News March 11, 2025
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరుణే: అశ్విన్

ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును వరుణ్ చక్రవర్తికి ఇవ్వాల్సిందని మాజీ క్రికెటర్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ‘నా దృష్టిలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరుణే. అతడు ఆడకపోయుంటే ఫలితాలు వేరేలా ఉండేవేమో. అతడు X-ఫాక్టర్‌ను తీసుకొచ్చారు’ అని పేర్కొన్నారు. కాగా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.
Similar News
News March 17, 2025
శుభ ముహూర్తం (17-03-2025)

☛ తిథి: బహుళ తదియ సా.4.57 వరకు తదుపరి చవితి ☛ నక్షత్రం: చిత్త మ.12.41 వరకు తదుపరి స్వాతి ☛ శుభ సమయం:1. ఉ.06.09 నుంచి 6.45 వరకు సా.7.21 నుంచి 7.45 వరకు ☛ రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
☛ యమగండం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు ☛ దుర్ముహూర్తం: మ.12.24 నుంచి 1.12వరకు 2. మ.2.46 నుంచి 3.34 వరకు ☛ వర్జ్యం: సా.6.46నుంచి 8.31 వరకు☛ అమృత ఘడియలు: ఉ.7.21
News March 17, 2025
TODAY HEADLINES

* రాజధానికి రూ.11వేల కోట్ల రుణం.. కీలక ఒప్పందం
* అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం: సీఎం
* హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ
* KCR జాతిపిత.. రేవంత్ బూతుపిత: హరీశ్‌రావు
* తాగుబోతోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా?: రేవంత్
* ఎ.ఆర్. రెహమాన్‌కు ఛాతీ నొప్పి, ఆస్పత్రిలో చేరిక
* యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు
* నా బాల్యమంతా తీవ్ర పేదరికంలోనే: PM మోదీ
* IML విజేతగా టీమ్ ఇండియా
News March 17, 2025
IMLT20 విజేతగా ఇండియా మాస్టర్స్

IML T20 లీగ్ విజేతగా టీమ్ ఇండియా అవతరించింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్‌ను ఇండియా మాస్టర్స్ 6వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 149 పరుగుల టార్గెట్‌ను భారత్ 17.1 ఓవర్లలోనే ఛేదించింది. అంబటి రాయుడు 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. ఆరంభంలో సచిన్ (25) మెరుపులు మెరిపించారు. నర్స్ రెండు వికెట్లు సాధించారు. బెస్ట్, బెన్ చెరో వికెట్ తీశారు.