News January 1, 2026

నితీశ్ ఆస్తులు: ₹1.48 కోట్ల ఫ్లాట్.. ₹11.32 లక్షల కారు

image

బిహార్ CM నితీశ్ కుమార్ సహా ఆయన క్యాబినెట్ మంత్రులు 2025 చివరి రోజు నాటికి వారి ఆస్తుల వివరాలు వెల్లడించారు. నితీశ్ చేతిలో ₹20,552 నగదు, మూడు బ్యాంక్ అకౌంట్లలో కలిపి ₹57,766 అమౌంట్ ఉంది. ₹2.03 లక్షల విలువ చేసే జువెలరీ, ₹11.32 లక్షల ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు ఆస్తుల లిస్ట్‌లో ఉన్నాయి. మొత్తం ఆయన చరాస్తుల విలువ ₹17,66,196. అలాగే ₹1.48 కోట్ల మార్కెట్ విలువ చేసే ఫ్లాట్ కూడా ఉంది.

News January 1, 2026

మినుములో మారుకా మచ్చల పురుగు నివారణ (2/2)

image

☛ పంటలో గూళ్లు గమనిస్తే ఎసిఫేట్ 1.0 గ్రా. లేదా క్వినాల్ఫాస్ 2.0 ml. లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీలలో ఏదో ఒక మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
☛ మారుకా మచ్చల పురుగు ఉద్ధృతి అధికంగా ఉంటే స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా రైనాక్సిపిర్ 0.3 మి.లీ (లేదా) ప్లుబెండిఎమైడ్ 0.2 మిల్లీలీటరును ఒక లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

News January 1, 2026

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన నటిస్తారని నిర్మాత రామ్ తళ్లూరి పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి కథా చర్చలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. డ్రీమ్ ప్రాజెక్ట్ లోడింగ్ అంటూ రాసుకొచ్చారు. వక్కంతం వంశీ ఈ మూవీకి కథ అందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల కావాల్సి ఉంది.

News January 1, 2026

కారు డ్యాష్‌బోర్డులో గణపతి విగ్రహం ఉందా?

image

కారులో వినాయకుడి విగ్రహం ఉంచడం రక్షణకు, శుభానికి సంకేతం. విగ్రహం కూర్చున్న భంగిమలో, తొండం ఎడమ వైపుకు, డ్రైవర్ వైపు తల ఉండటం వల్ల సానుకూల శక్తి లభిస్తుందని నమ్మకం. విగ్రహం చిన్నదిగా ఉండి, డ్రైవింగ్‌కు అడ్డంకి కాకుండా స్థిరంగా అంటించాలి. నిత్యం శుభ్రత పాటిస్తూ, విగ్రహంపై దుమ్ము లేకుండా చూడాలి. ఒకవేళ విగ్రహం విరిగితే వెంటనే మార్చాలి. ఈ నియమాలు పాటిస్తే ప్రయాణం సురక్షితంగా, ప్రశాంతంగా సాగుతుంది.

News January 1, 2026

నేవీ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్ విడుదల

image

<>ఇండియన్ నేవీ<<>> క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్(MPC) అర్హతగల అభ్యర్థులు జనవరి 3 నుంచి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచీలో 44 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. JEE మెయిన్స్ అర్హత, స్క్రీనింగ్, SSB ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జనవరి 2, 2007-జులై 1,2009 మధ్య జన్మించి ఉండాలి. వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in.

News January 1, 2026

స్విమ్‌సూట్‌లో అనసూయ.. శివాజీకి కౌంటర్?

image

యాంకర్ అనసూయ మరోసారి SMలో హాట్ టాపిక్‌గా మారారు. న్యూ ఇయర్ సందర్భంగా స్విమ్‌సూట్‌లో దిగిన ఫొటోలను Instaలో షేర్ చేశారు. మహిళల దుస్తులపై ఇటీవల శివాజీ చేసిన వ్యాఖ్యలు <<18677489>>వివాదానికి<<>> దారి తీసిన నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే పోస్ట్ చేశారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన పంథా మార్చుకోనని ఆమె ప్రూవ్ చేశారని పలువురు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇదే సమయంలో కొందరు నెగటివ్‌గానూ స్పందిస్తున్నారు.

News January 1, 2026

US కంపెనీలకు షాక్.. H-1B వీసా ఫీజు పెంపును సమర్థించిన కోర్టు

image

H-1B వీసా పెంపును కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టు సమర్థించింది. ట్రంప్ ప్రభుత్వం పెంచిన భారీ ఫీజు చట్టబద్ధమేనని ఒబామా నియమించిన జడ్జి తీర్పిచ్చారు. దీనివల్ల విదేశీ ఉద్యోగులను తీసుకునే టెక్, ఫార్మా కంపెనీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ US ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పుడు అప్పీల్ కోర్టుకు వెళ్లింది. ప్రభుత్వం తన పరిధి దాటి ఫీజు పెంచిందని వాదిస్తోంది.

News January 1, 2026

ఆనందంగా జీవించాలంటే ఇవి చాలు

image

జీవితంలో అశాంతికి కారణం పోలికే అంటున్నారు మానసిక నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే మీకేం కావాలో ముందు తెలుసుకోవాలి. అసలైన సంపద ఆరోగ్యం, అవసరాలు తీర్చేంత బ్యాంక్ బ్యాలెన్స్, అర్థం చేసుకొనే భాగస్వామి, గాలి కబుర్లు, చెప్పుడు మాటలు చెప్పేవారిని దూరం పెట్టండి, రోజూ ఆత్మపరిశీలన చేసుకుంటే సరిపోతుంది. ప్రతికూల ఆలోచనలు చేయకండి. ఇతరులతో పోల్చుకోవడం మానేయండి.

News January 1, 2026

విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

image

AP: న్యూఇయర్ వేళ నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. తుడుములదిన్నె గ్రామంలో ముగ్గురు పిల్లలు కావ్యశ్రీ(7), ధ్యానేశ్వరి(4), సూర్యగగన్(2)కు విషమిచ్చి సురేందర్(35) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలను పెంచే స్తోమత లేక సురేంద్ర ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. గతేడాది సురేంద్ర భార్య మహేశ్వరి(32) అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.

News January 1, 2026

పండగకు, జాతరకు స్పెషల్ బస్సులు.. ఛార్జీల పెంపు!

image

TG: సంక్రాంతికి, మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా RTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సంక్రాంతికి HYD నుంచి ఈ నెల 9-13 వరకు 6,431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అటు మేడారం జాతరకు ఈ నెల 25 నుంచి హైదరాబాద్ నుంచే 3,495 స్పెషల్ బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ టికెట్ ఛార్జీలు, ప్రత్యేక బస్సుల్లో 50% మేర పెంపు ఉంటాయన్నారు.