India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బంగ్లాలో మైనారిటీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా షరియత్‌పూర్ జిల్లాలో ఖోకన్ దాస్ అనే హిందువుపై ఒక గుంపు దారుణంగా దాడి చేసింది. డిసెంబర్ 31న ఇంటికి వెళ్తున్న అతడిపై కత్తులతో అటాక్ చేసి తీవ్రంగా కొట్టి ఆపై నిప్పు పెట్టారు. దగ్గర్లో ఉన్న చెరువులోకి దూకి అతడు ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమృత్ మండల్, దీపూ దాస్ వంటి వారూ ఇలాంటి దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారు.

* కలువ పూరేకలు, తేనె, పాలు కలిపి పేస్ట్ చేసి ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేసుకుంటే ముడతలు, మచ్చలూ తగ్గుతాయి. * గులాబీ రేకల ముద్దకు కాసిన్ని పాలు, చెంచా సెనగపిండి కలిపి ముఖానికి, మెడకు రాయండి. పావుగంట ఆరనిచ్చి కడిగితే ముఖం మెరిసిపోతుంది. * మల్లెలను పేస్టు చేసి, అందులో కొబ్బరినూనె కలపాలి. దీన్ని ముఖానికి రాసి పావుగంట సేపు మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.

ప.బెంగాల్, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP ఓడిపోతుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ జోస్యం చెప్పారు. 2026లో బెంగాల్, 2027లో UPలో జరిగే ఎన్నికల్లో బీజేపీ కుట్రలు పనిచేయవన్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ భారీ ఆధిక్యంతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. SIR డేటాను తారుమారు చేయాలని ఎన్నికల అధికారులపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.

విపత్తు సంభవించే ముందు ప్రకృతి మనకు సంకేతాలిస్తుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో పసుపు, కుంకుమ నేలపై పడటం, పాలు పొంగి చిందడం, అద్దాలు పగలడం నష్టానికి సూచనలట. పూజలో దీపం పదే పదే ఆరిపోవడం, ఎర్ర చీమలు వరుసగా కనిపించడం ఆర్థిక ఇబ్బందులను సూచిస్తాయట. కుక్కలు ఏడవడం, కాకులు ఇంటి ముందు అరవడం, మొక్కలు ఎండిపోవడం అశుభ శకునాలని అంటున్నారు. వీటిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

AP CM చంద్రబాబుపై BRS చీఫ్ KCR ఇటీవల చేసిన <<18634035>>వ్యాఖ్యలపై<<>> AP TDP నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. CBN స్టేట్స్‌మెన్ అని ప్రపంచమంతా కీర్తిస్తోందని, KCRకి నచ్చితే ఎంత? నచ్చకుంటే ఎంత? అంటూ మంత్రి ఆనం ఫైరయ్యారు. తమ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం బాధించిందన్నారు. అధికారం పోయినప్పుడల్లా CBNపై పడి ఏడవటం BRSకు అలవాటుగా మారిందని, కేసీఆర్ TDPలోనే పెరిగారని నిన్న MLA బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.

ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు జనవరి 13 నుంచి 15వ తేదీ వరకూ జరగనున్నాయి. ఫిబ్రవరి 15న శివరాత్రి, మార్చి 4న హోలీ, 19న ఉగాదితో పాటు 19/20న రంజాన్ పండుగ ఉండనుంది. మార్చి 27న శ్రీరామనవమి, ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి రానున్నాయి. ఆగస్టు 28న రాఖీ, సెప్టెంబర్ 14న వినాయక చవితి, అక్టోబర్ 20న దసరా వేడుకలు జరగనున్నాయి. నవంబర్ 8న దీపావళి, 24న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 25న క్రిస్మస్‌తో ఏడాది ముగియనుంది. share it

కొబ్బరినూనెను జుట్టుకు రాయడం వల్ల జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. కొబ్బరినూనెను కాస్త వేడిచేసి అందులో కాస్త ఉసిరి పొడిని వేయాలి. ఆ మిశ్రమం చల్లారాక దాన్ని మీ జుట్టు, తల చర్మంపై పూర్తిగా పట్టేలా అప్లై చేయండి. అలా గంట పాటు ఉంచి మైల్డ్ షాంపూతో తలస్నానం చెయ్యాలి. దీని వల్ల స్కాల్ప్‌లో రక్త ప్రసరణ పెరుగుతుందని, ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు.

డిసెంబర్ 2025లో భారత GST వసూళ్లు 6.1% వృద్ధి చెంది ₹1.75 లక్షల కోట్లకు చేరాయి. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 19.7% పెరగడం దీనికి ప్రధాన కారణం. దేశీయంగా మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా వంటి రాష్ట్రాలు బలమైన వృద్ధిని కనబరచగా.. పంజాబ్, జమ్మూ కశ్మీర్‌లో తగ్గుదల నమోదైంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం వసూళ్లు 8.6% పెరిగి ₹16.50 లక్షల కోట్లకు చేరడం భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని సూచిస్తోంది.

ప్రస్తుతం చాలా జీడిమామిడి తోటల్లో పూత, పిందెలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో జీడిమామిడి పంటను టీ దోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు మొదటి దఫాలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ml కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు ఈ సమయంలో ఆంత్రాక్నోస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు లేదా కార్బండిజమ్+ మ్యాంకోజెబ్ 2.5గ్రా కలిపి పిచికారీ చేయాలి.

2026లో బెంగాల్, TN, కేరళ, అస్సాం అసెంబ్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హడావుడి ఉండనుంది. WBలో మమతకు BJP పోటీ ఇస్తుంటే.. తమిళనాడులో విజయ్ ఎంట్రీతో లెక్కలు మారాయి. కేరళలో లెఫ్ట్ కోట కదులుతుండగా.. అస్సాంలో కాంగ్రెస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. APలో పంచాయతీ, TGలో మున్సిపల్ ఎన్నికలు లీడర్లకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలూ ఈ ఏడాది హాట్ టాపిక్‌గా కానున్నాయి.
Sorry, no posts matched your criteria.