News January 1, 2026

రైలు బోగీలను ఇలా వేగంగా గుర్తించొచ్చు

image

రైలు ప్రయాణంలో మన దృష్టిని ఆకట్టుకునేవి కోచ్‌ల రంగులు. ప్రతి కలర్‌కు ఒక అర్థం ఉంటుంది. నీలం రంగు స్లీపర్‌, ఏసీ, చైర్‌కార్‌ కోచ్‌లను సూచిస్తుంది. ఎరుపు రంగు రాజధాని వంటి హైస్పీడ్ ఏసీ రైళ్లకు వాడతారు. ఆకుపచ్చ రంగు గరీబ్‌రథ్ రైళ్లకు వేస్తారు. ఇక పసుపు, తెలుపు చారల కోచ్‌లు అన్‌రిజర్వ్డ్, పార్సిల్‌ వంటి బోగీలను సూచిస్తాయి. ఈ రంగులు ప్రయాణికులకు త్వరగా బోగీని గుర్తించడంలో సహాయపడతాయి.

News January 1, 2026

PGIMER 59పోస్టులకు నోటిఫికేషన్

image

ఛండీగఢ్‌లోని <>PGIMER <<>>59 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 16వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, సంబంధిత డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గ్రూప్-A పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ -B, C పోస్టులకు రాత పరీక్ష , DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://pgimer.edu.in/

News January 1, 2026

చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవాలి

image

జీవితంలో ఒక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలంటారు పెద్దలు. మార్పు ఓ చిన్న అడుగుతోనే మొదలువుతుంది. అలాంటప్పుడే విజయవంతమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అసాధారణమైన లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించలేక ఇబ్బంది పడటం కంటే చిన్నపాటి లక్ష్యంతో పని మొదలు పెట్టడం ద్వారా ఉన్నత లక్ష్యానికి దారులు సులువుగా వేసుకోవచ్చంటున్నారు.

News January 1, 2026

ఫలితాలను సమీక్షించుకోవడం ముఖ్యం

image

దేన్నైనా సాధించాలి అనుకొనే క్రమంలో కఠిన పరిస్థితులు ఎదురైతే చేస్తున్న పనిని మరోసారి సమీక్షించుకోవాలి. ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు ఏమిటి? ఇప్పటివరకు ఏ వ్యూహం బాగా పనిచేసింది? ఏది సరిగా పనిచేయలేదు? అన్నది పరిశీలించుకోవాలి. పట్టుదలను పెంచుకోవాలి. రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోగలిగినా అనుకున్న లక్ష్యం వైపు వెళ్లేందుకు అవి సాయపడతాయంటున్నారు నిపుణులు.

News January 1, 2026

టెట్ రాసే టీచర్లకు ఓడీ ఇవ్వాలి: ఎమ్మెల్సీ కొమురయ్య

image

TG: టెట్ రాసే టీచర్లకు ఓడీ(ఆన్ డ్యూటీ) ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు ఎమ్మెల్సీ మల్క కొమురయ్య లేఖ రాశారు. టీచర్లకు పరీక్షా కేంద్రాలను సొంత జిల్లాల్లో గానీ వారు పనిచేసే ప్రాంతానికి సమీపంలో కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. ఎల్లుండి నుంచి ఈ నెల 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. పేపర్-1, 2కు మొత్తం 2.37 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే <<18681650>>హాల్ టికెట్లు<<>> విడుదలయ్యాయి.

News January 1, 2026

2026లో IPOల జాతర.. లిస్ట్‌లో జియో, ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే

image

2026లోనూ IPOల జాతర కొనసాగనుంది. ఈ ఏడాది పలు పెద్ద కంపెనీలు స్టాక్ మార్కెెట్లో ఎంట్రీకి సిద్ధమవుతున్నాయి. దాదాపు రూ.11-12 లక్షల కోట్ల విలువైన పబ్లిక్ లిస్టింగ్‌కు రిలయన్స్ జియో ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది తొలి భాగంలోనే IPOకు రానుంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా సుమారు రూ.6 లక్షల కోట్ల వాల్యుయేషన్‌తో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఫోన్ పే, జెప్టో, ఓయోతోపాటు పదుల సంఖ్యలో కంపెనీలు లైన్‌లో ఉన్నాయి.

News January 1, 2026

మహిళలూ కొత్త సంవత్సరంలో ఇవి ముఖ్యం

image

తల్లి, భార్య, కూతురు, కోడలు పాత్రల్లో జీవిస్తున్న మహిళ తన గురించి తాను మర్చిపోయింది. ఈ కొత్త సంవత్సరంలోనైనా నీ కోసం నువ్వు బ్రతుకు. నీ నిర్ణయాలు నువ్వు తీసుకో, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టు. కష్టపడి నిర్మించుకున్న కెరీర్, చెమట చిందించి సంపాదించిన ప్రతి రూపాయినీ కాపాడుకో.. ఇంటర్నెట్ వాడకంలో జాగ్రత్తగా ఉండు.. ఆరోగ్యాన్ని సంరక్షించుకో.. కొత్తసంవత్సరాన్ని అద్భుతంగా మార్చుకో..

News January 1, 2026

క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి

image

దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా గుర్తింపు పొందిన ఇండోర్(MP)లో నీటి కాలుష్యంతో 10 మంది మరణించడం సంచలనంగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేసే మంచినీటి పైప్ లైన్‌లో మురుగునీరు కలవడంతో ఇలా జరిగిందని అధికారులు వెల్లడించారు. DEC 25నే కుళాయిల నుంచి దుర్వాసన వస్తోందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని భగీరథ్‌పుర వాసులు తెలిపారు. మృతుల్లో 6 నెలల శిశువు కూడా ఉంది. 2వేల మంది చికిత్స పొందుతున్నారు.

News January 1, 2026

OP సిందూర్‌కు రాముడే ఆదర్శం: రాజ్‌నాథ్

image

ఆపరేషన్ సిందూర్‌కు శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ‘రాముడి లక్ష్యం కేవలం రావణుడిని చంపడమే కాదు.. అధర్మాన్ని అంతం చేయడం. మేం కూడా ఉగ్రవాదులకు, వాళ్లను పెంచి పోషిస్తున్న వారికి గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా OP సిందూర్ చేపట్టాం’ అని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమాల్లో రామ జన్మభూమి ఉద్యమం ఒకటని, 5 దశాబ్దాలకు పైగా కొనసాగిందని పేర్కొన్నారు.

News January 1, 2026

మామిడి తోటల్లో పూత రాలేదా? ఏం చేయాలి?

image

ప్రస్తుతం మామిడి చెట్లలో కొన్నింటికి పూత మొగ్గలు కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం ఎలాంటి పూత కనిపించడం లేదు. దీని వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. చలి తీవ్రత, పొగ మంచు, ఇతర అంశాలు ఈ పరిస్థితికి కారణం అంటున్నారు నిపుణులు. మామిడిలో మంచి పూత రావాలంటే ఏం చేయాలి? నీరు అందించడంలో జాగ్రత్తలు, తేనె మంచు, బూడిద తెగులు కనిపిస్తుంటే ఎలాంటి మందులు పిచికారీ చేయాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.