News June 1, 2024

CVoter: యూపీలో 2019 సీన్ రిపీట్?

image

ఉత్తర ప్రదేశ్‌లో ఈ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు దాదాపు 2019 ఫలితాలనే గుర్తు చేస్తాయని ABP CVoter ఎగ్జిట్ పోల్‌లో వెల్లడైంది. ఎన్డీయేకు 62-66సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇండియా కూటమికి 15-17 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. 2019 ఎన్నికల్లో NDAకి 62 సీట్లు వచ్చాయి.

News June 1, 2024

T20WC: అత్యధిక POTMలు కోహ్లీవే!

image

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్న ఘనత టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. విరాట్ ఇప్పటివరకు 7 సార్లు POTM అందుకున్నారు. ఆయన తర్వాత మహేల జయవర్ధనే (5), క్రిస్ గేల్ (5), షేన్ వాట్సన్ (5), షాహిద్ అఫ్రీది (4), తిలకరత్నే దిల్షాన్ (4), డివిలియర్స్ (4) ఉన్నారు.

News June 1, 2024

ఏపీలో వైసీపీకి 2-4 ఎంపీ సీట్లు: ఇండియా టుడే

image

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి ఈసారి 2-4 ఎంపీ సీట్లు వస్తాయని ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే వెల్లడించింది. కూటమికి 21-23 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను ఆదివారం సాయంత్రం ప్రకటిస్తామని తెలిపింది. దేశంలో పోల్ సర్వేల్లో ఇండియా టుడే మై యాక్సిస్‌కు విశ్వసనీయత ఎక్కువ. ఇప్పటివరకు వచ్చిన అంచనాలు మిక్స్‌డ్‌గా ఉండటంతో ఈ సంస్థ ఏం చెప్పబోతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

News June 1, 2024

తెలంగాణలో బీజేపీ హవా: ఇండియా టుడే సర్వే

image

తెలంగాణలో బీజేపీ 11-12 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తుందని ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే తెలిపింది. కాంగ్రెస్: 4-6, బీఆర్ఎస్: 0-1, ఎంఐఎం: 1 ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ అంచనాలో వెల్లడించింది.

News June 1, 2024

కంగనా రనౌత్‌దే గెలుపు: India Today

image

రాజకీయ అరంగేట్రం చేసిన నటి కంగనా రనౌత్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని India Today Axis My India అంచనా వేసింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానంలో ఆమె కాషాయ జెండా ఎగరవేస్తారని తెలిపింది. మండి బరిలో నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత విక్రమాదిత్య సింగ్‌కు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొంది. కాగా ఈ స్థానానికి ఇవాళే పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.

News June 1, 2024

CVoter: మళ్లీ NDAదే అధికారం!

image

కేంద్రంలో NDA అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొడుతుందని CVoter సర్వే అంచనా వేసింది. BJP నేతృత్వంలోని NDAకి 353-383 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని INDIA కూటమికి 152-182 సీట్లు వస్తాయని అభిప్రాయపడింది. ఇతరులకు 04-12 సీట్లు వచ్చే అవకాశం ఉందంది.

News June 1, 2024

బీజేపీ దశాబ్దాల కల నెరవేరనుందా?

image

తమిళనాడు, కేరళ నుంచి లోక్‌సభలో బీజేపీకి ప్రాతినిధ్యం ఉండబోతోందా? అంటే.. ఎగ్జిట్ పోల్స్ అవుననే సమాధానం ఇస్తున్నాయి. దాదాపు అన్ని మీడియా, సర్వే సంస్థలు తమిళనాడులో ఒకటి, కేరళలో 1-3 స్థానాలు ఆ పార్టీ గెలవొచ్చని అంచనా వేశాయి. ఇవే నిజమైతే దశాబ్దాలుగా BJPకి ప్రాతినిధ్యం లేని ఆ రాష్ట్రాల్లో పార్టీకి ఊపు వచ్చినట్లే. ఇటు APలోనూ 2 నుంచి 4 సీట్ల వరకు బీజేపీ గెలవొచ్చని సర్వే అంచనాలు పేర్కొంటున్నాయి.

News June 1, 2024

ఉత్తరాఖండ్‌లో NDA క్లీన్ స్వీప్

image

ఉత్తరాఖండ్‌లో NDA కూటమి 5 పార్లమెంట్ సీట్లతో క్లీన్ స్వీప్ చేస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్‌లో వెల్లడైంది. కాంగ్రెస్‌కి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదంది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఇక్కడ ఖాతా తెరవలేకపోయింది.

News June 1, 2024

అన్నామలై ఓడిపోతారు: India Today

image

కోయంబత్తూరులో పోటీ చేసిన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఓడిపోవచ్చని India Today-Axis My India ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఆయనపై ఇండియా కూటమి తరఫున నిల్చున్న DMK నేత గణపతి రాజ్‌కుమార్ విజయం సాధిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ అంచనాపై ఇండియా టుడేతో మాట్లాడిన అన్నామలై.. జూన్ 4న సర్‌ప్రైజ్ ఇస్తానన్నారు. కాగా TNలో బీజేపీ బలోపేతానికి అన్నామలై తీవ్రంగా కృషి చేస్తున్నారు.

News June 1, 2024

క్రికెట్‌కు దినేశ్ కార్తీక్ వీడ్కోలు

image

భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన కోచ్‌లు, కెప్టెన్లు, సెలక్టర్లు, టీమ్‌మేట్స్, అభిమానులకు థాంక్స్ చెప్పారు. భారత జట్టుకు ఆడటం తన అదృష్టమన్నారు. తన జర్నీలో పేరెంట్స్ పిల్లర్లుగా ఉన్నారని చెప్పారు. భార్య దీపిక తన కెరీర్‌ను పణంగా పెట్టి తనకు సపోర్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు.