News May 31, 2024

యూనిఫామ్స్ కుట్టు కూలీ రూ.70కు పెంచుతాం: సందీప్

image

TG: మహిళా సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో 70 లక్షల యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను వారికి అప్పగించామన్నారు. రూ.50 ఉన్న డ్రెస్ కుట్టు కూలీని రూ.70కు పెంచేలా త్వరలోనే జీవో విడుదల చేస్తామని చెప్పారు. వస్త్రాల కటింగ్ కోసం యంత్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

News May 31, 2024

T20WC: ఆసీస్‌కు విండీస్ షాక్!

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు వెస్టిండీస్ షాక్ ఇచ్చింది. ఆ జట్టును 35 పరుగుల తేడాతో చిత్తు చేసి మిగతా జట్లకూ హెచ్చరికలు పంపింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 257/4 స్కోరు సాధించింది. పూరన్ (75), పావెల్ (52), రూథర్‌ఫర్డ్ (47) విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 222/7కే పరిమితమైంది. జోష్ ఇంగ్లిస్ (55) ఒక్కరే రాణించారు.

News May 31, 2024

ప్రీస్కూల్స్‌గా అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి!

image

TG: రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ సెంటర్లు ఉండగా, GOVT స్కూళ్ల పరిధిలో ఉన్న 15,640 కేంద్రాలను ప్రీస్కూల్స్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తోంది. వాటి ఆధునికీకరణకు రూ.30 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఆయా కేంద్రాలకు రంగులు, పిల్లలకు ప్రత్యేక యూనిఫామ్స్, బుక్ రాక్స్, పుస్తకాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జూన్ 6 తర్వాత ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

News May 31, 2024

పాన్-ఆధార్ అనుసంధానానికి నేడే లాస్ట్.. లేదంటే..!!

image

పాన్, ఆధార్ లింక్ గడువు నేటితో ముగియనుంది. అనుసంధానం చేయనివారు మార్చి 31, 2024కు ముందు చేసిన ఆర్థిక లావాదేవీలపై ఎక్కువ TDS చెల్లించాల్సి ఉంటుందని ఐటీ శాఖ హెచ్చరించింది. రూ.1,000 అపరాధ రుసుముతో మే 31, 2024లోపు లింక్ పూర్తి చేయాలని, ఆ లోపు పాన్ యాక్టివేట్ చేసిన వారికి ఎలాంటి అదనపు భారం ఉండదని పేర్కొంది. https://eportal.incometax.gov.in/ సైట్ ద్వారా పాన్-ఆధార్ లింక్ చేసుకోవచ్చు.

News May 31, 2024

గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు.. 53 మంది మృతి

image

గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. IDF దాడుల్లో 24 గంటల్లోనే 53 మంది మృత్యువాతపడ్డారు. మరో 357 మంది తీవ్రంగా గాయపడ్డట్లు స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది. గాయపడిన వారిలో పారా మెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు. టాల్ అస్-సుల్తాన్ ప్రాంతంలో జరిగిన బాంబు దాడి బాధితులకు సాయం అందించేందుకు వీరు వెళ్లగా గాయపడ్డారు. కాగా గాజా ప్రాంతం మొత్తం తమ అధీనంలోకి వచ్చిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

News May 31, 2024

ఫోన్‌పేలో ఇకపై వెహికల్, హోమ్ లోన్స్

image

ఫోన్‌పే కొత్తగా 6 విభాగాల్లో సెక్యూర్డ్ లోన్ స్కీమ్‌లను అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు మ్యూచువల్ ఫండ్, గోల్డ్, బైక్, కార్, హోమ్/ ప్రాపర్టీ, ఎడ్యుకేషన్ లోన్‌ను పొందవచ్చని సంస్థ తెలిపింది. ఇందుకోసం బ్యాంకులు, NBFCలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. 535 మిలియన్ యూజర్లకు సులభంగా, వేగంగా రుణాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.

News May 31, 2024

ఎండ ఎఫెక్ట్.. 2 గంటల్లో 16 మంది మృతి

image

తీవ్ర ఉష్ణోగ్రతలకు తాళలేక ఉత్తరాది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బిహార్‌లోని ఔరంగాబాద్‌లో బుధవారం 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, వేడి సంబంధ సమస్యలతో జిల్లా ఆస్పత్రిలో 2 గంటల వ్యవధిలో 16 మంది మరణించారు. గత 24 గంటల వ్యవధిలో వడగాలులకు మరో 19 మంది చనిపోయారు. ఎండలకు ఢిల్లీలో ఓ వ్యక్తికి అసాధారణ స్థాయిలో 108 డిగ్రీల సెల్సియన్ జ్వరం వచ్చింది. కిడ్నీలు, కాలేయం విఫలమై అతను చనిపోయారు.

News May 31, 2024

‘హరితహారం’ ఇకపై ‘ఇందిర వనప్రభ’?

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ‘హరితహారం’ పేరును ‘ఇందిర వనప్రభ’గా మార్చనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అన్ని కార్యక్రమాలు ‘తెలంగాణకు హరితహారం’ పేరుతో జరిగాయి. ఇకపై ‘ఇందిర వనప్రభ’ పేరుతో కొనసాగనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని జవాబుదారీతనంతో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వర్షాకాలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని BRS సర్కారు ప్రారంభించింది.

News May 31, 2024

గుంటూరు లేదా ఒంగోలులో NCC డైరెక్టరేట్: డిప్యూటీ డైరెక్టర్

image

AP: NCC శిక్షణతో విద్యార్థులకు సమాజం, దేశంపై బాధ్యత పెరుగుతుందని ఎన్‌సీసీ AP, TG డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. గుంటూరు/ ఒంగోలులో NCC డైరెక్టరేట్, విశాఖలో అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జూన్ 4న ప్రభుత్వం కొలువుదీరగానే CMతో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో 2,500కుపైగా విద్యాసంస్థలకు NCC ట్రైనింగ్ గుర్తింపు ఉండగా, మరో 1,600 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.

News May 31, 2024

నిన్న కోర్టులో ఊరట.. నేడు రిటైర్మెంట్

image

AP: సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ <<13342317>>వెంకటేశ్వరరావు<<>> నేడు రిటైర్ కాబోతున్నారు. నిన్న ఆయనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఏబీవీ.. ఆ ఉత్తర్వులను CS జవహర్ రెడ్డికి అందజేశారు. ఈ అంశాన్ని పరిశీలిస్తానని సీఎస్ చెప్పారు. కాగా, టీడీపీ హయాంలో నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే అభియోగంతో మే 31, 2019న ప్రభుత్వం ఏబీవీని సస్పెండ్ చేసింది.