India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నైనిటాల్ బ్యాంక్‌లో 185 పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ/పీజీ, CA, MBA,LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JAN 18న ఎగ్జామ్ నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు CSA పోస్టులకు రూ.1000, స్కేల్ 1, 2పోస్టులకు రూ.1500. వెబ్‌సైట్: https://www.nainitalbank.bank.in

AP: ‘స్వర్ణ పంచాయతీ’ పేరిట ప్రభుత్వం తెచ్చిన ఆన్‌లైన్ చెల్లింపుల పోర్టల్ సత్ఫలితాలు ఇస్తోంది. 13వేల పంచాయతీల్లోని 88 లక్షల ఆస్తుల్ని గుర్తించి ₹1052 కోట్ల పన్ను(FY24-25) మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఎవరితోనూ సంబంధం లేకుండా నేరుగా చెల్లించే విధానంతో ప్రజల నుంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ₹200Cr వసూలయ్యాయి. గతంలో పన్ను వసూళ్లలో అక్రమాలు జరిగేవి. కొత్త విధానం వాటికి అడ్డుకట్ట వేసింది.

ఫ్రెంచ్ ఫిలాసఫర్ నోస్ట్రడామస్ 2026లో ప్రపంచం పలు విపత్తులను ఎదుర్కోనుందని అంచనా వేశారు. తాను రాసిన Les Prophéties బుక్‌లో వీటిని ప్రస్తావించారు.
1. ప్రపంచ యుద్ధ స్థాయిలో పోరాటాలు.
2. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం.
3. నిర్ణయాధికారం కృత్రిమ మేధ చేతుల్లోకి. (AI ఆధిపత్యం)
4. సముద్రంలో భారీ విపత్తు లేదా ఉద్రిక్తతలు.
5. నీటి సంబంధిత ప్రకృతి విపత్తులు.
** 1566లో తాను మరణిస్తానని ముందుగానే చెప్పారు.

విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో 320 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ITI అర్హతగల వారు NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్(DV) ద్వారా ఎంపిక చేస్తారు. MARCH 22న రాత పరీక్ష నిర్వహించి, 25న ఫలితాలు వెల్లడిస్తారు. DV మార్చి 30న, మెడికల్ టెస్ట్ మార్చి 31 న నిర్వహిస్తారు. https://indiannavy.gov.in

2026లో ఉద్యోగ నియామకాల జోరు మరింత పెరగనున్నట్లు టీమ్‌లీజ్ అంచనా వేసింది. ఈ ఏడాది సుమారు 1.2 కోట్ల కొత్త కొలువులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. టాటా మోటార్స్, EY, గోద్రేజ్ వంటి దిగ్గజ సంస్థలు క్యాంపస్ హైరింగ్‌తో పాటు టెక్నాలజీ, AI రంగాల్లో భారీగా రిక్రూట్‌మెంట్ చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, విభిన్న ప్రతిభావంతులకు ప్రాధాన్యం ఇస్తూ వైవిధ్యతను పెంచడంపై కంపెనీలు ఫోకస్ పెట్టడం విశేషం.

AP: ప్రసాదంలో నత్తగుల్ల వచ్చిందని వీడియో పెట్టిన ఇద్దరు భక్తులపై సింహాచలం ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. DEC 29న ఆ భక్తులు ప్రసాదాన్ని బయటకు తీసుకెళ్లి తిరిగి తెచ్చారని, ఆ సమయంలో వారు కల్తీ చేసి ఉంటారని పేర్కొన్నారు. ‘ఆరోజు 15వేల పులిహోర పొట్లాలు అమ్మాం. ఇలాంటి ఫిర్యాదు గతంలోనూ ఎవరినుంచీ రాలేదు. ప్రసాదం తయారీలో నిపుణులైన వంటవారు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు’ అని పేర్కొన్నారు.

నెలలు నిండే కొద్దీ గర్భిణులకు కాళ్ల వాపులు వస్తాయి. ఇవి తగ్గాలంటే ఎక్కువసేపు కూర్చోకుండా అటూఇటూ తిరగాలి. పాదాల కింద దిండు పెట్టుకొని విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువసేపు కూర్చొంటే కాళ్లను పైకి పెట్టుకోవాలి. వేడిగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. బరువు పెరగకుండా ఉండాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు, తీపి తగ్గించాలి. సమతులాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కర్రపెండలంలో మొక్కలో జింక్ లోపం వల్ల ఆకులు సన్నగా, పసుపుగా మారి పైకి వంకరగా ఉంటాయి. పెరుగుతున్న లేత మొక్క భాగంపై ప్రభావం ఎక్కువగా ఉండి, పెరుగుదల తగ్గుతుంది. లేత ఆకులలో ఈనెల ముఖ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. లోప నివారణకు 5KGల జింక్ సల్ఫేట్ భూమిలో వేసి కప్పాలి. 1-2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 3-4 సార్లు పిచికారీ చేయాలి. ముచ్చెలను 2-4% జింక్ సల్ఫేట్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచిన తర్వాత నాటుకోవాలి.

TG: ఎన్నికలు జాప్యం కావడంతో పంచాయతీలకు రావలసిన ₹3000 CR ఫైనాన్స్ కమిషన్ నిధులను కేంద్రం 2023 నుంచి నిలిపి వేసింది. ఇటీవల ఎన్నికలు పూర్తి చేసిన ప్రభుత్వం వివరాలు సమర్పించి నిధులు విడుదల చేయాలని కోరింది. అయితే గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన నిధుల వినియోగంపై ధ్రువపత్రాలు సమర్పించాలని కేంద్రం తాజాగా కొర్రీ వేసింది. దీంతో నిధుల సత్వర విడుదలకు కేంద్ర మంత్రిని కలవాలని మంత్రి సీతక్క నిర్ణయించారు.

అమెరికాలో H-1B వీసా ప్రాసెసింగ్ జాప్యం వల్ల భారత్‌లో చిక్కుకుపోయిన తమ ఉద్యోగులకు అమెజాన్ ఊరటనిచ్చింది. వీరు 2026 మార్చి 2 వరకు ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించింది. అయితే వీరు కోడింగ్, క్లయింట్లతో మాట్లాడటం, కీలక నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులు చేయొద్దని కఠిన ఆంక్షలు విధించింది. అమెరికా కొత్తగా తెచ్చిన సోషల్ మీడియా స్క్రీనింగ్ నిబంధనల వల్ల వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Sorry, no posts matched your criteria.