India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. 783 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించారు. తాజాగా అభ్యర్థుల మార్కులతో కూడిన జనరల్ ర్యాంక్ <

కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సందర్శించారు. 2 రోజుల పాటు అక్కడే ఉండి ప్రత్యేక నాగపూజలో పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. అయితే, సంతాన ప్రాప్తి కోసం ఈ పూజ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. సర్పాలకు అధిపతి అయిన కార్తికేయుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిగా పూజలందుకుంటున్నారు. సంతాన ప్రాప్తికోసం, ఇతర సర్ప దోషాల నివారణకు అనేకమంది ఇక్కడికి వెళ్తుంటారు.

AP: హత్యా రాజకీయాల మరక అంటకుండా 42 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్నానని CM చంద్రబాబు తెలిపారు. నేరాలు – ఘోరాలు చేసి రాజకీయాలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. కొందరు ఆడబిడ్డలను మాయమాటలతో మోసగిస్తున్నారని, వారి తాటతీస్తామని హెచ్చరించారు. ఆకతాయిలు వేధిస్తుంటే ‘శక్తి’ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు. వైసీపీ తీసుకొచ్చిన దిశ యాప్ దిక్కుమాలిన యాప్ అని మండిపడ్డారు.

ఓ టీస్పూన్ తేనె అందించేందుకు 12 తేనెటీగలు వాటి జీవితం మొత్తం కష్టపడతాయి. ఒక్క తేనెటీగ సగటున 30-60 రోజులు మాత్రమే జీవిస్తుంది. అది రోజుకు సుమారు 5వేల పుష్పాలను పరాగసంపర్కం చేస్తుంది. ఇలా తన జీవితంలో ఒక్క తేనెటీగ 1.5లక్షల పుష్పాలపై వాలుతుంది. వాటి నుంచి సేకరించిన తేనె టీస్పూన్‌లో పావు వంతు కూడా ఉండదు. కానీ దీనికోసమే ఇవి వాటి జీవితాంతం కష్టపడతాయి.

AP: లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఆడబిడ్డలపై హత్యాచారాలకు పాల్పడిన నిందితులకు అదే చివరిరోజు అవుతుందని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ ఆఫీసులపై దాడులు జరిగాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పారు. తన జీవితంలో రాజకీయ కక్షలు ఉండవని వివరించారు.

తనను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఐపీఎస్ అభిషేక్ మహంతి చేసిన విజ్ఞప్తిని క్యాట్ తిరస్కరించింది. డీవోపీటీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయన పిటిషన్‌పై తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కరీంనగర్ సీపీగా పనిచేసిన అభిషేక్‌ను ఏపీలో రిపోర్టు చేయాలని ఇటీవల కేంద్ర హోంశాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే.

బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ రన్యారావ్ కేసులో మరో ట్విస్ట్. నిజానికి ఆమెపై DRI అధికారులకు ఫిర్యాదు చేసింది భర్తేనని తెలిసింది. ఆయన కుటుంబీకులతో ఆమెకు విభేదాలు ఉన్నట్టు సమాచారం. పెళ్లైన రెండు నెలల నుంచే ఆమె విదేశాల్లో పర్యటించడంతో గొడవలు మొదలైనట్టు వార్తలొస్తున్నాయి. మొదట ఆమె రష్యాకు ఆ తర్వాత దుబాయ్‌కు వెళ్లేది. భర్త సమాచారంతోనే నిఘా పెట్టిన DRI చివరకు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

IPLలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న KL రాహుల్ కెప్టెన్సీపై సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాటింగ్‌పై శ్రద్ధ పెట్టేందుకు సారథ్య బాధ్యతలు అప్పగించొద్దని టీం ఓనర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ జట్టుకు అక్షర్ పటేల్ కెప్టెన్ కావడం లాంఛనమే. ఇన్నాళ్లు రాహుల్, అక్షర్‌లలో ఎవరు కెప్టెన్ అవుతారనే ప్రశ్నలకు తాజా నిర్ణయంతో ఆన్సర్ దొరికినట్లయింది.

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమా హిందీలో ఇప్పటివరకు రూ.516.8 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ‘బాహుబలి-2’ హిందీ వసూళ్లను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,788కోట్లు రాబట్టిన బాహుబలి-2 హిందీలో రూ.510.99 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. కాగా ‘ఛావా’కు తెలుగులో 4 రోజుల్లో రూ.10కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.

TG: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని BRS నేత RS.ప్రవీణ్ కుమార్ ఖండించారు. ‘నా రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటా. అణచివేతకు గురైన వర్గాల విముక్తికి BRS సరైన వేదిక అని నమ్మి ముందుకు వెళ్తున్నా. BRS మళ్లీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ 2.0ను ఎలా సృష్టించాలన్న పనిలో బిజీగా ఉన్నా’ అని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.