India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం రూపీ <<15745743>>సింబల్‌ను<<>> మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది విభజనవాదానికి దారి తీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సొంత రూపీ సింబల్ అంటున్నారని, రానురాను సొంత మిలిటరీ, సొంత దేశం అని కూడా అనొచ్చని చెబుతున్నారు. కేంద్రంతో వివాదం ఉంటే దేశం మొత్తానికి వర్తించే రూపీ సింబల్ మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి స్టాలిన్ సర్కార్ నిర్ణయంపై మీ కామెంట్?

AP: కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. ఈ నెల 16 వరకు కోస్తాలో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. కాగా నిన్న ప్రకాశంలోని పెద్దదోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA వెల్లడించింది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

హోలీ పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఇందులో పవర్ స్టార్‌తో పాటు ఇతర నటులు గుర్రాలపై ఉన్నారు. మార్చి 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలి పార్ట్‌కు ‘sword vs spirit’ ట్యాగ్‌ను ఖరారు చేశారు.

అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఏజెంట్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నిన్నటి నుంచి ఈ సినిమా సోనీ లీవ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కాగా అఖిల్ కొత్త మూవీ షూటింగ్ ఇవాళ్టి నుంచే ప్రారంభమవుతుందని సమాచారం.

TG: కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఏప్రిల్ నుంచి ఉండొచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్ కార్డులు, ఎగువన ఉన్నవారికి ఏపీఎల్ కార్డులు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని పునరుద్ఘాటించారు. ఇప్పటికే పింక్ కార్డులు ఉన్నవారికి గ్రీన్ కార్డులు, తెల్లకార్డు ఉన్నవారికి ట్రైకలర్ కార్డులు వస్తాయని పేర్కొన్నారు.

TG: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. నిన్న అత్యధికంగా నిర్మల్ జిల్లా లింగాపూర్‌లో 40.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర ఎక్కువగా నమోదవుతాయని టీజీడీపీఎస్ అంచనా వేసింది.

హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు పబ్లిక్ హాలిడే ఉంది. అన్ని రకాల విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతబడనున్నాయి. శనివారం నుంచి రెండు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ప్రారంభం అవుతాయి. ఏపీలో ఉ.7.45 నుంచి మ.12.30 వరకు, తెలంగాణలో ఉ.8 నుంచి మ.12.30 గంటల వరకు స్కూళ్లు నడుస్తాయి.

రంగులు చల్లడం వద్దని వారించినందుకు రాజస్థాన్‌లో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కొట్టిచంపారు. హన్సరాజ్(25) స్థానిక లైబ్రరీలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు హోలీ పేరుతో అతనిపై రంగులు చల్లేందుకు ప్రయత్నించగా హన్స్‌రాజ్ వద్దని వారించాడు. దీంతో అతడిపై దాడి చేయగా మరణించాడు. కుటుంబసభ్యులు ఆందోళనకు దిగగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం కామన్. అయితే ఇదే అదనుగా కొందరు తమలోని ఆకతాయితనాన్ని బయటకు తీస్తారు. ఇది పరిధిలో ఉంటే పర్లేదు కానీ హద్దు దాటితేనే సమస్య. ఎదుటి వారి ఇష్టంతోనే వారిపై రంగులు చల్లేందుకు ప్రయత్నించండి. పండగ పేరుతో ఇతరులను ఇష్టం వచ్చినట్లు తాకి, రంగులు పూసి ఇబ్బంది పెట్టకండి. ముఖ్యంగా తెలియని వారి విషయంలో హుందాగా వ్యవహరించండి.
HAPPY HOLI

హోలీ పండగ కారణంగా రేపు హిందీ పరీక్ష రాయలేని సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తామని బోర్డు తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పండగ మార్చి 15న నిర్వహించుకుంటున్నారని ఎగ్జామ్ కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ తెలిపారు. పరీక్షను షెడ్యూల్ ప్రకారమే నిర్ణయించినా రేపు ఎగ్జామ్ రాయలేని స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు మరో అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. తేదీని త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.