ్యాక అవి అవసరం లేదనడం సరికాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News September 13, 2024
హైజాక్ ఫ్లైట్‌లో నా తండ్రీ ఉన్నారు: జైశంకర్
1984 విమాన హైజాక్ ఘటనపై ‘IC-814’ మూవీ వచ్చిన నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘హైజాకర్లతో సంప్రదింపులు జరిపిన బృందంలో నేనూ సభ్యుడిని. కొన్నిగంటల తర్వాత విమానంలో నా తండ్రి కూడా ఉన్నారని తెలిసింది. అది నాకు చాలా భిన్నమైన అనుభవం. ఓవైపు ప్రభుత్వం తరఫున జవాబుదారీతనం, మరోవైపు గవర్నమెంట్‌పై ఒత్తిడి తెచ్చిన బాధిత కుటుంబంలో సభ్యుడిగా ఉండాల్సి వచ్చింది’ అని తెలిపారు.
News September 13, 2024
వ్యాపారవేత్తకు అన్నామలై క్షమాపణలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తమిళనాడు శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ ఓనర్ శ్రీనివాసన్ క్షమాపణలు చెబుతున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిగతమైన వీడియో బయటికి వెళ్లడం బాధాకరమని పేర్కొన్నారు. శ్రీనివాసన్‌కు ఫోన్ చేసి మాట్లాడానని, తమిళనాడు వ్యాపార వర్గాల్లో ఆయన ఓ దిగ్గజమని ఈ సందర్భంగా అన్నామలై కొనియాడారు.
News September 13, 2024
APPLY: BISలో 315 ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియాలో 315 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. సీనియర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, పర్సనల్ అసిస్టెంట్ విభాగాల్లో ఖాళీలున్నాయి. అభ్యర్థులు SEP 30వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. విద్యార్హత, వయో పరిమితి, జీతభత్యాల వివరాల కోసం ఈ <