India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: కరెంట్ ఛార్జీలపై ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సుమారు ₹4,498 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని జనంపై మోపకుండా తానే భరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు APERCకి అధికారులు లేఖ రాశారు. గత సెప్టెంబర్‌లోనూ ₹923 కోట్లను ప్రభుత్వం ట్రూడౌన్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత నవంబర్ నుంచి <<17870164>>ట్రూడౌన్‌లో<<>> భాగంగా వినియోగదారులు ఉపయోగించే ఒక్కో యూనిట్‌పై 13 పైసలు తగ్గింపు ఇస్తున్నారు.

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న రిలేషన్‌పై మరోసారి చర్చ జరుగుతోంది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇద్దరూ రోమ్‌కి వెళ్లారు. అయితే ఒకే లొకేషన్‌లో సింగిల్ ఫొటోలు మాత్రమే షేర్ చేశారు. ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో నిశ్చితార్థం జరిగిందన్న వార్తలు, 2026 <<18708719>>ఫిబ్రవరిలో పెళ్లి<<>> అంటూ ప్రచారం ఊపందుకుంది. ఇప్పటివరకు వారి నుంచి అధికారిక ప్రకటన లేదు.

ఫిబ్రవరి 1 నుంచి పాన్ మసాలా, పొగాకు <<18695704>>ఉత్పత్తులపై<<>> నూతన జీఎస్టీ రేట్లు అమల్లోకి వస్తాయని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. పాన్ మసాలాపై 40% జీఎస్టీతో పాటు సెస్ విధించనుంది. అటు పొగాకు ఉత్పత్తులపై అదనంగా ఎక్సైజ్ డ్యూటీ అమలు కానుంది. అయితే బీడీలపై మాత్రం 18శాతం జీఎస్టీ ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించిన బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్(EIL)లో 22 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 2 ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE, B.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. బేసిక్ పే నెలకు AGMకు రూ.1లక్ష-రూ.2,60,000, Sr.మేనేజర్‌కు రూ.90,000-రూ.2,40,000, మేనేజర్‌కు రూ.80,000-రూ.2,20,000, dy.మేనేజర్‌కు రూ.70,000-రూ.2,000000 చెల్లిస్తారు.

క్యాలెండర్‌లో మారింది డేట్ మాత్రమే. మీ జీవితం కూడా మారాలని కోరుకుంటున్నారా? అది మీ చేతుల్లోనే ఉంది. బలమైన ఆశయం, సంకల్పం, శ్రద్ధతో పని చేస్తే ఆలస్యమైనా విజయం మిమ్మల్ని చేరక తప్పదు. ఇయర్ మారింది.. మన టైమ్ కూడా మారుతుందని ఊరికే ఉంటే ఇంకో ఇయర్ వచ్చినా డేట్‌లో మార్పు తప్ప జీవితంలో కూర్పు ఉండదు. సో.. నేర్పుగా వ్యవహరిస్తే ‘మిరాకిల్’ మీ చేతుల్లోనే..
ALL THE BEST

న్యూఇయర్ వేళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.170 పెరిగి రూ.1,35,060కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.150 ఎగబాకి రూ.1,23,800 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 తగ్గి రూ.2,56,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

తెల్ల చేపల్లో శంకుపూత వ్యాధి శీతాకాలంలో వస్తుంది. దీని వల్ల చేపల ఎదుగుదల లోపిస్తోంది. దీని నివారణకు ఎకరా చేపల చెరువులో 80-100 kgల ఉప్పును చల్లాలని మత్స్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ఎకరా చేపల చెరువుకు కాపర్ సల్ఫేట్ ఒక KG చల్లాలి. చేపల పెరుగుదల బాగుండాలంటే ఎకరాకు పిల్లల మోతాదు 3 వేలకు మించకూడదు. 100KGల తవుడుకు 30-40KGల చెక్క కలిపి మేతగా ఇస్తే చేపల పెరుగుదల బాగుంటుంది.

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించాయి. నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 26,183 వద్ద.. సెన్సెక్స్ 170 పాయింట్లు పెరిగి 85,391 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో M&M, ఎటర్నల్, రిలయన్స్, L&T, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో.. ITC, BEL, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

గ్రహ దోషాల వల్ల కలిగే శత్రు బాధలు, ఆటంకాల నుంచి ఉపశమనానికి నల్ల నువ్వులు దివ్యౌషధంలా పనిచేస్తాయి. శనివారం సాయంత్రం నువ్వుల నూనెలో నల్ల నువ్వులు వేసి దీపారాధన చేయడం, పేదలకు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. అలాగే అమావాస్య రోజున పితృ దేవతలకు తిల తర్పణం వదిలితే వారి ఆశీస్సులు లభించి కష్టాలు తొలగిపోతాయి. భక్తితో పాటు మంచి ప్రవర్తన ఉంటే ఈ పరిహారాలు శీఘ్ర ఫలితాలనిస్తాయి.

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీని ప్రభావంతో AC, రిఫ్రిజిరేటర్ల ధరలు 5-10% వరకు పెరగనున్నాయి. BEE కొత్త నిబంధనల ప్రకారం 5-స్టార్ ACలు 10% ఎక్కువ ఎనర్జీ ఎఫిషియంట్‌గా ఉండాలి. ఇందుకోసం ఖరీదైన భాగాలు ఉపయోగించాల్సి రావడంతో పాటు రూపాయి విలువ పతనం, కాపర్ ధరల పెరుగుదల కూడా కారణాలుగా కంపెనీలు చెబుతున్నాయి.
Sorry, no posts matched your criteria.