News May 30, 2024

హైదరాబాద్‌ ఐకాన్‌ అయిన చార్మినార్‌ను తొలగిస్తారా?: KTR

image

TG: రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ సింబల్ తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్నో శతాబ్దాలుగా హైదరాబాద్‌కు చార్మినార్ ఐకాన్‌గా ఉంది. హైదరాబాద్ అంటే ప్రపంచ వారసత్వ కట్టడమైన చార్మినార్ గుర్తొస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన కారణాలను చూపుతూ రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్‌ను తొలగించాలనుకుంటోంది’ అని ట్వీట్ చేశారు.

News May 30, 2024

బాంబే బ్లడ్ గ్రూప్.. రక్తదానం చేసేందుకు 440 KM ప్రయాణం

image

షిర్డీలోని పూల వ్యాపారి రవీంద్ర అష్టేకర్ (36) పెద్ద మనసు చాటుకున్నాడు. అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ గల ఓ మహిళ ఇండోర్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉందని వాట్సాప్‌లో తెలుసుకున్నాడు. ఇదే గ్రూప్ రక్తం గల రవీంద్ర సొంత ఖర్చుతో 440KM ప్రయాణించి రక్తదానం చేశాడు. ఇలా గతంలోనూ ఆయన పలువురి ప్రాణాలు కాపాడాడు. దేశంలో 179 మందికి మాత్రమే ఈ రకం బ్లడ్ ఉందని వైద్య నిపుణులు తెలిపారు. ఇది బ్లడ్ బ్యాంకుల్లోనూ దొరకదు.

News May 30, 2024

18 నుంచి డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలు!

image

AP: డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను జూన్ 18 నుంచి 29 వరకు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయించింది. AICTE అనుమతి పొందిన కాలేజీల్లోనే బీసీఏ, బీబీఏ కోర్సులను కౌన్సెలింగ్‌లో చేర్చనుంది. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియ చేపట్టనుంది. ఈలోపు అనుబంధ గుర్తింపు, అద్దె భవనాల్లో కొనసాగుతున్న కాలేజీల అనుమతుల పొడిగింపు ఫీజును చెల్లించాలని కాలేజీలకు వర్సిటీలు సూచించాయి.

News May 30, 2024

‘బెడ్ పెర్ఫామెన్స్’ అంటూ జీతాల కోత.. నెట్టింట వైరల్!

image

బిహార్‌లోని జమూయ్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో సరిగ్గా పని చేయలేదంటూ 13మంది టీచర్ల జీతంలో కోతలు విధించారు. ఆ విషయాన్ని ఓ సర్క్యులర్‌లో డీఈఓ తెలిపారు. అయితే ‘బ్యాడ్ పెర్ఫామెన్స్’కు బదులు ‘బెడ్ పెర్ఫామెన్స్’ అని తప్పు దొర్లడంతో ఆ నోటీసు కాస్త నెట్టింట నవ్వులపాలైంది. జోకులు పేలుతుండటంతో జిల్లా యంత్రాంగం వెంటనే వివరణ విడుదల చేసింది.

News May 30, 2024

ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడి.. ఛానల్‌పై ఈసీ చర్యలు

image

పోలింగ్ ప్రక్రియ ముగియక ముందే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రసారం చేసిన ఒడిశాలోని సందీఘోష టీవీపై EC ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర CEOను ఆదేశించింది. జూన్ 1న చివరి దశ ఓటింగ్ జరగనుండగా, ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించుకోవచ్చు. WAY2NEWS అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్‌ను అందిస్తుంది. వేగంగా, విశ్లేషణలతో కూడిన కథనాలను తెలుసుకోవచ్చు.

News May 30, 2024

డ్యామ్‌లు.. డెడ్ స్టోరేజ్

image

AP: వర్షాలు, వరదలు లేకపోవడంతో ప్రధాన జలాశయాలు ఖాళీ అయ్యాయి. శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం, సోమశిల, గొట్టా, కండలేరులో 441TMCల నీటి నిల్వకు అవకాశం ఉండగా ప్రస్తుతం 69.77TMCలే ఉన్నాయి. దాదాపు అన్ని చోట్లా డెడ్ స్టోరేజీ స్థాయి కంటే తక్కువకు పడిపోవడంతో నీటిని వాడుకునే పరిస్థితి లేదు. దీంతో భారీ వర్షాల కోసం ఆయకట్టు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

News May 30, 2024

అంబటి రాయుడు భార్య, పిల్లలకి హత్యాచార బెదిరింపులు!

image

అంబటి రాయుడు భార్యకు కోహ్లీ ఫ్యాన్స్ నుంచి అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆయన స్నేహితుడు సామ్‌పాల్ వెల్లడించారు. ‘1,4 ఏళ్ల వయసున్న కుమార్తెలను హత్యాచారం చేస్తామని బెదిరించారని రాయుడు భార్య చెప్పింది. ఆమెను తీవ్రంగా హింసిస్తున్నారు. వీరిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. IPLని గెలిపించేది ఆరెంజ్ క్యాప్ కాదని రాయుడు పరోక్షంగా కోహ్లీపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

News May 30, 2024

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఏడుకొండలవాడిని 73,811 మంది దర్శించుకున్నారు. 34,901 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.19 కోట్లు లభించింది.

News May 30, 2024

మోదీజీ.. నాకే ఫోన్ చేయొచ్చుగా: ఒడిశా సీఎం

image

బీజేపీ నేతలు తన ఆరోగ్యంపై అబద్ధాల్ని వ్యాప్తి చేస్తున్నారని ఒడిశా సీఎం పట్నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘నెలరోజులుగా నేను రాష్ట్రమంతటా ప్రచారంలో తిరుగుతూ బాగానే ఉన్నా. నేను మంచి మిత్రుడినని మోదీ అన్నారు. మరి అలాంటప్పుడు నాకే ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి కనుక్కోవచ్చుగా’ అని ప్రశ్నించారు. నవీన్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంపై అనుమానాలున్నాయని, దర్యాప్తు చేయిస్తామని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే.

News May 30, 2024

చంద్రగిరి డీఎస్పీ సస్పెండ్

image

AP: పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన అల్లర్ల విషయంలో పోలీసు అధికారులపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా చంద్రగిరి డీఎస్పీ శరత్ కుమార్‌ను తిరుపతి జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. నిన్న ఆయన నియోజకవర్గంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. విధుల్లో డీఎస్పీ నిర్లక్ష్యం వహించినట్లు ఫిర్యాదులు రావడంతో వేటు వేశారు.