News May 31, 2024

నమ్మకమైన రిక్రూటర్లను ఎలా గుర్తించాలి?(2/2)

image

✒ నమ్మకమైన కంపెనీలు, రిక్రూటింగ్ ఏజెన్సీలు పూర్తి కాంటాక్ట్ వివరాలతో ప్రొఫెషనల్ వెబ్‌సైట్స్‌ను కలిగి ఉంటాయి.
✒ LinkedIn, Glassdoor లాంటి జాబ్ పోర్టల్స్‌లో పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఉంటుంది.
✒ నిజమైన కంపెనీలేవీ ఉద్యోగం ఇస్తామంటూ డబ్బు కోరవు.
✒ సర్టిఫికెట్ల జిరాక్సులపై HRD, MFA అటెస్టేషన్ మాత్రమే కోరుతాయి.
✒ విదేశీ ఆఫర్ లెటర్‌పై ఇండియన్ ఎంబసీ/కాన్సులేట్‌ను సంప్రదిస్తే పూర్తి వివరాలు అందిస్తారు.

News May 31, 2024

స్కూళ్లలో స్టేషనరీ, యూనిఫామ్స్ అమ్మొద్దు

image

అధిక ఫీజులతో ఇబ్బంది పడుతోన్న విద్యార్థుల తల్లిదండ్రులకు స్టేషనరీ, యూనిఫామ్‌ల ధరలు మించిన భారమవుతున్నాయి. స్కూల్‌లోనే యూనిఫారాలు, షూలు, బెల్ట్‌లను అధిక ధరలకు అమ్ముతున్నారు. దీనిపై విద్యాశాఖకు ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధమైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న అన్ని స్కూళ్లలో వీటిని అమ్మకూడదని యాజమాన్యాలకు సూచించింది. లాభాపేక్ష లేకుండా పుస్తకాలు, స్టేషనరీని విక్రయించాలని తెలిపింది.

News May 31, 2024

గ్రూప్-1 పరీక్షను పోస్ట్‌పోన్ చేయండి: RSP

image

TSPSC నిర్వహించే గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలని BRS నేత RS ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ‘జూన్ 9న గ్రూప్-1తో పాటు IB ఇన్‌స్పెక్టర్ ఎగ్జామ్‌ను సైతం తెలంగాణ నుంచి చాలా మంది రాస్తున్నారు. ఎన్నికల విధుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు గ్రూప్-1 పరీక్షకు ప్రిపేర్ కాలేదు. ఒక్క నెల టైమ్ ఇస్తే చదువుకుంటారు. నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోండి. పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి’ అని కోరారు.

News May 31, 2024

రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు వాహన తయారీ సంస్థలు సిద్ధం

image

FY24లో రికార్డు స్థాయిలో 4.23 మిలియన్ల ప్యాసింజర్స్ వెహికల్స్ అమ్మకాలతో ప్రముఖ తయారీ సంస్థలకు మంచి ప్రోత్సాహం లభించింది. మారుతీ, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, JSW-MG లాంటి సంస్థలు FY25లో రూ.లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. EVలలో టెక్నాలజీ అభివృద్ధి, కొత్త ప్లాంట్ల నిర్మాణం, నూతన SUVల ఆవిష్కరణపై దృష్టి సారించనున్నాయని నిపుణులు చెబుతున్నారు.

News May 31, 2024

రూ.1,150 కోట్ల విలువైన సొత్తు పట్టివేత: ఈసీ

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు రూ.1,150 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇది 2019తో పోల్చుకుంటే మూడు రెట్లు ఎక్కువని పేర్కొంది. ఢిల్లీ, కర్ణాటకలో రూ.200 కోట్లకుపైగా నగదు, బంగారం సీజ్ చేసినట్లు వెల్లడించింది. తమిళనాడులో రూ.150 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలో రూ.100 కోట్లకుపైగా సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది.

News May 31, 2024

చెరుకు రసం, కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?

image

చెరుకు రసం, కూల్ డ్రింక్స్‌తో ఆరోగ్యానికి హానికరమని ICMR వెల్లడించింది. ‘రోజులో పెద్దవారైతే 30గ్రాములు, 7-10 ఏళ్ల పిల్లలు 24 గ్రాములకు మించి షుగర్ తీసుకోరాదు. కేవలం 100ML చెరుకు రసంలో 13-15 గ్రాముల షుగర్ ఉంటుంది. అధిక చక్కెరలు కలిపిన ఫ్రూట్ జూస్‌ల కంటే నేరుగా పండ్లను తినడం ఉత్తమం. కూల్‌డ్రింక్స్‌లోని స్వీట్‌నర్స్, ఎడిబుల్ యాసిడ్స్ మనకు మంచిదికాదు. మజ్జిగ, నిమ్మరసం తాగడం ఉత్తమం’ అని పేర్కొంది.

News May 31, 2024

RBI వద్ద ఎంత పసిడి ఉంది?

image

రిజర్వు బ్యాంకు వద్ద $57.195 బిలియన్ల బంగారం (2024 మే 17 వరకు) నిల్వలున్నాయి. విదేశీ మారక నిల్వలు (నగదు, డిపాజిట్లు, బంగారం, బాండ్లు తదితరాలు) $648.7 బిలియన్లు. ముంబై, నాగపూర్ ఆఫీసులు, <<13348732>>ఇంగ్లండ్<<>> బ్యాంకు వంటి చోట్ల ఇది స్టోర్ చేశారు. రూపాయి పతనం, పలు దేశాల్లో అస్థిరత, పసిడికి డిమాండ్ వంటి కారణాలతో ఇటీవల RBI భారీగా స్వర్ణం సమకూర్చుకుంటోంది. గత ఆర్థిక సం.లో 27.5 టన్నుల పుత్తడి కొనుగోలు చేసింది.

News May 31, 2024

రూ.10 కాయిన్ తీసుకోవట్లేదా?

image

కొందరు చదువుకున్న వాళ్లు సైతం రూ.10 కాయిన్ తీసుకోవడంపై వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవల రూ.10 నోట్లు మార్కెట్లో ఎక్కువగా చలామణి కావట్లేదు. అయితే రూ.10 కాయిన్లు చెల్లుబాటులోనే ఉన్నాయని.. వాటిని వాడుకోవాలని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. అవి చెల్లవని గతంలో ఎవరో ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రూ.10 కాయిన్లు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం అవగాహన కల్పించాలని నెటిజన్లు కోరుతున్నారు.

News May 31, 2024

వేలాది బిడ్డల్ని చంపిన బలిదేవత ఎవరు?: KTR

image

TG: ట్విటర్‌లో కాంగ్రెస్‌పై KTR విమర్శలు గుప్పించారు. ‘ప్రత్యేక రాష్ట్రం పదేళ్లు తాత్సారం చేసి వందలాది మంది ఆత్మ బలిదానానికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. 1952లో సిటీ కాలేజీ వద్ద ఆరుగురు విద్యార్థులను, 1969-71 తొలిదశ ఉద్యమంలో 370మందిని కాల్చి చంపింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. స్వయంగా రేవంత్ చెప్పినట్లు వేలాది బిడ్డల్ని చంపిన బలిదేవత ఎవరు?’ అని ప్రశ్నిస్తూ అమరవీరుల స్తూపం ఫొటోను పోస్ట్ చేశారు.

News May 31, 2024

డైరెక్టర్ బుచ్చిబాబు తండ్రి కన్నుమూత

image

‘ఉప్పెన’ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బుచ్చిబాబు తండ్రి వెంకట్‌రావు నిన్న సాయంత్రం కన్నుమూశారు. స్వగ్రామమైన కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో ఈ రోజు అంత్యక్రియలు పూర్తి చేశారు. డైరెక్టర్ సుకుమార్, ఇతర సినీ ప్రముఖులు బుచ్చిబాబును పరామర్శించి ధైర్యం చెప్పారు.