News May 31, 2024

AB వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత.. కాసేపట్లో పోస్టింగ్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ IPS ఆఫీసర్ AB వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. కాసేపట్లో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇవాళ ఉద్యోగ విరమణ చేయనున్న దృష్ట్యా ఆయనను సర్వీస్‌లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ABVకి పోస్టింగ్ ఇవ్వాలన్న క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లగా.. తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

News May 31, 2024

ఉమ్మడి రాజధాని పొడిగింపు అంశాన్ని లేవనెత్తాలి: లక్ష్మీనారాయణ

image

జూన్ 2వ తేదీతో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. ఈక్రమంలో తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మరికొన్నేళ్లు పొడిగించాలని డిమాండ్ చేయాలని CBI మాజీ JD లక్ష్మీనారాయణ కోరారు. ఈ అంశాన్ని APలోని అన్ని రాజకీయ పార్టీలు లేవనెత్తాలని సూచించారు. AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 5 ప్రకారం దీనికి అవకాశం ఉందని తెలిపారు. జగన్, CBN, పవన్, షర్మిలను ట్యాగ్ చేస్తూ Xలో పోస్ట్ చేశారు.

News May 31, 2024

సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ‘ఆ ఒక్కటీ అడక్కు’

image

అల్లరి నరేశ్ హీరోగా నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ్టి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మల్లి అంకం తెరకెక్కించిన ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించారు. వైవా హర్ష, అరియానా కీలక పాత్రలు పోషించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. చిలక ప్రొడక్షన్స్ మూవీని నిర్మించింది.

News May 31, 2024

ఏసీకి పూజ చేసిన వ్యక్తి.. నెట్టింట విమర్శలు

image

ఎండవేడిమికి అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనాన్నిస్తోన్న ఏసీ (ఎయిర్ కండీషనర్)లను ఆరాధించడం ఎంతో అవసరమని ఓ వ్యక్తి పూజ చేసిన ఫొటో వైరలవుతోంది. ఏసీలకు హారతిచ్చిన ఘటనను కొందరు నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. ఏసీలు అత్యధికంగా హీట్‌ను జెనరేట్ చేస్తాయని విమర్శిస్తున్నారు. చెట్లు మరింత చల్లదనాన్నిస్తాయని, ఉష్ణోగ్రతలు మరింత పెరగకముందే ప్రతి ఇంట్లో మొక్కలను పెంచుకోవడం మేలంటున్నారు.

News May 31, 2024

T20WC: 11 ఏళ్ల కరవు తీరుస్తారా?

image

టీమ్ ఇండియా ICC ట్రోఫీలు గెలవక 11 ఏళ్లు అవుతోంది. చివరిగా 2013లో ICC ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఆ తర్వాత 2023 వన్డే WC ఫైనల్లో ఓటమి పాలైంది. ప్రస్తుత భారత్ ఫామ్ చూస్తే T20 WCలో సెమీస్ చేరడం లాంఛనమే. సెమీస్‌లో గట్టి ప్రత్యర్థులపై భారత్ పోరాడాల్సి ఉంటుంది. రోహిత్, కోహ్లీ, సూర్య, పంత్ వంటి స్టార్లు ఉండటంతో అది సాధ్యమే. బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్ వంటి పేసర్లతో ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు.

News May 31, 2024

మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా నాన్న: మహేశ్

image

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తుచేసుకుంటూ తనయుడు మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఫొటోను పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్ డే నాన్నా. నిన్ను చాలా మిస్ అవుతున్నా. నా ప్రతి జ్ఞాపకంలో మీరెప్పటికీ జీవించి ఉంటారు’ అని పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో కృష్ణను చూస్తుంటే మహేశ్‌లానే ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2022 నవంబర్ 15న కృష్ణ తుదిశ్వాస విడిచారు.

News May 31, 2024

జూన్ రెండో వారంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు?

image

TG: టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను జూన్ రెండో వారంలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. పెండింగ్‌లో ఉన్న పండిట్, PETలకూ బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలని యోచిస్తోంది. ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు 60 వేల మంది టీచర్లు ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంది. TET అర్హతతో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పించాలని హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది.

News May 31, 2024

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ పబ్లిక్ టాక్

image

విశ్వక్‌సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. స్టోరీ పాతదే అయినా టేకింగ్ బాగుందని కొందరు అంటుండగా, మూస ధోరణిలో సినిమా ఉందని మరికొందరు అంటున్నారు. లంకల రత్న పాత్రలో విశ్వక్ యాక్టింగ్, అంజలి ఊర మాస్ నటన, కొన్ని డైలాగ్స్ బాగున్నాయని చెబుతున్నారు. నేహాశెట్టి తన పరిధి మేరకు నటించారని పేర్కొంటున్నారు.
కాసేపట్లో WAY2NEWS రివ్యూ..

News May 31, 2024

త్వరలో ‘జైభీమ్’ హీరోయిన్ ప్రేమ వివాహం?

image

కోలీవుడ్ హీరోయిన్ రజిషా విజయన్ త్వరలోనే సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వారు కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. రజిషా తెలుగులో రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించారు. కర్ణన్, జైభీమ్, సర్దార్ వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారు.

News May 31, 2024

విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తే పీడీ యాక్ట్: సీఎస్

image

TG: రాష్ట్రవ్యాప్తంగా విత్తనాల కొరతతో రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించి, కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని CS శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. గోదాములు, దుకాణాలను నిత్యం తనిఖీ చేయాలని సూచించారు. పీడీ యాక్ట్ కింద అరెస్టయితే 3-12 నెలలు బెయిల్ కూడా దొరకదు.