News January 1, 2026

Dec 31st.. బిర్యానీతో పాటు ఆశ్చర్యపరిచే ఆర్డర్లు

image

దేశవ్యాప్తంగా నిన్న రాత్రి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డెలివరీ యాప్‌లలో రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. ఎప్పటిలాగే బిర్యానీ టాప్‌లో నిలిచినా, ఈసారి కొన్ని ఆర్డర్లు ఆశ్చర్యపరిచాయి. ఐఫోన్లు, బంగారు నాణేలు, స్మార్ట్ వాచ్‌లు, ఉప్మా, కిచిడీ, హల్వా, సలాడ్లు సైతం పలువురు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. స్విగ్గీ నుంచి ఒక్క రోజే 2 లక్షలకు పైగా బిర్యానీలు, లక్షకు పైగా బర్గర్లు డెలివరీ అయ్యాయి.

News January 1, 2026

‘స్పిరిట్’ లుక్‌పై ఫ్యాన్స్ ఖుషీ.. మీకెలా అనిపించింది!

image

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ ఫస్ట్ పోస్టర్ SMను షేక్ చేస్తోంది. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఫస్ట్ లుక్స్‌తో పోలిస్తే ‘స్పిరిట్’ లుక్ మరింత ఇంటెన్సివ్‌గా ఉందనే చర్చ నడుస్తోంది. ఈసారి ప్రభాస్‌ను సందీప్ సరికొత్తగా చూపించబోతున్నారని ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ‘స్పిరిట్’ లుక్ ఎలా ఉంది? COMMENT

News January 1, 2026

తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్

image

AP: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుపతి గరుడ జంక్షన్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. కాగా లక్కీ డిప్ టోకెన్లు ఉన్నవారికి నేటితో దర్శనాలు ముగియనున్నాయి. రేపటి నుంచి జనవరి 8 వరకు టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు.

News January 1, 2026

2026: బీఆర్ఎస్ సెటైరికల్ ట్వీట్

image

TG: 2026లోకి అడుగుపెడుతున్నామని చెబుతూ ఒక్కో అంకెకు ఒక్కో వివరణ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై BRS సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘2 – రెండేండ్ల సమయం వృథా, 0 – కాంగ్రెస్ అందించిన సంక్షేమ ఫలాలు గుండు సున్నా, 2 – కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలేవి?, 6- ఇస్తామన్న గ్యారంటీలు ఎక్కడ?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించింది. ఎన్నెన్నో హామీలిచ్చి, మాయమాటలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టింది.

News January 1, 2026

మినుములో మారుకా మచ్చల పురుగు నివారణ(1/2)

image

మినుము పంట పూత దశలో (35 రోజుల) తప్పనిసరిగా పైరుపై లీటరు నీటిలో 5% వేప గింజల కషాయం లేదా వేపనూనె 5ml కలిపి పిచికారీ చేస్తే రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వీటి పిచికారీతో మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి.
☛ మొగ్గ, పూత దశలో పిల్ల పురుగులు కనిపిస్తే క్లోరిపైరిఫాస్ 2.5ml లేదా థయోడికార్బ్ 1 గ్రా. లేదా ఎసిఫేట్ 1 గ్రామును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

News January 1, 2026

కొత్త సంవత్సరంలో మనం చేసే చిన్న పొరపాటు!

image

క్యాలెండర్ మారుతుంది కానీ.. మన చేతి అలవాటు మారదు. న్యూఇయర్ రోజు ప్రతి ఒక్కరూ చేసే చిన్న పొరపాటు.. తేదీలో పాత ఏడాదిని రాయడం. ఆఫీసు ఫైళ్లు, పుస్తకాలపై పొరపాటున పాత ఏడాదిని రాసి ఆపై నాలుక కరుచుకుని కొట్టివేయడం చేస్తూనే ఉంటాం. ఫోన్లు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతున్నా మన పెన్ను మాత్రం పాత ఏడాది వైపే మొగ్గు చూపుతుంది. గుర్తుంచుకోండి ఇక నుంచి 2025 కాదు.. 2026.

News January 1, 2026

వంటింటి చిట్కాలు

image

* బంగాళదుంపలకు మొలకలు రాకుండా ఉండాలంటే, చేతులకు కాస్త ఆయిల్ రాసుకొని వాటికి రుద్దాలి.
* గోధుమ పిండి, శెనగపిండి వంటివి పురుగు పట్టకుండా ఉండాలంటే, డబ్బాలో బిర్యానీ ఆకులు వేసి ఉంచాలి.
* కాకరకాయ ముక్కలు చేదు పోవాలంటే పెరుగు, గోధుమ పిండి, ఉప్పు కలిపిన మిశ్రమంలో కాసేపు ఈ ముక్కల్ని నానబెట్టి తరువాత వండాలి.
* తీపి పదార్థాలు చేస్తున్నప్పుడు చిటికెడు ఉప్పు వేయడం మరవకండి. పదార్థాలు మంచి రుచిగా ఉంటాయి.

News January 1, 2026

BEMLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<>BEML<<>>)లో 50 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు జనవరి 7వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, డిప్లొమా, CA,ICWA, MBA, ME, ఎంటెక్, MSW,MA, PhD(హిందీ), LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అసెస్‌మెంట్/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.bemlindia.in/

News January 1, 2026

కోతితో సినిమా చేస్తున్న మురుగదాస్!

image

స్టార్ హీరోలతో పలు హిట్ చిత్రాలు తీసిన డైరెక్టర్ AR మురుగదాస్ ఇటీవల వరుస ఫ్లాప్‌లను చూశారు. రజనీకాంత్‌తో ‘దర్బార్’, సల్మాన్‌తో ‘సికిందర్’, శివకార్తికేయన్‌తో ‘మదరాసి’ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వినూత్న ప్రయోగానికి సిద్ధమయ్యారు. తన నెక్స్ట్ సినిమాలో కోతిని లీడ్ రోల్‌గా చూపించనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ పూర్తిగా పిల్లల కోసం ఉంటుందని తెలిపారు. దీనిని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

News January 1, 2026

ఖురాన్‌పై ప్రమాణం చేసిన న్యూయార్క్ మేయర్ మమ్‌దానీ

image

న్యూయార్క్ నగర మేయర్‌గా భారత మూలాలున్న జోహ్రాన్ మమ్‌దానీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్లాం మతాన్ని ఆచరించే ఆయన ఖురాన్‌పై ప్రమాణం చేసిన తొలి మేయర్‌గా నిలిచారు. 1945లో మూసివేసిన సిటీ హాల్ IRT సబ్‌వే స్టేషన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అద్దెల నియంత్రణ, ఫ్రీ బస్సు సర్వీస్, ఫ్రీ చైల్డ్‌కేర్ వంటి హామీలతో మమ్‌దానీ ఎన్నికల్లో గెలిచారు. నిధుల కోసం సంపన్నులపై పన్నులు పెంచుతామని ప్రకటించారు.