News May 31, 2024

దండం పెడుతున్నా.. ఢిల్లీకి నీళ్లు ఇవ్వండి: కేజ్రీవాల్

image

ఢిల్లీలో తీవ్ర నీటి కొరత ఏర్పడిందని, కేంద్రం, ఇరుగుపొరుగు బీజేపీ పాలిత రాష్ట్రాలు నీటిని సరఫరా చేయాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ‘తీవ్ర ఉష్ణోగ్రతలతో ఢిల్లీలో నీటికి డిమాండ్ పెరిగింది. హరియాణా, యూపీ నుంచి సరఫరా తగ్గింది. దీంతో డిమాండ్ పెరిగి సప్లై తగ్గింది. ఈ సమయంలో రాజకీయాలు చేయొద్దని దండం పెట్టి అడుగుతున్నా. అందరం కలిసి ఈ సమస్యను ఎదుర్కొందాం’ అని కోరారు.

News May 31, 2024

బయట ఎందుకు దాచారు? ఎందుకు తెచ్చారు?

image

ఆర్థిక సంక్షోభం, అంతర్యుద్ధం వంటి సమస్యలతో చాలా దేశాలు బంగారం, ఇతర సంపదను విదేశాల్లో ఉంచుతాయి. దీంతో అవసరమైతే అక్కడ విక్రయిస్తే అధిక డబ్బు వస్తుంది. లేదంటే పరిస్థితి చక్కబడితే వెనక్కి తేవచ్చు. 1991లో మన ఆర్థిక మనుగడ ప్రశ్నార్థకం కావడంతో <<13348732>>RBI<<>> పసిడిని ఇంగ్లండ్‌లో ఉంచింది. ఇప్పుడు తెచ్చి ఆర్థిక స్థిరంగా ఉన్నామని ప్రపంచానికి చాటుతోందని నిపుణులు చెబుతున్నారు. అటు బయట వాల్టులకు ఇచ్చే ఫీజులూ మిగులుతాయి.

News May 31, 2024

IPL రిటెన్షన్ SRHకు కలిసొస్తుందా?

image

IPL 2025 మెగా వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకోవడానికి BCCI అంగీకరించినట్లు తెలుస్తోంది. RTM ద్వారా ఒకరిని దక్కించుకోవచ్చని సమాచారం. ఈ నిర్ణయం SRHకు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. కీలక ఆటగాళ్లు కమిన్స్, హెడ్, క్లాసెన్, అభిషేక్, నటరాజన్, భువనేశ్వర్‌లలో నలుగురిని రిటైన్ చేసుకోవచ్చు. మిగతా ఆటగాళ్లు కూడా కావాలనుకుంటే వేలంలో దక్కించుకోవచ్చు. రిటెన్షన్ ప్లేయర్లు ఎవరో కామెంట్ చేయండి.

News May 31, 2024

100 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన RBI

image

ఇంగ్లండ్‌లో 1991 నుంచి దాచిన బంగారంలో 100 టన్నులను రిజర్వు బ్యాంకు వెనక్కి తీసుకొచ్చింది. కొన్ని నెలల్లో దాదాపు ఇదే పరిమాణంలో మరోసారి పసిడి సంపదను దేశంలోకి తీసుకొస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2024 మార్చి నాటికి RBI 822.10 టన్నుల బంగారం కలిగి ఉంటే ఇందులో 408.31 టన్నులు దేశీయ వాల్టుల్లో ఉన్నాయి. 1991లో ఆర్థిక సంక్షోభంతో దేశీయంగా బంగారం విలువ పతనం కాకుండా ఇంగ్లండుకు RBI తరలించింది.

News May 31, 2024

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ REVIEW

image

జులాయిగా తిరిగే లంకల రత్న(విశ్వక్ సేన్) MLAగా గెలిచి టైగర్ రత్నాకర్‌గా మారడమే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కథ. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కునే సవాళ్లు, నేహా శెట్టితో ప్రేమ, రత్నమాల(అంజలి)తో ఉన్న సంబంధాన్ని సినిమాలో చూపించారు. విశ్వక్, అంజలి నటన, BGM, ఇంటర్వెల్ సీన్, ఫైట్స్, సెకండాఫ్ సినిమాకు ప్లస్. స్లో ఫస్ట్ ఆఫ్, కొత్తదనం లేని కథనం, పాత్రల మధ్య బలమైన సంఘర్షణ లేకపోవడం, బోరింగ్ సీన్స్ మైనస్.
రేటింగ్ 2.25/5

News May 31, 2024

పొగాకు నుంచి పిల్లలను రక్షిద్దాం!

image

మే 31న పొగాకు నిరోధక దినోత్సవాన్ని WHO నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘పొగాకు నుంచి పిల్లలను రక్షించడం’ థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. సర్వేల్లో 13-15 ఏళ్ల పిల్లల్లో నికోటిన్ ఉత్పత్తుల వినియోగం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి వ్యసనపరులుగా మారకముందే వారితో మాన్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే శ్వాసకోశ వ్యాధులు, గుండెపోటు, క్యాన్సర్, మానసిక ఆరోగ్య సమస్యలొస్తాయని హెచ్చరిస్తున్నారు.

News May 31, 2024

నైరుతి రుతుపవనాలు.. 3-4 రోజుల్లో ఏపీకి, 10 రోజుల్లో తెలంగాణకు!!

image

అరేబియా సముద్రంలో పడమర గాలులు మరింత బలపడితే 3-4 రోజుల్లో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు జూన్ 10లోగా తెలంగాణకు చేరుకుంటాయని తెలిపారు. రుతుపవనాల వల్ల ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణశాఖ ఇప్పటికే తెలిపింది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News May 31, 2024

అన్ని జట్లకూ టీమ్ ఇండియానే ముప్పు: మైకెల్ క్లార్క్

image

T20WCలో ఫేవరెట్ జట్టు ఏదో చెప్పేందుకు కష్టమని, కానీ అందులో భారత్ ఉంటుందని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. WC నెగ్గాలనుకునే జట్లకు టీమ్ ఇండియానే పెద్ద ముప్పు అని తెలిపారు. ‘భారత్ స్పిన్‌నే ఎక్కువగా నమ్ముకుంది. ఇది రిస్క్‌తో కూడుకున్నదే. అయితే ఆ జట్టు పొట్టి ఫార్మాట్‌లో చాలా క్రికెట్ ఆడింది. మిగతా టీమ్స్‌తో పోలిస్తే సన్నద్ధత కూడా బాగుంది’ అని చెప్పారు.

News May 31, 2024

పెంపుడు జంతువుల్లో పారాసైట్స్ చిత్రాలు.. భయంకరం

image

కుక్కలు, పిల్లుల శరీరంలో 180 రెట్లు(సైజ్) పారాసైట్ పురుగులు ఎక్కువగా పెరుగుతున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. వీటి మైక్రోస్కోపిక్ చిత్రాలు భయంకరంగా ఉన్నాయి. పెట్స్‌కు నిత్యం డివార్మ్ ఔషధాలు ఇవ్వాలట. లేదంటే పేగుల్లో 16 అడుగుల వరకు పరాన్నజీవులు పెరుగుతాయని, అతిసారం, బరువు తగ్గడం లాంటి సమస్యలు వస్తాయని సైంటిస్టులు తెలిపారు. ఇవి మనుషుల్లోనూ చేరుతాయని, పిల్లల కంటి చూపునకు హాని కలిగిస్తాయని చెప్పారు.

News May 31, 2024

BREAKING: ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్

image

AP: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయనను ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్‌గా నియమించింది. కాసేపట్లో ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కాగా ఈ సాయంత్రం ఏబీవీ ఉద్యోగ విరమణ చేయనున్నారు.