India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇండోర్ (MP)లో <<18729199>>కలుషిత నీరు<<>> తాగి చనిపోయిన వారిలో 6 నెలల పసికందు కూడా ఉండటం హృదయాలను కలచివేస్తోంది. తల్లి సాధన మున్సిపల్ కుళాయి నీటిని పాలలో కలిపి బిడ్డకు తాగించింది. వాంతులు చేసుకున్న కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పదేళ్ల ప్రార్థనల తర్వాత సంతానం కలిగిందని, పెద్ద కూతురు (10) కడుపునొప్పితో బాధపడుతోందని ఆ తల్లి గుండెలు బాదుకుంది.

డెలివరీ అయ్యాక కండరాల పటుత్వం కోసం, పొట్ట పెరగకుండా ఉండేందుకు చాలా మంది మహిళలు Abdominal Belt వాడుతుంటారు. నార్మల్ డెలివరీ అయితే 1-2 రోజులకు, సిజేరియన్ అయితే డాక్టర్ సూచనతో 7-10 రోజులకు మొదలుపెట్టొచ్చని గైనకాలజిస్టులు చెబుతున్నారు. రోజుకు 2-8 గంటలు, మూడు నెలల పాటు వాడితే సరిపోతుందంటున్నారు. తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు బెల్ట్ వాడకూడదని చెబుతున్నారు.

MSME టెక్నాలజీ సెంటర్, విశాఖపట్నంలో 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల వారు JAN 8, 9 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BE/B.Tech, డిప్లొమా, డిగ్రీ, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫ్యాకల్టీ, పర్చేజ్ ఇంఛార్జ్, హాస్టల్ వార్డెన్ పోస్టుకు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా.. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ పోస్టులకు గరిష్ఠ వయసు 30ఏళ్లు. వెబ్‌సైట్: www.msmetcvizag.org

తమ అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి యత్నించిందన్న రష్యా ఆరోపణలను US గూఢచారి సంస్థ CIA కొట్టిపారేసినట్లు అమెరికన్ మీడియా సంస్థలు తెలిపాయి. వాటి కథనాల ప్రకారం.. ఉక్రెయిన్ లక్ష్యం కేవలం సైనిక స్థావరాలేనని పుతిన్ నివాసం కాదని CIA తెలిపింది. ఈ మేరకు CIA డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ అధ్యక్షుడు ట్రంప్‌నకు నివేదిక సమర్పించారు. ఆధారాలు లేకుండా రష్యా ఆరోపణలు చేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP: రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై జారీచేసిన GO 225పై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. మున్సిపల్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జీవో విడుదల చేశారని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై కోర్టు ఈ నోటీసులిచ్చింది. PILపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

SIR ప్రక్రియ UPలో BJPకి సవాల్‌గా మారింది. రద్దయ్యే 18.7% ఓట్లలో ఆ పార్టీకి పట్టున్న లక్నో, ఘజియాబాద్, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నాయి. SIR డ్రాఫ్ట్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం 12.55 CR ఓట్లుంటాయని అంచనా. అయితే 25CR రాష్ట్ర జనాభాలో 65% అంటే 16 CR ఓటర్లుండాలని, మిగతా 4 CR మంది జాబితాలో చేరని వారేనని BJP భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించింది.

మారుకా మచ్చల పురుగు మొగ్గ, పూత, పిందె దశల్లో మినుము పంటను ఆశించి ఎక్కువగా నష్టం కలగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు వాటిని దగ్గరకు జేర్చి గూడుగా కట్టి, కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినటంవలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ తెగులును సకాలంలో గుర్తించి చర్యలు తీసుకోకపోతే తీవ్ర నష్టం తప్పదు.

TG: కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో 79 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 44 అసోసియేట్ ప్రొఫెసర్, 17 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రిజిస్ట్రార్ భగవాన్ తెలిపారు. ఈ నెల 31 సా.4 గంటల వరకు యూనివర్సిటీలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రొఫెసర్‌కు రూ.1.44L-2.18L, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1.31L-2.17L జీతంగా పేర్కొంది. అర్హత, ఇతర పూర్తి వివరాలకు ఇక్కడ <

NABARDలో 17 స్పెషలిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ/పీజీ(కామర్స్/మ్యాథ్స్/ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్/ఫైనాన్స్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ/PGDBA/PGDM, CA/ICWA, ME, BCA, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PwBDలకు రూ.150. వెబ్‌సైట్: https://www.nabard.org

AP: న్యూఇయర్ వేళ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 5 రకాల భూములను 22-A(నిషేధిత) భూముల జాబితా నుంచి తొలగించే ఉత్తర్వులపై సంతకం చేశారు. ప్రైవేట్ భూములను ఈ జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు తెలిపారు. స్వాత్రంత్ర్య సమరయోధులు, ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగులకు సరైన భూమి పత్రాలుంటే లిస్ట్ నుంచి తొలగిస్తామన్నారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
Sorry, no posts matched your criteria.