India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

IOCLలో 394 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు JAN 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి B.Tech, BE, BSc, ఇంటర్, డిప్లొమా, ITI ఉత్తీర్ణులై, వయసు 18 – 26 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. CBT, ఫిజికల్ టెస్ట్/స్కిల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iocl.com *మరిన్ని ఉద్యోగాలకు <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

కొందరిలో కనుబొమ్మలు చాలా పలుచగా ఉంటాయి. వాటిని పెంచడానికి ఈ టిప్స్..* కనుబొమ్మలపై రోజూ ఆముదం నూనెను రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. * తాజా కలబంద జెల్ ను కనుబొమ్మలపై రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. * కొబ్బరి నూనెలో రోజ్‌మేరీ నూనెను కలిపి కనుబొమ్మలపై మర్దనా చేస్తే ఒత్తుగా పెరుగుతాయి.

కొత్త సంవత్సరం వేళ ఆయిల్ కంపెనీలు LPG సిలిండర్ల రేట్లను పెంచేశాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.111 పెరగ్గా, డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ రేటు రూ.1,912కు చేరింది. కాగా ప్రతి నెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు LPG ధరల్లో మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.

పవన్ హాన్స్ లిమిటెడ్‌లో 18 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీటెక్, బీఈ, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.40,000-రూ.2,40,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.pawanhans.co.in/

న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం, మసాలా ఆహారం అతిగా తీసుకోవడం వల్ల మరుసటి రోజు తలనొప్పి, కడుపులో మంట, వికారం వంటి <<18724599>>సమస్యలు<<>> ఎదురవుతాయి. ఉపశమనం కోసం ఎక్కువగా నీరు తాగి డీహైడ్రేషన్‌ను తగ్గించుకోవాలి. కొబ్బరి నీళ్లు/ నిమ్మరసం తాగితే శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. అల్లం టీ వికారాన్ని, అరటిపండు నీరసాన్ని తగ్గిస్తుంది. తేలికపాటి ఆహారం తీసుకుని కాసేపు నిద్రపోతే హ్యాంగోవర్ తగ్గుతుంది. share it

నిత్యం మార్కెట్లో దొరికే బత్తాయి (మోసంబి) జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ జ్యూస్‌లో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. రోజూ ఒక గ్లాస్ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. డిటాక్సిఫికేషన్ ద్వారా శరీరం శుభ్రపడుతుంది. కళ్లకు, చర్మానికి, జుట్టుకు మేలు చేస్తూ వృద్ధాప్య ఛాయలు తగ్గించడంలో సహాయపడుతుంది.

ఈ సమయంలో మామిడిలో పూమొగ్గలను ఉత్తేజపరిచి త్వరగా పూత తెప్పించడానికి, ఆడపూల శాతం పెంచడానికి లీటరు నీటికి పొటాషియం నైట్రేట్ 10గ్రా., లీటరు నీటికి బోరాన్ 2గ్రా. కలిపి పిచికారీ చేయాలి. కొందరు రైతులు పూత రాకపోవడంతో ఆ మామిడి చెట్లకు ఇప్పుడు నీరు పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల చెట్లలో మళ్లీ కొత్త చిగుర్లు వచ్చి, పూత రాకుండా పోతుంది లేదా పూత ఆలస్యమవుతుంది. నేలలో బెట్ట పరిస్థితులు పూత రావడానికి చాలా అవసరం.

TG: కాలం చెల్లిన సిలబస్‌ను పక్కన పెట్టి, మార్కెట్‌కు అవసరమైన సబ్జెక్టులు అందుబాటులోకి తీసుకొస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ‘విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేలా సులభమైన పద్ధతిలో ఇంగ్లిష్ పాఠ్యాంశాలను రూపొందించాం. సంప్రదాయ డిగ్రీ కోర్సులను ఆధునిక టెక్నాలజీతో లింక్ చేశాం. ఉపాధి దొరికే కోర్సులకే ప్రయారిటీ ఇస్తాం. డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల సంఖ్య పెంచుతాం’ అని తెలిపారు.

న్యూఇయర్ అనగానే కొత్త ఆశలు, సంతోషాలు. ఈ సందర్భంగా చాలామంది కొత్త తీర్మానాలు తీసుకుంటారు. కానీ ఆ దిశగా చేసే ప్రయత్నాలు నాలుగురోజులకే పరిమితం అవుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు మానసిక నిపుణులు. పట్టుదల ఉండాలేగానీ అనుకున్నవి సాధించడం కష్టమేం కాదు. స్లో అండ్ స్టడీ విన్స్ బాటలోనే పయనించాలి. ✍️ న్యూఇయర్ రిజల్యూషన్స్ టిప్స్ గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.

నిద్ర లేవగానే చూసే కొన్ని దృశ్యాలతో ప్రతికూల ఫలితాలుంటాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. విరబోసుకున్న జుట్టుతో ఉన్న మహిళను, బొట్టు లేని ఆడపిల్లను, అశుభ్రంగా ఉన్న ప్రదేశాలను చూడటం అశుభంగా పరిగణిస్తారు. తద్వారా మనసులో ప్రతికూల ఆలోచనలు ఏర్పడి, పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయట. ఉదయం లేవగానే శుభప్రదమైన వాటిపై దృష్టి సారిస్తే ఆ రోజంతా ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా గడపవచ్చని పండితులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.