News March 11, 2025

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరుణే: అశ్విన్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును వరుణ్ చక్రవర్తికి ఇవ్వాల్సిందని మాజీ క్రికెటర్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ‘నా దృష్టిలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరుణే. అతడు ఆడకపోయుంటే ఫలితాలు వేరేలా ఉండేవేమో. అతడు X-ఫాక్టర్‌ను తీసుకొచ్చారు’ అని పేర్కొన్నారు. కాగా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.

News March 11, 2025

హైదరాబాద్‌కు కేసీఆర్.. కాసేపట్లో కీలక భేటీ

image

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపటి క్రితం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ జరగనుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

News March 11, 2025

ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి నివేదిక

image

AP: ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా CS విజయానంద్‌కు నివేదిక ఇచ్చారు. ఎస్సీ ఉపకులాల నుంచి విజ్ఞప్తులు, అభ్యర్థనలు, అభిప్రాయాలను కమిషన్ సేకరించింది. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ విధానం, ఎస్సీ ఉపవర్గాల్లో ఆర్థిక స్వావలంబనపై కమిషన్ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 2024 NOV 15న రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ IAS రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది.

News March 11, 2025

6 నెలల్లో ₹6కోట్ల కోట్ల అప్పు తీర్చేదెలా..!

image

డొనాల్డ్ ట్రంప్‌‌కు పెద్దచిక్కే వచ్చిపడింది. 6 నెలల్లోనే ఆయన $7.6T (రూ.6 కోట్ల కోట్లు) అప్పు తీర్చాల్సి ఉంది. అమెరికా మొత్తం అప్పుల్లో ఇది 31%కి సమానం. ఎకానమీ మందగమనం వల్ల దీనినెలా రీఫైనాన్స్ చేయాలా అని ఆయన ఆందోళన చెందుతున్నారని తెలిసింది. సాధారణంగా ప్రభుత్వాలు బాండ్లు, ట్రెజరీ బిల్లుల ద్వారా ప్రజల నుంచి నిధులు సమీకరిస్తుంటాయి. వాటి కాలపరిమితి ముగియగానే వడ్డీ సహా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

News March 11, 2025

కావాలనే Stock Markets క్రాష్ చేయిస్తున్న ట్రంప్!

image

US Prez డొనాల్డ్ ట్రంప్ కావాలనే ప్రపంచ స్టాక్‌మార్కెట్లను క్రాష్ చేయిస్తున్నారని విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం పదేళ్ల బాండుయీల్డు 4.20%గా ఉంది. ఇంత వడ్డీరేటుతో 6 నెలల్లో $7.6T అప్పు తీర్చడం సులభం కాదు. అందుకే అనిశ్చితిని సృష్టించి సురక్షితమని భావించే బాండ్లకు పెట్టుబడులను మళ్లించేలా వ్యూహం పన్నారని టాక్. బాండ్లకు డిమాండ్, ధర పెరిగితే యీల్డు తగ్గుతుంది. తక్కువ వడ్డీతో అప్పు చెల్లించడం సులభమవుతుంది.

News March 11, 2025

టాప్-20 పొల్యూటెడ్ సిటీస్.. ఇండియాలోనే 13

image

ప్రపంచంలోని టాప్-20 అత్యంత కాలుష్యమైన నగరాల్లో 13 ఇండియాలోనే ఉన్నట్లు IQAir కంపెనీ వెల్లడించింది. అస్సాంలోని బైర్నిహాట్ ఇందులో టాప్ ప్లేస్‌లో నిలిచింది. అత్యంత కాలుష్యమైన రాజధాని నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. మరోవైపు 2024 మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ లిస్టులో భారత్ ఐదో ర్యాంక్ పొందింది. కాగా వాయు కాలుష్యం వల్ల ఆయుర్దాయం 5.2 ఏళ్లు తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

News March 11, 2025

వేసవిలో కరెంట్ బిల్లు తక్కువగా వచ్చేందుకు టిప్స్

image

*ఫిలమెంట్, CFL బల్బులు కాకుండా LED బల్బులు ఉపయోగించాలి.
*BLDC టెక్నాలజీతో చేసిన ఫ్యాన్లు 60% వరకు కరెంటును సేవ్ చేస్తాయి.
*BEE స్టార్ రేటింగ్ ఎక్కువ ఉన్న ఏసీ తక్కువ కరెంటును వినియోగిస్తుంది.
*ఏసీ ఎల్లప్పుడూ 24°C, అంతకంటే ఎక్కువ ఉండాలి.
*ఫ్రిజ్ డోర్ ఒక్కసారి తీస్తే అరగంట కూలింగ్ పోతుంది. పదేపదే డోర్ తీయకుండా జాగ్రత్త పడాలి.
*ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ పరికరాలకు రెగ్యులర్ సర్వీసింగ్ చేయించాలి.

News March 11, 2025

జగన్‌తో రహస్య స్నేహం లేదు: సోము వీర్రాజు

image

AP: YS జగన్‌తో తనకు రహస్య స్నేహం ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని BJP నేత సోము వీర్రాజు స్పష్టం చేశారు. CM అయ్యే వరకూ ఆయనతో పరిచయం కూడా లేదని తెలిపారు. ‘MLC టికెట్ కోసం నేను ఎలాంటి లాబీయింగ్ చేయలేదు. మంత్రిని అవుతాననేది అపోహ మాత్రమే. 2014లోనే చంద్రబాబు నాకు మంత్రి పదవి ఇస్తానన్నారు. చంద్రబాబు, అమరావతిని నేను వ్యతిరేకించాననడం అవాస్తవం. మోదీ-బాబు బంధంలాగే మా బంధం ఉంటుంది’ అని పేర్కొన్నారు.

News March 11, 2025

ఢిల్లీ కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్, అక్షర్

image

IPLలో అన్ని జట్లు తమ కెప్టెన్లను ప్రకటించగా ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం సస్పెన్స్‌లో ఉంచింది. ఆ జట్టులో సీనియర్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ పంజాబ్ కింగ్స్ 2, లక్నోకు 3 సీజన్లలో సారథ్యం వహించారు. ఇక అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్‌గా ఢిల్లీకి చాలా ఏళ్లుగా సేవలందిస్తున్నారు. వీరిద్దరిలో మీ ఛాయిస్ ఎవరు? కామెంట్ చేయండి.

News March 11, 2025

R5 జోన్‌ లబ్ధిదారులకు వేరే చోట స్థలాలు: నారాయణ

image

AP: రాజధానిపై కక్షతోనే అమరావతిలో మాజీ CM జగన్ R5 జోన్ క్రియేట్ చేశారని మంత్రి నారాయణ అన్నారు. అక్కడ సెంటు చొప్పున 50వేల మందికి ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకొని వారికి వేరేచోట స్థలాలు ఇస్తామని చెప్పారు. ప్రతిపక్షంలో రాజధానికి 30K ఎకరాలు కావాలన్న జగన్ అధికారంలోకి వచ్చి మూడుముక్కలాట ఆడారని విమర్శించారు. 3 ఏళ్లలో రాజధానిని నిర్మిస్తామని, కీలకమైన 185అడుగుల వెడల్పు రోడ్లు 2 ఏళ్లలో పూర్తవుతాయన్నారు.