News May 30, 2024

జూన్ 4న కంగనకు కన్యాదానం: విక్రమాదిత్య

image

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ నియోజకవర్గ BJP అభ్యర్థి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాక జూన్ 4న కంగనకు ‘కన్యాదానం’ చేసి హిమాచల్ నుంచి పంపిస్తామని అన్నారు. ఆమె ఒక కాలు ముంబైలో ఉంటే మరో కాలు హిమాచల్‌ప్రదేశ్‌లో ఉందని, అలాంటి వ్యక్తి హిమాచల్‌ వాసుల సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు.

News May 30, 2024

జూన్ 2న కీలక నిర్ణయాల ప్రకటన: CM రేవంత్

image

TG: రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక పునరుజ్జీవానికి సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ రోజు ఘనంగా ఆవిర్భావ వేడుకలు జరుపుతామన్నారు. ఆయా అంశాలపై సచివాలయంలో సహచర మంత్రులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, మేధావులు, కళాకారులతో సమీక్ష నిర్వహించినట్లు రేవంత్ ట్వీట్ చేశారు.

News May 30, 2024

బీజేపీకి తొత్తుగా మారిన ఈసీ: పేర్ని నాని

image

AP: కేంద్రంలో, రాష్ట్రంలో BJP ఒత్తిడికి లొంగిపోయి ఎన్నికల సంఘం పని చేస్తోందని YCP నేత పేర్ని నాని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో EC డబుల్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. ‘TDP తప్పులపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా EC పట్టించుకోలేదు. కానీ ఏ పత్రికలో వార్తలు వచ్చినా YCP నేతలపై కేసులు పెడుతున్నారు. ఎన్నికల సంఘంపై కోర్టులో పోరాడుతున్నాం. న్యాయమే గెలిచి తీరుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.

News May 30, 2024

T20WCలో చిన్న, పెద్ద ఆటగాళ్లు ఎవరంటే?

image

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత కుర్ర ఆటగాడు ఎవరో తెలుసా? నేపాల్‌కు చెందిన గుల్సన్ ఝా. ఇతడి వయసు కేవలం 18 సంవత్సరాలు. ఇక ఈ మెగా టోర్నీలో అత్యంత వయసైన ప్లేయర్ ఫ్రాంక్ న్సుబుగా. ఉగాండాకు చెందిన ఈయన వయసు 43 సంవత్సరాలు. వీరిరువురూ బౌలర్లే కావడం విశేషం.

News May 30, 2024

టాప్-2 అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే?

image

ఒక నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులకు సమాన సంఖ్యలో ఓట్లు వచ్చి విజేత ఎవరో తేల్చలేని పరిస్థితి నెలకొంటే.. డ్రా తీసి విజేతను ప్రకటిస్తారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్‌లోని సెక్షన్ 102 ఈ అవకాశం కల్పించింది. అయితే.. అందుకోసం ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా వస్తుంది. 2019లో రాజస్థాన్‌లో, 2017లో ముంబైలో ఇలాగే ఫలితం తేలింది. <<-se>>#ELECTIONS<<>>

News May 30, 2024

RECORD: ఏడాదిలోనే హాటెస్ట్ డే

image

TG: మంచిర్యాల జిల్లా భీమారంలో ఈరోజు 47.2°C ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత. భద్రాద్రి కొత్తగూడెం(47.1°C), పెద్దపల్లి(46.7°C), కుమురంభీమ్(46.6°C), ఖమ్మం(46.5°C) అత్యధిక ఉష్ణోగ్రతలను చూశాయి. హైదరాబాద్‌లో 43.0°C ఉష్ణోగ్రత నమోదైంది. మరో 3 రోజులు ఇలాగే తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదై ఆ తర్వాత వేడి తగ్గే అవకాశం ఉందని వివరించింది.

News May 30, 2024

మా తర్వాతి టార్గెట్ అదే: గంభీర్

image

గంభీర్ టీమ్ ఇండియా కోచ్‌ అవుతారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘మేం(KKR) IPLలో 3 టైటిళ్లు సాధించినా MI, CSK కంటే వెనకబడే ఉన్నాం. ఇప్పటికీ అత్యంత విజయవంతమైన జట్లలో మేం లేము. అలా జరగాలంటే మరో 3 టైటిళ్లు నెగ్గాలి. మా తర్వాతి లక్ష్యం అదే. ఇప్పుడే ఆ జర్నీ ప్రారంభమైంది. KKRను విజయవంతమైన జట్టుగా నిలపడం కంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు’ అని అన్నారు.

News May 30, 2024

వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు ఎలా?

image

VVPAT సిస్టమ్ 2013 నుంచి వినియోగంలోకి వచ్చింది. ఈవీఎంలకు అనుసంధానమైన ఈ యంత్రం అభ్యర్థి పేరు, ఎన్నికల గుర్తుతో స్లిప్‌‌ను రూపొందిస్తుంది. ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల నంబర్స్‌ను చీటీలపై రాసి లాటరీ తీస్తారు. ఇలా ఎంపిక చేసిన VVPATలలోని స్లిప్పులు లెక్కించి ఈవీఎం రిజల్ట్‌తో సరిపోల్చుతారు. ఈవీఎం, స్లిప్‌ల ఓట్లలో వ్యత్యాసం ఉంటే స్లిప్పులనే పరిగణనలోకి తీసుకుంటారు.

News May 30, 2024

శివుడికి మన రక్షణ అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

image

యమునా నది ఒడ్డున అక్రమంగా నిర్మించిన ఓ శివాలయాన్ని కూల్చివేసేందుకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘శివుడికి మన రక్షణ అవసరం లేదు. మనమే రక్షించమని, ఆశీర్వదించమని ఆయనను కోరుకోవాలి. నదీ తీరాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేస్తే ఆయన సంతోషిస్తారు’ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో గుడిని కూల్చివేయొద్దని ఆలయ నిర్వాహకులు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది.

News May 30, 2024

ITR చేస్తున్నారా? జూన్ 15 వరకూ ఆగండి!

image

2023-24FYకి సంబంధించిన ITR ఫైలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఉద్యోగస్థులు జూన్ 15 వరకు వేచి చూడటం ఉత్తమమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వారి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఫాం 26AS మే 31న అప్డేట్ అవుతాయి. ఆ తర్వాత 15 రోజుల్లో TDS సర్టిఫికెట్లు వస్తాయి. సో, జూన్ 15లోపు చేస్తే ITRలో ఇన్ఫర్మేషన్ అసంపూర్తిగా నమోదయ్యే అవకాశం ఉంది. తద్వారా ఫైన్ కూడా భరించాల్సి ఉంటుంది.