News March 8, 2025

CYBER CRIME: వృద్ధుల వాట్సాప్ హ్యాక్ చేసి!

image

వృద్ధులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వారి వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేసి కాంటాక్ట్స్‌కు ఆర్థిక సహాయం చేయాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ ఫ్రాడ్‌ను ఓ నెటిజన్ లేవనెత్తుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తెలిసిన వృద్ధుడి అకౌంట్‌ను దుండగులు హ్యాక్ చేసి కాంటాక్ట్స్‌లోని చాలా మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. దీనికి పరిష్కారం చూపాలని కోరారు.

News March 8, 2025

మహిళల పెట్టుబడుల్లో మూడో వంతు పిల్లలు, రిటైర్మెంటుకే..

image

ఫైనాన్షియల్ ఫ్యూచర్, ఇండిపెండెన్సీపై మహిళల ఆలోచనా తీరు మారింది. వారి పెట్టుబడుల్లో మూడో వంతు పిల్లలు, రిటైర్మెంటుకే కేటాయిస్తున్నారని డేటా చెబుతోంది. ప్రస్తుత FYలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న స్త్రీల సంఖ్య 18% పెరిగిందని పాలసీ బజార్ తెలిపింది. ఇందులో వేతన జీవులు 49%, హోమ్‌మేకర్స్ 39% అని పేర్కొంది. యంగర్ విమెన్ ఆర్థిక అంశాల్లో చురుగ్గా ఉంటున్నారని మణిపాల్ సిగ్నా రిపోర్ట్ వెల్లడించింది.

News March 8, 2025

రేపు ప్రత్యర్థులు.. ఆ తర్వాత ఒకే జట్టులో!

image

రేపు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఇండియా తలపడనుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్ ఫైనల్‌లోనూ అదే జోరును కొనసాగించి కప్ కొట్టాలనుకుంటోంది. ఇక విజయమెవరిదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. అయితే, కప్ కోసం ఇరు జట్లను నడిపిస్తున్న రోహిత్, శాంట్నర్ ఈనెల 23 నుంచి ఒకే టీమ్ కోసం ఆడనున్నారు. వీరిద్దరూ ఐపీఎల్‌లో MI జట్టు సభ్యులు కావడం విశేషం.

News March 8, 2025

‘హౌస్ హోల్డ్’లో నమోదైతేనే పథకాలు

image

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పథకాలు, ఇతర ప్రయోజనాల కోసం గ్రామ, వార్డు సచివాలయాల హౌస్ హోల్డ్ జాబితా లేదా RTGSలో వివరాల నమోదును తప్పనిసరి చేసింది. ఆయా పథకాల అమలు, వినతుల పరిష్కార సమయంలో ఈ లిస్టులోని వివరాలు సరిపోల్చుకున్నాకే చర్యలు తీసుకుంటామంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

News March 8, 2025

‘జటాధర’లో సోనాక్షి సిన్హా.. ఫస్ట్ లుక్ విడుదల

image

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. వెంకట్ కళ్యాణ్ తెరకెక్కిస్తున్న ‘జటాధర’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నారు. కాగా అనంత పద్మనాభ స్వామి ఆలయ కథాంశంతో హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం.

News March 8, 2025

వీల్‌ఛైర్ ఏర్పాటు చేయలేని ఎయిర్ఇండియా.. ICUలో వృద్ధురాలు!

image

రతన్‌టాటా కీర్తికి ఎయిర్ఇండియా మచ్చతెచ్చేలా ఉంది! నిర్వహణపై ఇప్పటికే మంత్రులు, సెలబ్రిటీలు పెదవి విరిచారు. ముందే వీల్‌ఛైర్ బుక్ చేసుకున్నప్పటికీ 80ఏళ్ల వృద్ధురాలికి నిరాశే మిగిలింది. MAR 4న ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆమె గంటలకొద్దీ నిరీక్షించి బంధువుల సాయంతో నడుస్తూ కిందపడటంతో గాయాలయ్యాయి. అప్పుడు వీల్‌ఛైర్ తెచ్చి BLR ఫ్లయిట్ ఎక్కించారు. ప్రస్తుతం ఆమె ICUలో చికిత్స పొందుతోంది.

News March 8, 2025

మహిళల చేతికి మోదీ SM అకౌంట్స్!

image

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా అకౌంట్స్‌ను ఈ రోజు మహిళల కోసం కేటాయించారు. దీంతో స్ఫూర్తిదాయకమైన కొందరు మహిళలు తమ అనుభవాలను తెలియజేస్తూ మోదీ అకౌంట్స్ ద్వారా ట్వీట్స్ చేస్తున్నారు. చెస్ ప్లేయర్ వైశాలి దేశం కోసం ఆడేందుకు కుటుంబం ఎంతలా సపోర్ట్ చేసిందో తెలిపారు. సైంటిస్టులు ఎలినా మిశ్రా, శిల్పి సోని, బిజినెస్ ఉమెన్ అజైతా షా, సామాజికవేత్త అంజలీ అగర్వాల్ ట్వీట్స్ చేశారు.

News March 8, 2025

12న వైసీపీ ‘యువత పోరు’

image

AP: విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో వైసీపీ ఈ నెల 12న ఆందోళన చేయనుంది. ఈ నేపథ్యంలో ‘యువత పోరు’ పోస్టర్‌ను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆవిష్కరించారు. ఆ రోజున అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద విద్యార్థులతో కలసి నిరసనలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News March 8, 2025

డిగ్రీ అర్హత.. 650 బ్యాంకు ఉద్యోగాలు

image

IDBI బ్యాంకులో 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ పాసై, 20-25 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 6న పరీక్ష ఉంటుంది. దరఖాస్తు ఫీజు SC, ST, PWD అభ్యర్థులకు రూ.250, మిగతా వారికి రూ.1,050.
వెబ్‌సైట్: https://www.idbibank.in/

News March 8, 2025

నేను స్త్రీని.. ఇది నా జీవితం (1/3)

image

నమస్తే.. నేను స్త్రీని. రోజూ మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల, ఆఫీసుల్లో నవ్వుతూ తిరిగే మనిషిని. నవ్వే ఆ పెదవుల మాటున నేను బిగబట్టే ఎన్నో బాధల్ని ఈరోజు మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. నేను పుట్టిన వెంటనే మొదట వినపడేది ఓ నిస్పృహ. ఆడపిల్లా అంటూ. ఎదుగుతున్నాను. చిన్నపిల్లనే అయినా అనేక ఆకలి కళ్ల నుంచి తప్పించుకోవాలి. చీకటి పడ్డాక గడప దాటాలంటే మరొకరి సాయం ఉండాలి. నిర్మానుష్య ప్రాంతాల్లో పగలైనా సరే భయపడాలి.