News May 31, 2024

ఎండ ప్రచండం.. 54 మంది మృతి

image

దేశంలో భానుడి ఉగ్రరూపం కొనసాగుతోంది. దీంతో ఢిల్లీ సహా తూర్పు, మధ్య, ఉత్తర భారతంలోని రాష్ట్రాల్లో గడిచిన 24 గంటల్లో 54 మంది మృత్యువాత పడ్డారు. <<13346989>>బిహార్‌లో<<>> అత్యధికంగా 34 మంది మరణించారు. మృతి చెందిన ఓ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదైనట్లు వైద్యులు గుర్తించారు. సాధారణ టెంపరేచర్ కంటే ఇది 10డిగ్రీలు అధికం. ఆయా రాష్ట్రాల్లో 45-48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు IMD తెలిపింది.

News May 31, 2024

ఏపీ, తెలంగాణ.. నిప్పుల కొలిమి

image

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం నుంచి ఎండ దంచికొడుతోంది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నా ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. అత్యవసరమైతే తప్ప సాయంత్రం 5 గంటల వరకు ఎవరూ బయటికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. శరీరం డీహైడ్రేట్ కాకుండా తరచూ నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు.

News May 31, 2024

టీమ్ఇండియాలో కోహ్లీది కీలక పాత్ర: రాయుడు

image

టీ20 వరల్డ్ కప్‌‌లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రదర్శన కీలకం కానుందని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ‘ఎంతో అనుభవం కలిగిన కోహ్లీ భారత జట్టులో కీలక ఆటగాడు. ఆయనో బిగ్ మ్యాచ్ ప్లేయర్. ఆయన బ్యాటింగ్, దూకుడుతనం టీమ్ఇండియాకు కీలకం. చివరి టీ20 వరల్డ్ కప్‌లోనూ పాక్‌పై కోహ్లీ ఇన్నింగ్స్ చూశాం’ అని రాయుడు పేర్కొన్నారు.

News May 31, 2024

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ OTT పార్ట్‌నర్ ఫిక్స్

image

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ OTT పార్ట్‌నర్‌ ఫిక్స్ అయ్యింది. OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకుంది. మరో 2 నెలల తర్వాత ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కృష్ణచైతన్య తెరకెక్కించిన ఈ మూవీలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. హైపర్ ఆది, సాయికుమార్, గోపరాజు రమణరాజు కీలకపాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

News May 31, 2024

పొగాకుకు దూరంగా ఉండండి: సచిన్

image

ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా పొగాకు ఉత్పత్తులను సేవించకూడదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన అభిమానులకు పిలుపునిచ్చారు. ‘పొగాకును ఎప్పుడూ ప్రమోట్ చేయొద్దని నా అంతర్జాతీయ కెరీర్ ప్రారంభంలో మా నాన్న సలహా ఇచ్చారు. నేను దానికి కట్టుబడి ఉన్నాను. మీరూ అలాగే ఉండండి. మంచి భవిష్యత్తు కోసం పొగాకు కంటే ఆరోగ్యాన్ని ఎంచుకుందాం’ అని Xలో పోస్ట్ చేశారు.

News May 31, 2024

ఏడో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం

image

లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు యూపీ, బిహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ సహా 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. కొన్ని న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంతాలకు హెలికాప్ట‌ర్ల‌లో సిబ్బందిని తరలించారు. శనివారం ఉ.7 గంటల నుంచి సా.6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

News May 31, 2024

US స్పెల్లింగ్ బీ విజేతగా తెలుగు సంతతి విద్యార్థి

image

USలో ప్రతిష్ఠాత్మక నేషనల్ స్పెల్లింగ్ బీ-2024 విజేతగా తెలుగు సంతతికి చెందిన బృహత్ సోమ(12) నిలిచాడు. ఇతను కప్‌తో పాటు $50వేల నగదు బహుమతి పొందాడు. పోటీలో 245 మంది పాల్గొనగా, ఫైనల్‌లో బృహత్, ఫైజన్ జాకీ మధ్య టై ఏర్పడింది. ఇద్దరికీ 90 సెకన్ల సమయం ఇవ్వగా జాకీ 20 పదాలు, బృహత్ 29 పదాల స్పెల్లింగ్‌లను తప్పులేకుండా చెప్పి టైటిల్ సొంతం చేసుకున్నాడు. అతని తండ్రి శ్రీనివాస్ స్వస్థలం తెలంగాణలోని నల్గొండ.

News May 31, 2024

చిహ్నం జోలికి వెళ్లకపోవడం మంచిది: నారాయణ

image

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతం ఆవిష్కరించనుండటం సంతోషించదగ్గ విషయమని CPI జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. కానీ అధికారిక చిహ్నం జోలికి వెళ్లకపోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి కూడా జగన్‌ను ఫాలో అవుతున్నారని విమర్శించారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ కక్షలు ఉండకూడదన్నారు. KCR చేసిన ప్రతిదాన్ని రివర్స్ చేస్తే రేవంత్ తన నెత్తిన తానే చెత్త వేసుకున్నట్లు అవుతుందని నారాయణ హితవు పలికారు.

News May 31, 2024

రేపటి నుంచి భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో రేపటి నుంచి 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40KM వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. రేపు నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, HYD, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. జూన్ 10 లోపు <<13346855>>రాష్ట్రంలోకి<<>> నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి.

News May 31, 2024

సమంత-నాగచైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగే కారణం: బూర

image

TG: ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత-నాగచైతన్య విడిపోయారనే ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలంటూ BJP చేపట్టిన నిరసన దీక్షలో ఆ పార్టీ నేత బూర నర్సయ్య గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సమంత-నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగే కారణమన్నారు. ట్యాపింగ్‌తో ఇతరుల బెడ్ర‌ూమ్స్‌లోకి తొంగి చూశారని ఆరోపించారు. హరీశ్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేసి ఓ ఫైల్ రెడీ చేయించారని అన్నారు.