News May 31, 2024

ఏపీ ‘ఉప్పు’కు డిమాండ్.. రైతుల సంతోషం

image

AP: తమిళనాడులో భారీ వర్షాల కారణంగా ఉప్పు తయారీ నిలిచిపోయింది. దీంతో AP ఉప్పుకు డిమాండ్ పెరిగింది. వారం కిందట వరకు 75KGల బస్తా ₹100-₹150 పలకగా, ఇప్పుడు ₹200 దాటింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 4 వేల ఎకరాల్లో ఉప్పు పండిస్తున్నారు. గతంలో ఎకరాకు 800-900 బస్తాల దిగుబడి వస్తుండగా, ఈసారి 1,300-1,400 వరకు వస్తోంది. రేటు కూడా పెరగడంతో దాదాపు 7 వేల మంది రైతులు, 10 వేలకు పైగా కూలీలకు లబ్ధి చేకూరుతోంది.

News May 31, 2024

నవంబర్ 5న నిజమైన తీర్పు వస్తుంది: ట్రంప్

image

న్యూయార్క్ హష్ మనీ కేసులో తనను కోర్టు <<13346828>>దోషిగా<<>> తేల్చడంపై డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. నిజమైన తీర్పు ఎన్నికల రోజున (నవంబర్ 5) ప్రజలు ఇస్తారని పేర్కొన్నారు. తాను ఎలాంటి నేరం చేయలేదని అన్నారు. విచారణ మోసపూరితంగా, అవమానకర రీతిలో జరిగిందని ఆరోపించారు. ఇక్కడ ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసని, వారే నిజమైన తీర్పునిస్తారని మీడియాతో మాట్లాడారు.

News May 31, 2024

పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటలు

image

AP: కలియుగ వైకుంఠం తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. దాదాపు కిలోమీటర్ మేర క్యూ ఉంది. సర్వదర్శనం టోకెన్లు లేని వారికి స్వామివారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది.

News May 31, 2024

విజయ్ దేవరకొండ సినిమాలో సత్యదేవ్?

image

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీలో సత్యదేవ్ నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఓ కీలక పాత్రలో ఆయన కనిపించనున్నారట. ఆల్రెడీ షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. బ్లఫ్ మాస్టర్, గాడ్ ఫాదర్ సినిమాలతో సత్యదేవ్ పాపులరైన సంగతి తెలిసిందే.

News May 31, 2024

కేరళ స్కూళ్లలో పాఠ్యాంశంగా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను స్కూళ్లలో పాఠ్యాంశంగా చేర్చాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి ఏడో తరగతి పాఠ్య ప్రణాళికలో AIను పాఠ్యాంశంగా చేర్చనున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ‘కృత్రిమ మేధ’కు వాడకంతో పాటు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దానిపై విద్యార్థులకు జ్ఞానం అందించాలని ఈ నిర్ణయం తీసుకుంది.

News May 31, 2024

విజయవాడను వణికిస్తోన్న డయేరియా

image

AP: విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటివరకు అతిసారంతో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది. కృష్ణా జలాలు కలుషితం కావడంతో మొగల్రాజపురం, సింగ్ నగర్, పాయకాపురం ఏరియాల్లో వంద వరకు డయేరియా కేసులు నమోదయ్యాయి. వాంతులు, విరేచనాలతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే డయేరియాతో ఎలాంటి మరణాలు చోటుచేసుకోలేదని, అవి సహజ మరణాలేనని వైద్యాధికారులు చెబుతున్నారు.

News May 31, 2024

ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం వాయిదా

image

TG: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, ఓట్ల లెక్కింపు కారణంగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ మూల్యాంకనాన్ని వాయిదా వేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 1 నుంచి జరగాల్సిన ఈ ప్రక్రియను జూన్ 5 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. 5వ తేదీ నుంచి తొలి విడత, 7వ తేదీ నుంచి రెండో విడత ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు నేటితో వేసవి సెలవులు ముగియనున్నాయి.

News May 31, 2024

రేపే లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్

image

లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ రేపు జరగనుంది. 8 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలకు EC పోలింగ్ నిర్వహించనుంది. యూపీలో 13, పంజాబ్‌లో 12, బిహార్‌లో 8, బెంగాల్‌లో 9, హిమాచల్ ప్రదేశ్‌లో 4, ఒడిశాలో 6, జార్ఖండ్‌లో 3, చండీగఢ్‌లో ఒక స్థానానికి కలిపి మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ లిస్టులో ప్రధాని మోదీ, కంగనా రనౌత్ వంటి ప్రముఖులున్నారు.

News May 31, 2024

దోస్త్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు

image

డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) <>రిజిస్ట్రేషన్<<>> గడువును జూన్ 1 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి వెల్లడించారు. విద్యార్థులు జూన్ 2 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దోస్త్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారన్న సంగతి తెలిసిందే.
వెబ్‌సైట్: https://dost.cgg.gov.in/

News May 31, 2024

కోహ్లీ రికార్డుకు చేరువలో బాబర్ ఆజమ్

image

అంతర్జాతీయ టీ20ల్లో 4వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్(4023) నిలిచారు. అతనికంటే ముందు విరాట్ కోహ్లీ(4037) ఈ ఘనత సాధించారు. మరో 15 రన్స్ చేస్తే అతను కోహ్లీని అధిగమించి లీడింగ్ రన్ స్కోరర్‌గా రికార్డు నెలకొల్పనున్నారు. ఈ లిస్టులో వీరిద్దరి తర్వాత రోహిత్ శర్మ (3974), స్టిర్లింగ్(3589), గప్తిల్ (3531) ఉన్నారు.