News March 12, 2025

ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా గిల్

image

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యారు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకుగానూ ఆయనను ఈ అవార్డు వరించింది. గత నెలలో 5 వన్డేలాడి 94.19 యావరేజ్‌, 101.50 స్ట్రైక్ రేట్‌తో 406 పరుగులు బాదారు. ఇందులో ఓ సెంచరీ సహా మూడు వరుస ఫిఫ్టీలు ఉన్నాయి. స్టీవ్ స్మిత్, గ్లెన్ ఫిలిప్స్ గట్టి పోటీ ఉన్నా వారిని వెనక్కి నెట్టి గిల్‌ ఈ అవార్డు దక్కించుకున్నారు.

News March 12, 2025

రన్యారావును నిద్రపోనివ్వడం లేదు: లాయర్లు

image

బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన నటి రన్యారావును డీఆర్ఐ అధికారులు నిద్రపోనివ్వడం లేదని ఆమె తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. మర్డర్ కేసుల్లోనే మహిళలకు బెయిల్ లభిస్తోందని, అలాంటప్పుడు బెయిల్ పొందడానికి రన్యా కూడా అర్హురాలని వాదనలు వినిపించారు. కాగా రన్యారావు దుబాయ్ నుంచి నడుము చుట్టూ, కాళ్ల కింద భాగం, షూలో 14 కిలోల బంగారం అక్రమంగా తీసుకువస్తూ డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే.

News March 12, 2025

పండగే.. వచ్చే 19 రోజుల్లో 8 రోజులు సెలవులు

image

ఐటీ, ITES ఉద్యోగులకు రానున్న రెండు వారాలు ఆఫీసులకు వెళ్లినట్లే అన్పించదు. ఎందుకంటే మాసంలో మిగిలిన 19 రోజుల్లో 8 రోజులు సెలవులే. 14న హోలీ, 15-16 వీకెండ్ కావడంతో వరుసగా మూడ్రోజులు హాలీడే. ఇక 22-23 వీకెండ్. తిరిగి 29న వీకెండ్, 30 సండే+ఉగాది ఉండగా 31న రంజాన్ సందర్భంగా సెలవు. మొత్తం 8 సెలవుల్లో 2సార్లు 3 రోజుల చొప్పున లాంగ్ వీకెండ్ వస్తుంది. దీంతో సరదాగా ట్రిప్‌కు వెళ్లే వారు ప్లాన్స్ మొదలుపెట్టారు.

News March 12, 2025

కళ్లు పొడిబారుతున్నాయా? ఈ చిట్కాలు పాటించండి

image

కంప్యూటర్ ముందు వర్క్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో 20సెకన్ల పాటు కళ్లను మూసి విశ్రాంతి నివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. స్క్రీన్‌ను కళ్లకు తక్కువ ఎత్తులో ఉండేలా చూసుకోండి. రాత్రివేళల్లో సెల్‌ఫోన్ వాడకం తగ్గించండి. లైటింగ్ వల్ల కంటి చిన్నకండరాలు త్వరగా అలసిపోతాయి. ఏసీ, కూలర్ నుంచి వచ్చే గాలులు నేరుగా కంటిమీద పడనివ్వకండి. గోరువెచ్చని నీటితో శుభ్రపరచండి. బ్లూలైట్ ఫిల్టర్ గ్లాసెస్ వాడటం బెటర్.

News March 12, 2025

CM రేవంత్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. ఇద్దరు మహిళా జర్నలిస్టుల అరెస్ట్

image

TG: సీఎం రేవంత్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రేవతి, తేజస్విని అనే మహిళలను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరి నుంచి రెండు ల్యాప్‌టాప్స్, ఫోన్లను సీజ్ చేశారు.

News March 12, 2025

ఫేక్ ఎంప్లాయీస్‌తో ₹18కోట్లు కొట్టేసిన HRమేనేజర్

image

షాంఘైలో లేబర్ సర్వీసెస్ కంపెనీ పేరోల్ HR మేనేజర్ యాంగ్ ఘరానా మోసం ఉలిక్కిపడేలా చేస్తోంది. 22 ఫేక్ ఎంప్లాయీస్‌ పేరుతో 8 ఏళ్లలో అతడు ₹18కోట్లు కొట్టేశాడు. ఉద్యోగుల నియామకం, శాలరీ రివ్యూ ప్రాసెస్ లేకపోవడాన్ని గమనించిన అతడు మొదట సన్ పేరుతో ఫేక్ A/C సృష్టించాడు. కంపెనీ జీతం వేయడంతో మిగతా కథ నడిపించాడు. ఒక్క రోజైనా సెలవు పెట్టకుండా జీతం తీసుకుంటున్న సన్ గురించి ఫైనాన్స్ శాఖ ఆరా తీయడంతో మోసం బయటపడింది.

News March 12, 2025

PhonePe చూసి మీరూ షాక్ అయ్యారా?

image

దేశంలోనే అత్యధిక యూజర్లు కలిగిన యూపీఐ యాప్ ‘ఫోన్‌పే’ అప్డేట్ అయింది. ఇప్పటి వరకూ యూజర్ ఫ్రెండ్లీగా ఉన్న యాప్‌లో జరిగిన మార్పులు చూసి కస్టమర్లు షాక్ అవుతున్నారు. ఆన్‌లైన్ పేమెంట్ స్కాన్ చేయడం మినహా అందులో ఏ ఆప్షన్ అర్థం కావట్లేదని, ఇలా ఎందుకు అప్డేట్ చేశారని మండిపడుతున్నారు. ఇక సీనియర్ సిటిజన్లు ఇది ‘ఫోన్ పే’ యాప్ కాదంటూ ఆందోళన చెందుతున్నామని అంటున్నారు. మీ కామెంట్?

News March 12, 2025

2027 WC వరకూ రోహిత్ ఆడాలి: పాంటింగ్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2027 ODI WC వరకూ ఆడాలని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ఆకాంక్షించారు. హిట్ మ్యాన్ భారత్‌కు మరో WC అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘తాను ఇప్పుడే వన్డేలకు రిటైర్ కానని, భారత్‌కు నాయకత్వం వహించడం ఇష్టమని స్పష్టం చేశారు. ఆయన మాటలు చూస్తోంటే వచ్చే ODI WC అందించాలనే కసి కనిపిస్తోంది. ఆయన మనసులో అదే ఉందని భావిస్తున్నా’ అంటూ పాంటింగ్ చెప్పుకొచ్చారు.

News March 12, 2025

Stock Markets: టెక్ షేర్లు విలవిల..

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ముగిశాయి. నిఫ్టీ 22,470 (-27), సెన్సెక్స్ 74,029 (-72) వద్ద స్థిరపడ్డాయి. PVT బ్యాంకు, హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఆటో, ఫార్మా, బ్యాంకు, చమురు, ఎనర్జీ షేర్లు ఎగిశాయి. ఐటీ, రియాల్టి, మీడియా, PSU బ్యాంకు, వినియోగ, మెటల్ షేర్లు ఎరుపెక్కాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటామోటార్స్, కొటక్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ టాప్ గెయినర్స్. ఇన్ఫీ, విప్రో, టెక్ఎం, నెస్లే, TCS టాప్ లూజర్స్.

News March 12, 2025

EAPCET నోటిఫికేషన్ విడుదల

image

AP: EAPCET <<15723472>>నోటిఫికేషన్‌ను <<>>JNTU కాకినాడ విడుదల చేసింది. దీని ద్వారా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 15వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 24వ తేదీ వరకు అప్లై చేయవచ్చు. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి.