News March 10, 2025

దేశవ్యాప్తంగా శ్రీచైతన్య విద్యాసంస్థలపై ఐటీ రైడ్స్

image

దేశంలోని 6 రాష్ట్రాల్లో 7 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలోని శ్రీచైతన్య విద్యాసంస్థల్లో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయపు పన్ను అవకతవకలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

News March 10, 2025

ఈనెల 20లోపు అన్ని పోటీ పరీక్షల రిజల్ట్స్: TGPSC

image

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం నిరీక్షించకుండా టీజీపీఎస్సీ చర్యలు చేపట్టింది. ఈనెల 20లోపు అన్ని పోటీ పరీక్షల రిజల్ట్స్ వెల్లడిస్తామని ప్రకటించింది. తాజాగా గ్రూప్-1 ఫలితాలు వెల్లడించింది. రేపు గ్రూప్-2, ఈనెల 14న గ్రూప్-3, ఈనెల 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఈనెల 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది.

News March 10, 2025

ఓటముల బాధ్యుడు గౌతీ CT విజయానికి అవ్వరా..!

image

ట్రాన్సిషన్ పీరియడ్లో కోచింగ్ అంత ఈజీ కాదు. Sr వెళ్లిపోయే, Jr తమ ప్లేస్‌ను సుస్థిరం చేసుకుంటున్న వేళ జట్టుకూర్పు సంక్లిష్టంగా ఉంటుంది. ఏ పరిస్థితుల్లో, ఏ ప్లేసులో, ఎవరెలా ఆడతారో తెలియాలంటే ప్రయోగాలు తప్పనిసరి. ప్రతి ప్రయోగం సక్సెస్ అవుతుందన్న రూలేం లేదు. ఇది అర్థం చేసుకోలేకే శ్రీలంక, కివీస్‌ చేతుల్లో ఓడగానే వేళ్లన్నీ గౌతీవైపే చూపాయి. మరిప్పుడు CT విజయ కీర్తి అతడికి దక్కినట్టేనా! విమర్శలు ఆగేనా!

News March 10, 2025

పదవులు రాలేదని ఆందోళన చెందొద్దు: లోకేశ్

image

AP: పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి లోకేశ్ అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయని భరోసా కల్పించారు. MLCలుగా బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామని పేర్కొన్నారు. దీంతో బలహీనవర్గాలపై TDP చిత్తశుద్ధి మరోసారి చాటుకుందన్నారు. మహిళలు, యువతను ప్రోత్సహించేందుకే గ్రీష్మకు అవకాశం ఇచ్చామని తెలిపారు. MLA కోటా MLC సీటు ఆశించిన పలువురు సీనియర్లకు నిరాశ ఎదురైన విషయం తెలిసిందే.

News March 10, 2025

గ్రూప్-1 ఫలితాలు విడుదల

image

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం రిజల్ట్స్ రిలీజ్ చేశారు. అభ్యర్థులు అధికారిక <>వెబ్‌సైట్‌లో <<>>ఫలితాలు తెలుసుకోవచ్చు. 563 పోస్టులకుగానూ గతేడాది జరిగిన మెయిన్స్ పరీక్షలకు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అటు రేపు గ్రూప్-2 రిజల్ట్స్ రానున్నాయి.

News March 10, 2025

IPLలో ఆ యాడ్స్ బ్యాన్ చేయండి: కేంద్రం

image

మరికొన్ని రోజుల్లో IPL టోర్నీ ప్రారంభం కానుండగా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిషేధించిన వాటితో పాటు పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కోరుతూ BCCIతో పాటు IPL ఛైర్మన్‌కు లేఖ రాసింది. అలాగే, క్రీడాకారులు, కామెంటేటర్స్ కూడా ప్రమోట్ చేయొద్దని ఆరోగ్య శాఖ డైరెక్టర్ లేఖలో పేర్కొన్నారు. IPLను యూత్ ఎక్కువగా చూస్తుండటంతో పొగాకు, మద్యం యాడ్స్ వీరిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

News March 10, 2025

రాష్ట్రంలో భారీ స్కామ్: కేటీఆర్

image

TG: రాష్ట్రంలో భారీ స్కామ్‌కు తెరలేసిందని, టీడీఆర్ బాండ్ల పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు CM రేవంత్ టీమ్ సిద్ధమవుతోందని KTR ఆరోపించారు. రేవంత్‌కు చెందిన నలుగురు వ్యక్తులు HYDలో విచ్చలవిడిగా టీడీఆర్‌లు కొంటున్నారని పేర్కొన్నారు. ‘ఫార్ములా ఈ- రేసుకు రూ.45కోట్లు ఖర్చు చేస్తే తప్పు అన్నారు. ఇప్పుడు అందాల పోటీకి రూ.200కోట్లు ఖర్చు చేస్తారట. దీని వల్ల ఏమైనా లాభం ఉందా?’ అని ప్రశ్నించారు.

News March 10, 2025

కేసీఆర్ అప్పులు, తప్పులను అసెంబ్లీలో పెడతాం: CM రేవంత్

image

TG: తాము ప్రతిపక్షం లేని రాజకీయం చేయాలనుకోవడం లేదని సీఎం రేవంత్ అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికే ఎక్కువ సమయం ఇస్తున్నామని తెలిపారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ‘జీతభత్యం తీసుకుని పని చేయని వ్యక్తి కేసీఆర్. ఆయన చేసిన అప్పులు, తప్పులను అసెంబ్లీలో పెడతాం. KCRకు భయపడి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదు. మూసీకి నిధులు తెస్తే ఆయనకు సన్మానం చేస్తాం’ అని వ్యాఖ్యానించారు.

News March 10, 2025

2027 వన్డే WCకు ముందు 24 వన్డేలు

image

నెక్స్ట్ వన్డే ప్రపంచకప్ 2027 OCT, NOVలో సౌతాఫ్రికాలో జరగనుంది. అప్పటివరకు టీమ్ ఇండియా 24 వన్డేలు ఆడనుంది. బంగ్లా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంకలతో మూడేసి వన్డేలు ఉన్నాయి. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో వారి సొంతగడ్డపైనే తలపడాల్సి ఉంది. అప్పటివరకు రోహిత్, కోహ్లీ వన్డేల్లో కొనసాగుతారా? కామెంట్ చేయండి.

News March 10, 2025

రేవంత్‌కు మానవత్వం కూడా లేదని తేలిపోయింది: KTR

image

TG: CM రేవంత్ అసమర్థత వల్లే గురుకులాల్లో విద్యార్థుల మరణాలు చోటు చేసుకుంటున్నాయని KTR విమర్శించారు. ఇవి కాంగ్రెస్ సర్కారు చేసిన హత్యలేనని మండిపడ్డారు. ‘ఆదిలాబాద్(D) ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో లాలిత్య అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతికరం. పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గం. రేవంత్‌కు మానవత్వం కూడా లేదని తేలిపోయింది’ అని ట్వీట్ చేశారు.