News May 30, 2024

కట్టడాలు మాత్రమే చిహ్నం కాదు: కోదండరాం

image

TG: ప్రభుత్వం నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను స్వాగతిస్తున్నామని TJS చీఫ్ ప్రొ.కోదండరాం అన్నారు. తొలిసారి తమను భాగస్వాముల్ని చేస్తున్నారని, గతంలో ఎప్పుడూ ఆహ్వానం అందలేదని చెప్పారు. తాము కోరుకున్న గీతం, చిహ్నాలను ప్రభుత్వం తీసుకొస్తోందని వెల్లడించారు. జయజయహే తెలంగాణ పాట రాసింది ఎవరనేది ముఖ్యమని, పాడింది కాదన్నారు. లోగో మారిస్తే బాగుంటుందని, కట్టడాలు మాత్రమే చిహ్నం కాదని అభిప్రాయపడ్డారు.

News May 30, 2024

T20WC తాలూకా.. క్యాచ్‌ల రికార్డు వీరిదే

image

పొట్టి ప్రపంచకప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామి పేరిట ఉంది. 2010లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన నాలుగు క్యాచ్‌లు పట్టారు. ఆ రికార్డు ఇప్పటికీ బద్దలు కాలేదు. బ్రెట్‌లీ, సులేమాన్ బెన్‌, సిమన్స్‌, ఏబీ డివిలియర్స్‌, వార్నర్, సురేశ్ రైనా, బ్రావో, మిల్లర్, స్టోక్స్ తదితర ప్లేయర్లు తలో మూడు క్యాచ్‌లతో తర్వాతి స్థానంలో ఉన్నారు.

News May 30, 2024

AP ఎన్నికలు.. తొలి ఫలితం వెలువడేది ఇక్కడేనా?

image

రాష్ట్రంలో తొలి ఫలితం తూ.గో జిల్లా కొవ్వూరు లేదా ప.గో జిల్లా నర్సాపురం నియోజకవర్గాల నుంచి వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 2 సెగ్మెంట్లలోనూ 13 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి, అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గాల ఫలితాలు చివరగా వెలువడే ఛాన్స్ ఉంది. ఈ రెండు స్థానాల్లో 29 రౌండ్ల చొప్పున కౌంటింగ్ చేయనున్నారు. భీమిలి, పాణ్యం ఫలితాలు కూడా ఆలస్యమయ్యే అవకాశముంది.

News May 30, 2024

జూన్ 2న సీఎం షెడ్యూల్ ఇదే..

image

TG: దశాబ్ది వేడుకల సందర్భంగా జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు. అనంతరం ఉ.10 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్‌ఫాస్ట్ తర్వాత అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ట్యాంక్ బండ్‌పై నిర్వహించే వేడుకలకు సీఎం హాజరవుతారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా పాల్గొంటారు.

News May 30, 2024

T20WC: పాక్-ఆసీస్ మధ్యే ఫైనల్: నాథన్ లయన్

image

T20WC 2024లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ఫైనల్లో తలపడుతాయని ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ అభిప్రాయపడ్డారు. ‘పాకిస్థాన్ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. బాబర్, రిజ్వాన్ లాంటి స్టార్ బ్యాటర్లకూ కొదవలేదు. పాక్‌తో పాటు ఆస్ట్రేలియా కచ్చితంగా ఫైనల్ చేరుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఆయన భారత్ పేరెత్తకపోవడంతో టీమ్‌ఇండియా ఫ్యాన్స్ లయన్‌పై మండిపడుతున్నారు.

News May 30, 2024

జూన్ 2న అందెశ్రీ, కీరవాణికి సన్మానం

image

TG ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై ‘జయ జయహే తెలంగాణ’ గీత రచయిత అందెశ్రీ, సంగీతం అందించిన కీరవాణిని ప్రభుత్వం సన్మానించనుంది. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్‌స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. 700 మందితో తెలంగాణ కళారూపాల కార్నివాల్, 70ని.షాల పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, 5వేల మందితో జాతీయ జెండాలతో ఫ్లాగ్‌వాక్ ఉంటుంది. ఫ్లాగ్‌వాక్ సమయంలో తెలంగాణ గీతం విడుదలవుతుంది.

News May 30, 2024

BREAKING: కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

image

జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. తాను ఆహ్వానిస్తున్నట్లుగా లేఖను స్వయంగా అందించాలంటూ సలహాదారు హర్కర వేణుగోపాల్‌ను ఆయన ఆదేశించారు. లేఖతో పాటు ఆహ్వాన పత్రాన్ని వేణుగోపాల్ రేపు కేసీఆర్‌కు అందించే అవకాశం ఉంది. మరోవైపు దశాబ్ది వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరు కానున్నారు.

News May 30, 2024

రెండేళ్ల పిల్లాడు గీసిన పెయింటింగ్.. 7వేల డాలర్లకు విక్రయం

image

జర్మనీకి చెందిన లారెంట్ ష్వార్జ్ వయసు రెండేళ్లే. కానీ అతడు వేసే పెయింటింగ్స్ మాత్రం వేలాది డాలర్లకు అమ్ముడుపోతున్నాయి. గత ఏడాది లారెంట్‌లోని కళను గుర్తించిన పేరెంట్స్ అతడి కోసం ప్రత్యేకంగా ఓ ఆర్ట్ స్టూడియోను రూపొందించారు. అతడి పెయింటింగ్స్‌ను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేయడం ప్రారంభించారు. వాటికి డిమాండ్ పెరగడంతో ఆన్‌లైన్‌‌లో ఇప్పుడు వేలాది డాలర్లకు విక్రయిస్తుండటం గమనార్హం.

News May 30, 2024

2.30 నిమిషాల నిడివితో రాష్ట్ర గీతం: సీఎం

image

TG: రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’కు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 3 చరణాలతో 2.30 నిమిషాల నిడివితో సంక్షిప్త గీతాన్ని రూపొందించినట్లు చెప్పారు. అధికారిక చిహ్నం ఇంకా ఖరారు కాలేదని, తెలంగాణ తల్లి రూపంపైనా అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.

News May 30, 2024

ప్రజ్వల్‌ను అరెస్ట్ చేయాలంటూ మహిళల భారీ ర్యాలీ

image

లైంగిక వేధింపుల కేసులో నిందితుడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలంటూ వేలసంఖ్యలో మహిళలు రోడ్డుపైకి వచ్చారు. కర్ణాటకలోని హాసన్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతబట్టి ప్రజ్వల్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ కేసు వెలుగుచూసిన తర్వాత ఆయన విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ప్రజ్వల్ ఇవాళ అర్ధరాత్రి స్వదేశానికి రానున్నారు.