News January 1, 2026

అంచనాకు మించి అయ్యప్ప బంగారం చోరీ: SIT

image

శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం చోరీ అంచనా కంటే ఎక్కువే అని కొల్లాం కోర్టుకు SIT తెలిపింది. సన్నిధానం తలుపులకు గల ఆకృతులతో పాటు శివుడి విగ్రహం, ఆర్చ్, ద్వారపాలక విగ్రహాలు సహా 7ఆకృతుల్లో పసిడి చోరీ అయిందని రిపోర్టు సమర్పించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ విగ్రహాల బాధ్యతలు చేపట్టాక 4.5KGల మేర బంగారాన్ని రికార్డుల్లో రాగి అని మార్చాడని పేర్కొంది. చెన్నైలో కెమికల్స్‌తో బంగారం కరిగించారని తెలిపింది.

News January 1, 2026

శిక్ష పూర్తయినా వదలని పాక్.. జైళ్లలోనే 167 మంది భారతీయులు!

image

భారత్-పాక్ మధ్య ఏటా జరిగే ఖైదీల జాబితా మార్పిడి ప్రక్రియ 2026 నూతన సంవత్సరం తొలి రోజైన గురువారం పూర్తయింది. ఆ దేశ జైళ్లలో శిక్షాకాలం పూర్తయినప్పటికీ ఇంకా 167 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీలు అక్కడే మగ్గుతున్నారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. వీరిని వెంటనే విడుదల చేయాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం పాక్ కస్టడీలో మొత్తం 257 మంది ఉండగా.. భారత జైళ్లలో 424 మంది పాకిస్థానీలు ఉన్నారు.

News January 1, 2026

సంతానోత్పత్తి తగ్గి కొరియాలో స్కూళ్ల మూత

image

పిల్లలు రాక ప్రభుత్వ స్కూళ్లు మూతపడుతుండడం సాధారణం. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇది షరా మామూలైంది. అయితే మన దగ్గర సదుపాయాలు, టీచర్ల లేమి, ప్రైవేటు స్కూళ్ల పోటీ కారణమైతే అక్కడ సంతానోత్పత్తి తగ్గడం దీనికి కారణం. దక్షిణ కొరియాలో గత కొన్నేళ్లలో 4008 GOVT స్కూళ్లు మూతపడ్డాయి. వీటిలో 3674 స్కూళ్లు ఎలిమెంటరీయే. ఈ దేశంలో సంతానోత్పత్తి రేటు 0.7కు పడిపోయింది. ఇతర దేశాలతో పోలిస్తే ప్రపంచంలో ఇదే అత్యల్పం.

News January 1, 2026

ఇతిహాసాలు క్విజ్ – 114 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి ఎవరు? ఆమె భర్త పేరేంటి? ఆయనను ఎవరు చంపేశారు?
సమాధానం: రావణుడి సోదరి శూర్పణఖ. ఆమె భర్త పేరు విద్యుజ్జిహ్వుడు. అతను రావణుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయడంతో, ఆగ్రహించిన రావణుడు సొంత బావ అని చూడకుండా సంహరించాడు. భర్తను కోల్పోయిన బాధ వల్లే శూర్పణఖ తిరుగుతూ అరణ్యంలో రాముడిని చూసి మోహించింది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 1, 2026

డ్రంకెన్ డ్రైవ్‌లో ఎంతమంది పట్టుబడ్డారంటే?

image

ఎంత చెప్పినా ఈసారి కూడా మందుబాబులు మారలేదు. న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా 2,731 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,198, సైబరాబాద్‌లో 928, ఫ్యూచర్ సిటీ‌లో 605 మంది తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. వారందరిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు రెగ్యులర్‌గానూ కొనసాగుతాయని స్పష్టం చేశారు.

News January 1, 2026

రో-కో లేకపోతే వన్డేలు కష్టమే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్

image

ప్రస్తుతం వన్డే క్రికెట్ పరిస్థితిపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027 ప్రపంచ కప్ తర్వాత వన్డే ఫార్మాట్ మనుగడ సాగించడం కష్టమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాలు రిటైరైతే ఈ ఫార్మాట్‌ను చూసేవారు తగ్గిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. T20లకు హవా పెరగడం, టెస్ట్‌లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ODIలకు ఆదరణ తగ్గుతుందని అంచనా వేశారు.

News January 1, 2026

కొత్త లుక్‌లో నాని, అఖిల్.. పోస్టర్లు చూశారా?

image

న్యూ ఇయర్ సందర్భంగా నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’, అక్కినేని అఖిల్ ‘లెనిన్’ సినిమాల నుంచి కొత్త పోస్టర్లు విడుదలయ్యాయి. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ‘ది ప్యారడైజ్’ MAR 26న రిలీజ్ కానుంది. అటు ‘లెనిన్’ నుంచి ఈనెల 5న ఫస్ట్ సాంగ్‌ను, ఈ ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేస్తామని మూవీ టీమ్ పేర్కొంది. మురళీ కిశోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు.

News January 1, 2026

పాలమూరు ప్రాజెక్టుపై KCR, హరీశ్‌వి తప్పుడు ప్రచారాలు: ఉత్తమ్

image

TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్, హరీశ్ రావు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాలపై సీఎం, మంత్రులకు ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘ప్రాజెక్టు పూర్తికి రూ.80వేల కోట్లు అవసరం. BRS ప్రభుత్వం రూ.27వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఆ పార్టీ నేతలు 90% పూర్తి చేశామని ఎలా చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.7వేల కోట్లు ఖర్చు చేశాం’ అని వివరించారు.

News January 1, 2026

X మొత్తం ఇదే.. ఇలా చేయడం నేరమే!

image

కొందరు X వేదికగా అమ్మాయిలు, సెలబ్రిటీల ఫొటోలను షేర్ చేస్తూ వారిని అసభ్యంగా (బికినీలో) చూపించాలని AI టూల్ ‘గ్రోక్’ను కోరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అది మెషీన్ కావడంతో అభ్యంతరకర ఫొటోలు సైతం ఎడిట్ చేసి ఇస్తోంది. అయితే ఇలా చేయడం ఇతరుల వ్యక్తిగత గోప్యతను దెబ్బతీయడమే. అనుమతి లేకుండా ఫొటోలను మార్ఫింగ్ చేయడం సైబర్ క్రైమ్ లాంటిదే. జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News January 1, 2026

నిమ్మలో కొమ్మల కత్తిరింపు వల్ల లాభమేంటి?

image

అంటు కొమ్మలను నాటిన నిమ్మ మొక్కల వేరు మూలం నుంచి పెరిగే కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. కాండంపై 2 అడుగుల ఎత్తువరకు పక్క కొమ్మలు పెరగకుండా తీసేయాలి. చెట్టుకు ఉన్న అనవసర, ఎండు, తెగులు సోకిన కొమ్మ భాగాలను కత్తిరించి తీసేయాలి. కొమ్మ కత్తిరింపుల తర్వాత చెట్టుపై 1% బోర్డో మిశ్రమం లేదా కాపర్ఆక్సీక్లోరైడ్‌ను చెట్టుపై పిచికారీ చేయాలి. చెట్టు మొదలు నుంచి 1.5 అడుగుల ఎత్తు వరకు బోర్డో పేస్టును పూయాలి.