India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

థాయ్‌లాండ్‌లో బందీలుగా మారిన 540 మంది భారతీయులకు విముక్తి లభించింది. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో 540 మందిని సైబర్ నేరగాళ్లు బందీలుగా చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో బాధితులకు విముక్తి లభించగా, ప్రత్యేక విమానంలో వారంతా భారత్‌కు చేరుకున్నారు. బాధితుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన యువత అధికంగా ఉన్నారు.

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో సెంచరీల మోత మోగుతోంది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ సంగక్కర శతకం బాదారు. అతడు 47 బంతుల్లోనే 106 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచారు. ఇందులో 19 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. సంగక్కర విధ్వంసంతో 147 రన్స్ టార్గెట్‌ను లంక 12.5 బంతుల్లోనే ఛేదించింది. కాగా ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ వాట్సన్ మూడు శతకాలు బాదిన విషయం తెలిసిందే.

* సాయంత్రం వేళల్లో కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ తాగకూడదు.
* రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. అలా మీ బ్రెయిన్, బాడీని సిద్ధం చేసుకోవాలి.
* నిద్రకు ముందు రిలాక్స్ అవ్వండి. వేడి నీటితో స్నానం చేస్తే కండరాలు రిలాక్స్ అవుతాయి.
* నైట్ అతిగా తినొద్దు. ఆయాసం వల్ల నిద్ర త్వరగా పట్టదు.

AP: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేదపండితులు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు లోకేశ్ వెంట ఉన్నారు. ఈ నెల 9న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 15 రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్నాయి.

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న క్రమంలో ఆ గ్రామ ప్రజలతో ఆయన భేటీ కానున్నారు. గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు కావాలి? ఇంకా ఏం చేయాలి? అభివృద్ధి సహా ఇతర సదుపాయాలపై వారితో చర్చిస్తారు. అనంతరం మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్నారు.

AP: రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి(D) కూనవరం, వరరామచంద్రపురం, వేలేర్పాడు, మన్యం(D) పాలకొండ, సీతంపేట, లక్ష్మీనర్సుపేట, బూర్జ, హీరా మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 62 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇక్కడ <

రెబల్ స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. దానిపై ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. మూవీ స్టోరీ మహాభారతంలోని బకాసురుడి గురించి ఉంటుందని టాక్. ఆ పేరు మీదే ‘బకా’ అనే టైటిల్‌ను పెట్టాలని ప్రశాంత్ భావిస్తున్నారని సమాచారం. బకాసురుడిని భీముడు చంపాడు. మరి ప్రభాస్ భీముడి పాత్రను పోషిస్తారా లేక ఇది వేరే ఏదైనా కథనా అన్నది ఆసక్తికరంగా మారింది.

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి ఉ.11 గంటలకు విజయవాడ ఆఫీస్‌కు విచారణకు రావాలని పేర్కొన్నారు. కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో కేవీ రావు ఫిర్యాదుతో 506, 384, 420, 109, 467, 120(బి) రెడ్ విత్ 34 సెక్షన్ల కింద VSRకు నోటీసులు ఇచ్చారు. కాగా ఇటీవల విజయసాయి రాజ్యసభ ఎంపీ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు.

AP: హైదరాబాద్‌లో ఉన్నట్లుగానే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని అమరావతిలోనూ ప్రారంభిస్తామని CM చంద్రబాబు పేర్కొన్నారు. వైద్యుడు నోరి దత్తాత్రేయుడు రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. ‘దత్తాత్రేయుడు వైద్యరంగంలో ఎన్నో అవార్డుల్ని దక్కించుకున్నారు. 50 ఏళ్లుగా క్యాన్సర్ చికిత్సలో సేవలందిస్తున్నారు. అమరావతిలోనూ క్యాన్సర్ ఆస్పత్రి ఉండాలని ఆయన సంకల్పించారు. త్వరలోనే కడతాం’ అని తెలిపారు.

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సెకండియర్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రం ముద్రణలో ఏడో ప్రశ్న అస్పష్టంగా ఉండటంతో దానికి పూర్తి మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. జవాబు రాసేందుకు యత్నించిన వారికి 4 మార్కులు కలుపుతామని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.