News June 2, 2024

బీజేపీ పరువునష్టం కేసు.. రాహుల్‌కు కోర్టు ఆదేశాలు

image

పరువునష్టం కేసుకు సంబంధించి ఈనెల 7న విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని బెంగళూరులోని స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో శనివారం విచారణకు హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు అభివృద్ధి పనుల్లో నాటి BJP ప్రభుత్వం 40% కమిషన్ తీసుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై బీజేపీ పరువునష్టం దావా వేసింది.

News June 2, 2024

రిటైర్మెంట్‌తో దినేశ్ కార్తీక్ సరికొత్త రికార్డు

image

టీమ్ ఇండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇండియా తరఫున అత్యధిక కాలం క్రికెట్ ఆడిన వికెట్ కీపర్‌గా డీకే నిలిచారు. కార్తీక్ భారత్ తరఫున 2004 సెప్టెంబర్ 5న తొలి మ్యాచ్ ఆడారు. చివరి మ్యాచ్ 2022 నవంబర్ 2న ఆడారు. అతడి ఇంటర్నేషనల్ కెరీర్ 18ఏళ్ల 58 రోజులు సాగింది. 79 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 1752 రన్స్, 48 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 686 రన్స్ చేశారు.

News June 2, 2024

నేడే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు

image

ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. ఉదయం 6 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం కానుంది. అరుణాచల్‌లో ఇప్పటికే 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికవగా ఈరోజు మిగతా 50 స్థానాలకు లెక్కింపు జరుగుతుంది. మరోవైపు సిక్కింలోనూ 32 స్థానాల భవితవ్యం నేడు తేలనుంది. కాగా ఈ రెండు రాష్ట్రాల లోక్‌సభ స్థానాల ఫలితాలు 4వ తేదీన వెల్లడవుతాయి. <<-se>>#Elections2024<<>>

News June 2, 2024

మోదీ PM అయితే గుండు కొట్టించుకుంటా: AAP ఎమ్మెల్యే

image

నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ సవాల్ చేశారు. ఆయన న్యూ ఢిల్లీ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీగా పోటీలో ఉన్నారు. ఇదిలా ఉంటే కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ జూన్ 4న తప్పు అని తేలుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

News June 2, 2024

జూన్ 2: చరిత్రలో ఈరోజు

image

1889: స్వాతంత్ర్య సమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జననం
1897: చారిత్రక పరిశోధకుడు కొత్త భావయ్య జననం
1939: మలయాళ కవి, పద్మశ్రీ గ్రహిత విష్ణు నారాయణ్ నంబూత్రి జననం
1956: సినీ దర్శకుడు మణిరత్నం జననం
1964: సినీ దర్శకుడు గుణశేఖర్ జననం
1988: బాలీవుడ్ దిగ్గజ నటుడు రాజ్ కపూర్ వర్ధంతి
>> తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

News June 2, 2024

కోచ్‌గా గంభీర్‌ను నియమిస్తే మంచిదే: గంగూలీ

image

భారత జట్టుకు కోచ్‌గా గంభీర్‌ను ఎంపిక చేస్తే అది మంచి నిర్ణయం అవుతుందని మాజీ క్రికెటర్ గంగూలీ అన్నారు. గౌతీ నిజాయితీపరుడు, గేమ్‌ను అర్థం చేసుకోగల వ్యక్తని కొనియాడారు. మెంటార్‌గా KKRను విజయవంతంగా నడిపిన ఆయనకు ప్రధాన కోచ్ అవడానికి అన్ని లక్షణాలు ఉన్నాయన్నారు. విరాట్, రోహిత్ వంటి స్టార్లను డీల్ చేయడం గౌతీకి తెలుసని చెప్పారు. ఆయన జట్టులోకి వస్తే మంచి మార్పు తీసుకొస్తారని దాదా అభిప్రాయపడ్డారు.

News June 2, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 2, 2024

సునీత అంతరిక్షయానం మళ్లీ వాయిదా

image

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షయానం మరోసారి వాయిదా పడింది. ఆమె ప్రయాణించాల్సిన బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తింది. దీంతో లాంచ్‌కు మరో మూడు నిమిషాలు ఉందనగా ప్రయోగం నిలిచిపోయింది. వ్యోమగాములు సునీత, విల్మర్ సురక్షితంగా బయటకొచ్చారు. ఇలా బోయింగ్ స్టార్‌లైనర్ ప్రయోగం ఆగిపోవడం ఇది రెండోసారి. మే 7న కూడా సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం వాయిదా పడింది.

News June 2, 2024

రూ.11వేల కోట్ల వివాదం.. తల్లిపై కొడుకు కేసు

image

తన తల్లి బినా తనపై దాడి చేయించారని గాడ్‌ఫ్రే ఫిలిప్స్ కంపెనీ డైరెక్టర్ సమీర్ మోదీ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ప్రముఖ వ్యాపారవేత్త KK మోదీ రూ.11వేల కోట్ల వారసత్వ ఆస్తి వివాదం మరింత ముదిరింది. KK మోదీకి చిన్న కుమారుడు ఈ సమీర్ మోదీ. కాగా కంపెనీలోని తన షేర్లను విక్రయించాలని సెక్యూరిటీ, కంపెనీలోని మిగతా డైరెక్టర్లతో తల్లి తనపై దాడి చేయించారని సమీర్ ఫిర్యాదు చేశారు.

News June 2, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 2, ఆదివారం ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:14 గంటలకు అసర్: సాయంత్రం 4:49 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6:47 గంటలకు ఇష: రాత్రి 8.08 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.