News May 31, 2024

ప్రిపోల్ సర్వే Vs ఎగ్జిట్ పోల్ సర్వే.. తేడా ఏంటి?

image

పోలింగ్ రోజు ఓటేసిన వారిని అడిగి చేసేది ఎగ్జిట్ <<13084247>>పోల్<<>> సర్వే. పోలింగ్‌కు ముందు నిర్దిష్ట సమయమంటూ లేకుండా చేసేది ప్రిపోల్ సర్వే. ఇందులో పాల్గొన్న వారు కొన్నిసార్లు ఓటు వేయకనూపోవచ్చు. ప్రిపోల్ సర్వేలో ఎవరిని ప్రశ్నించాలనేది నిర్వాహకులు ముందే నిర్ణయించుకుంటారు. ఎగ్జిట్ పోల్‌లో మాత్రం యాదృచ్ఛికంగా అడుగుతారు. ప్రిపోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్‌లో కచ్చితమైన ఫలితాలకు అవకాశమెక్కువ. <<-se>>#Elections2024<<>>

News May 31, 2024

మెడిటేషన్ కాదు.. ఎడిటేషన్: అభిషేక్‌ సింఘ్వీ

image

ప్రధాని మోదీ 45 గంటల ధ్యానంపై కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కెమెరాల ముందు పబ్లిసిటీ కోసం ధ్యానం చేస్తున్నట్లు ఉందని ఆయన ట్వీట్ చేశారు. దీనికి క‌న్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియ‌ల్‌లో మోదీ చేస్తున్నది ‘మెడిటేషన్ కాదు.. ఎడిటేషన్’ అంటూ ఓ సెటైరికల్ ఫొటోను జతచేశారు. ఈ పోస్ట్‌ను రీట్వీట్‌ చేస్తూ ఆ పార్టీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.

News May 31, 2024

థియేటర్లలో ఎన్నికల ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాలను మహారాష్ట్రలోని ముంబైతో పాటు పలు నగరాల్లో థియేటర్లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. MovieMax ఆధ్వర్యంలోని అన్ని థియేటర్లలో దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు లైవ్ సహా బ్రేకింగ్ న్యూస్‌‌లను ప్రదర్శించనున్నారు. జూన్ 4న ఉ.9గం. నుంచి మ.3గంటల వరకు ఈ ప్రసారాలు ఉంటాయి. టికెట్ ధర రూ.99గా నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

News May 31, 2024

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మళ్లీ థియేటర్లు కళకళ!

image

గత కొన్ని రోజులుగా తెలుగు సినిమాలు రిలీజ్ అవ్వక థియేటర్లు బోసిపోయి కనిపించాయి. ఎట్టకేలకు ఈరోజు మూడు సినిమాలు రిలీజవడంతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం కనిపించింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ఆనంద్ దేవరకొండ ‘గమ్ గమ్ గణేశా’, కార్తికేయ ‘భజే వాయు వేగం’ సినిమాలు రిలీజయ్యాయి. మూడు సినిమాలు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నాయి. మీకేది నచ్చిందో కామెంట్ చేయండి.

News May 31, 2024

రద్దీగా ఉండే టాప్-10 విమానాశ్రయాలు

image

★ హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం
★ దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం
★ డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయం
★ హీత్రో విమానాశ్రయం, లండన్
★ టోక్యో హనేడా అంతర్జాతీయ విమానాశ్రయం, టోక్యో
★ డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం, డెన్వర్
★ ఇస్తాంబుల్ విమానాశ్రయం, టర్కీ
★ లాస్ ఏంజెలిస్ విమానాశ్రయం ★ చికాగో ఓహేర్ విమానాశ్రయం
★ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ

News May 31, 2024

ఏడో దశ పోలింగ్‌లో పేద అభ్యర్థి ఈమే

image

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న భానుమతి దాస్ ఏడో దశ ఎన్నికల్లో అత్యంత పేద అభ్యర్థి. ఆమె వద్ద కేవలం రూ.1500 మాత్రమే ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. లూధియానా నుంచి పోటీ చేస్తున్న రాజీవ్ కుమార్ రూ.2500, జాదవ్‌పూర్ బరిలో ఉన్న బలరామ్ మండల్ రూ.2500, కోల్‌కతా ఉత్తర్ నుంచి పోటీ చేస్తున్న స్వప్న దాస్ రూ.2700తో పేద అభ్యర్థుల జాబితాలో టాప్-4లో ఉన్నారు.

News May 31, 2024

విడిపోయిన స్టార్ కపుల్?

image

బాలీవుడ్ స్టార్ కపుల్ అర్జున్ కపూర్ – మలైకా అరోరా విడిపోయినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఇద్దరూ సహజీవనంలో ఉండగా.. తమ ప్రత్యేక బంధాన్ని బ్రేక్ చేసేందుకు వీరు సిద్ధమయ్యారట. ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగా ఎలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వకుండా గౌరవప్రదంగా విడిపోయినట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ క్లిష్ట సమయంలో అభిమానులు తమకు సపోర్ట్‌గా నిలుస్తారని వారు ఆశిస్తున్నారట.

News May 31, 2024

క్విక్ కామర్స్‌లోకి జియో?

image

రిలయన్స్ ఇండస్ట్రీస్ క్విక్ కామర్స్ రంగంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. ఇతర సంస్థల మాదిరి కాకుండా 30 నిమిషాల్లో డెలివరీ ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. ప్రతి ఏరియాలో డార్క్ స్టోర్లు ఏర్పాటు చేయకుండా సొంత స్టోర్లు, జియోమార్ట్ పార్ట్‌నర్‌లో భాగమైన 20లక్షల కిరాణ షాపుల నుంచి కస్టమర్లకు డెలివరీ చేయనుంది. తొలుత ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే, HYD, కోల్‌కతాలో సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

News May 31, 2024

ప్రజ్వల్ తల్లికీ సిట్ నోటీసులు.. ఎందుకంటే?

image

లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీకి సిట్ నోటీసులు ఇచ్చింది. ఓ మహిళపై ప్రజ్వల్ వేధింపులకు పాల్పడుతున్నట్లు ఉన్న వీడియోలో భవానీ కూడా కనిపించారు. దీంతో బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు ఆమెపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఈక్రమంలోనే నోటీసులు పంపిన సిట్.. రేపు ఉ.10 గంటల నుంచి సా.5 గంటల మధ్య ఇంట్లోనే ఉండాలని ఆమెను ఆదేశించింది. మరోవైపు ప్రజ్వల్, భవానీ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేశారు.

News May 31, 2024

RBI బంగారాన్ని ఎలా తీసుకురానుంది?

image

ఇంగ్లండ్ సెంట్రల్ బ్యాంకులో దాచిన బంగారాన్ని ప్రత్యేక విమానంలో RBI ఇండియాకు తీసుకురానుంది. కేంద్ర ఆర్థిక శాఖ, కస్టమ్స్, ఏవియేషన్, స్థానిక విభాగాల సమన్వయంతో భారీ భద్రత మధ్య దీన్ని స్టోరేజ్ యూనిట్లకు తరలించనుంది. బయటి నుంచి తెస్తున్న ఈ మొత్తానికి కస్టమ్స్ డ్యూటీ మినహాయించింది. కానీ GSTలో రాష్ట్రాలకి వాటా వెళ్లే IGST (CGST+SGST)ని RBI చెల్లించాలి. 1991లోనూ ఇలాగే విమానంలో పసిడిని UKకు తరలించారు.