News March 12, 2025

హలాల్ మటన్ తినాలని హిందూ గ్రంథాల్లో రాయలేదు: మహా మంత్రి

image

హిందువులకు హలాల్ మటన్‌కు ప్రత్యామ్నాయంగా మల్హర్ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుందని మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణె అన్నారు. ఇస్లామిక్ పద్ధతైన హలాల్‌కు హిందూ మతంతో సంబంధం లేదని, దాని గురించి ఎక్కడా రాయలేదని స్పష్టం చేశారు. ‘హైందవాన్ని ఆచరించేవారు ఒక్కటై హిందూ సమాజం హక్కుల కోసం ప్రత్యామ్నాయ మటన్ తీసుకొస్తున్నారు. తింటే హలాల్ తినాలని లేదంటే మానేయాలని ఇన్నాళ్లూ ఒత్తిడి చేశారు. ఝట్కాకే నా మద్దతు’ అని అన్నారు.

News March 12, 2025

ఆరోజునే భూమి మీదకు సునీతా విలియమ్స్!

image

భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు 9 నెలల తర్వాత భూమి మీదకు చేరుకోనున్నారు. స్పేస్‌ఎక్స్ సంస్థ పంపనున్న వ్యోమనౌకలో వీరు తిరిగి భూమి మీదకు చేరుకోనున్నారు. ఈరోజు క్రూ-10ను ప్రయోగించనుండగా, అది ఈనెల 16న ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకురానుంది. సాంకేతిక సమస్యలతో 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

News March 12, 2025

అందుకే శృంగార సీన్లలో నటించట్లేదు: కరీనా

image

సినిమాల్లో కథను నడిపించేందుకు శృంగార సన్నివేశాలు అవసరం లేదని కరీనా కపూర్ అన్నారు. అందుకే తాను అలాంటి సీన్లలో నటించట్లేదని, పైగా ఆ సన్నివేశాలతో తనకు అసౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ‘పశ్చిమ దేశాలతో పోల్చితే INDలో ఇలాంటి సన్నివేశాలను చూసే విధానంలో తేడా ఉంటుంది. ఇక్కడి ప్రేక్షకులు అలాంటి వాటికి సిద్ధంగా లేరు. దానిని హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్‌లాగా చూడరు’ అని ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

News March 12, 2025

155 మందిని విడిపించిన పాక్ ఆర్మీ

image

పాకిస్థాన్‌లో ట్రైన్ <<15724119>>హైజాక్<<>> బందీలను ఆర్మీ విడిపిస్తోంది. ఇప్పటివరకు 155 మందికి విముక్తి కల్పించింది. ఈక్రమంలో జరిగిన కాల్పుల్లో 27 మంది మిలిటెంట్లను కాల్చి చంపింది. మరికొంత మంది ప్రయాణికులు బందీలుగా ఉన్నారు. త్వరలోనే ఆపరేషన్ ముగిస్తామని అక్కడి ఆర్మీ తెలిపింది.

News March 12, 2025

ఆస్పత్రి నుంచి ఉపరాష్ట్రపతి డిశ్చార్జ్

image

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ AIIMSలో చేరిన ఆయన తాజాగా కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో వైద్యులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు.

News March 12, 2025

నిలిచిన SBI సేవలు.. ఇబ్బందిపడ్డ యూజర్లు

image

దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI సేవలు నిన్న సాయంత్రం 4 గంటల పాటు నిలిచిపోయాయి. బ్యాంక్ యూపీఐ చెల్లింపులు జరగకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వెల్లడించారు. అయితే సాంకేతిక కారణాలతో ఈ ఇబ్బంది తలెత్తిందని, తర్వాత సమస్యను పరిష్కరించినట్లు SBI పేర్కొంది. కాగా దేశంలో నిత్యం 39.3 కోట్ల యూపీఐ ట్రాన్స‌ాక్షన్లు జరుగుతున్నాయి.

News March 12, 2025

జొమాటో, స్విగ్గీకి పోటీగా ర్యాపిడో ఫుడ్‌డెలివరీ!

image

బైక్ ట్యాక్సీ కంపెనీ ర్యాపిడో త్వరలో ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి ప్రవేశించబోతోందని సమాచారం. ఇప్పటికే రెస్టారెంట్లతో చర్చలు ఆరంభించిందని తెలిసింది. జొమాటో, స్విగ్గీ వసూలు చేసే ప్రస్తుత కమీషన్ల ప్రక్రియను సవాల్ చేసేలా కొత్త బిజినెస్ మోడల్‌ను రూపొందిస్తోందని ఒకరు తెలిపారు. కొన్ని ఏరియాల్లో తమ టూవీలర్ ఫ్లీట్‌తో ఇండివిడ్యువల్ రెస్టారెంట్ల నుంచి ఇప్పటికే ఫుడ్ డెలివరీ చేస్తున్నట్టు తెలిసింది.

News March 12, 2025

వర్రా రవీందర్ రెడ్డికి రిమాండ్

image

AP: YCP సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీందర్ రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను జగ్గయ్యపేట సబ్ జైలుకు తరలించారు. చంద్రబాబు, పవన్‌పై SMలో అసభ్య పోస్టులు పెట్టారని జగ్గయ్యపేట (M) చిల్లకల్లు PSలో ఆయనపై BNS, IT యాక్టులోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నిన్న NTR జిల్లా చిల్లకల్లు పోలీసులు వర్రాను PT వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

News March 12, 2025

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

image

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. అంతకుముందు గవర్నర్ మాట్లాడుతూ ‘260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో తెలంగాణ రికార్డు సృష్టించింది. రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.

News March 12, 2025

కార్తిక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్ రూమర్స్‌పై క్రేజీ న్యూస్

image

బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్‌తో నటి శ్రీలీల డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో హీరో తల్లి మాలా తివారీ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ మంచి డాక్టర్‌ను కోడలిగా చేసుకోవాలని ఉందని ఆమె అన్నారు. శ్రీలీల మెడిసిన్ చేస్తున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు వీరిద్దరి డేటింగ్‌ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల.. కార్తిక్ ఆర్యన్‌తో ఓ మూవీలో నటిస్తున్నారు