News September 8, 2024

దేశంలోనే అత్యధిక వేతనం ఈయనదే!

image

దేశంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌గా టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ నిలిచారు. ఈ ఏడాది ఆయన రూ.135 కోట్ల వేతనం అందుకున్నారు. గతేడాదితో పోలిస్తే 20 శాతం పెరిగింది. రూ.135 కోట్ల ప్యాకేజీలో కమీషన్లు రూ.122 కోట్లు ఉండగా, రూ.13 కోట్లు జీతంగా తీసుకున్నారు. ఆయన తర్వాత సౌరభ్ అగర్వాల్-రూ.30 కోట్లు, కృతి వాసన్-రూ.25 కోట్లు, పునీత్ చత్వాల్-రూ.19 కోట్లు, టీవీ నరేంద్రన్-రూ.17 కోట్లు ఉన్నారు.

News September 8, 2024

‘ఇండియన్ 2 ఫ్లాప్ అయినందుకు హ్యాపీ: రేణూ దేశాయ్

image

‘ఇండియన్ 2’ మూవీ ఫ్లాప్ అయినందుకు సంతోషంగా ఉందని నటి రేణూ దేశాయ్ అన్నారు. ఇదే కాదు ఇలాంటి సినిమాలన్నీ డిజాస్టర్లు కావాలని ఆమె కోరుకున్నారు. ‘‘ఇండియన్ 2’ లో వీధికుక్కలను హీనంగా చూసే డైలాగ్ ఉంది. అసలు ఇలాంటి డైలాగులు ఎలా రాస్తారా? వాళ్లకేమైనా బుర్ర పాడైందా? వీధికుక్కలు డర్టీగా ఉండవు. వాటికి ప్రేమ కావాలి. ద్వేషం కాదు’ అని ఆమె పేర్కొన్నారు.

News September 8, 2024

పాక్‌కూ గంభీర్ లాంటి కోచ్ రావాలి: మాజీ క్రికెటర్

image

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లాంటి వారు వస్తేనే పాకిస్థాన్ క్రికెట్ బాగుపడుతుందని ఆ దేశ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా అన్నారు. అలాంటి వారే తమ క్రికెట్ పతనాన్ని అడ్డుకోగలరని చెప్పారు. ‘గంభీర్ ముక్కుసూటి మనిషి. ఆయనకు వెన్నుపోటు పొడవడం తెలియదు. కోచ్ అంటే అలానే ఉండాలి. తమ క్రికెట్ బోర్డు ఎన్ని మార్పులు చేసినా లాభం లేకుండా పోతోంది. ఆటగాళ్లు లెక్కలేనితనంతో ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

News September 8, 2024

హ్యాపీ బర్త్ డే ప్రిన్స్ ఆఫ్ వరల్డ్ క్రికెట్

image

టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పుట్టినరోజు నేడు. 1999లో ఇదే రోజు పంజాబ్‌లోని ఫజిల్కాలో జన్మించారు. మూడేళ్ల నుంచే ఆయన క్రికెట్ ఆడుతున్నారు. 19 ఏళ్ల వయసులోనే టీమ్ ఇండియాలో చోటు దక్కించుకుని స్టార్ క్రికెటర్‌గా ఎదిగారు. వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన యంగెస్ట్ క్రికెటర్‌గా నిలిచారు. అన్ని ఫార్మాట్లలోనూ సెంచరీలు బాదారు. IPLలో ఆరెంజ్ క్యాప్ సాధించారు. ప్రస్తుతం ఆయన GT కెప్టెన్‌గా ఉన్నారు.

News September 8, 2024

నటుడు మురళీ మోహన్‌కు హైడ్రా నోటీసులు

image

TG: సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగలాల్ కుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు తొలగించాలని నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లోగా కూల్చకపోతే తామే కూలుస్తామని హైడ్రా హెచ్చరించింది.

News September 8, 2024

జింబాబ్వేకు భారత్ సాయం

image

ఆకలి కోరల్లో చిక్కుకుపోయిన జింబాబ్వేకు మానవతా సాయంతో భారత్ సాయం చేసింది. ఆ దేశంతోపాటు జాంబియా, మాలావికి కూడా ఆహారం పంపింది. 1,000 టన్నుల బియ్యం, 1,300 టన్నుల మొక్కజొన్నలు, ధాన్యాలు పంపింది. ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ర‌ణ్‌ధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు. కాగా వర్షాల లేమితో తీవ్ర కరువు ఏర్పడి ఈ మూడు దేశాలు అల్లాడిపోతున్నాయి. ఆహారం లేక చిన్నారులు అలమటిస్తుండటంతో భారత్ ఈ సాయం చేసింది.

News September 8, 2024

రూల్ ఆఫ్ లాపై బీజేపీకి నమ్మకం లేదు: రాహుల్‌

image

BJP పాలిత రాష్ట్రాల్లో చట్టాన్ని, రాజ్యాంగాన్ని అమ‌లు చేయాల్సిన వారే వాటిని తుంగ‌లో తొక్కుతున్నార‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ మండిప‌డ్డారు. యూపీలో మంగేష్ యాద‌వ్ అనే యువ‌కుడిని పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేయడంపై ఆయ‌న స్పందించారు. ఈ ఉదంతం రూల్ ఆఫ్ లాపై BJPకి న‌మ్మ‌కం లేద‌న్న విష‌యాన్ని మ‌రోసారి రుజువు చేసింద‌న్నారు. BJP ప్రభుత్వ హయాంలో STF వంటి దళం ‘క్రిమినల్ గ్యాంగ్’లా పనిచేస్తోందని విమ‌ర్శించారు.

News September 8, 2024

PARALYMPICS: భారత్ ఖాతాలో మరో స్వర్ణం

image

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్ F41 కేటగిరీ ఫైనల్‌లో నవదీప్ సింగ్ 47.32 మీటర్ల దూరం బల్లెం విసిరి విజేతగా నిలిచారు. ఇరాన్ జావెలిన్ త్రోయర్ సదేఘ్ 47.64 మీటర్లు విసిరినా నిర్వాహకులు ఆయన డిస్‌క్వాలిఫై చేశారు. దీంతో రెండో స్థానంలో నిలిచిన నవదీప్‌ను గోల్డ్ మెడల్ విజేతగా ప్రకటించారు. కాగా భారత్ ఖాతాలో ఇప్పటివరకు 29 పతకాలు చేరాయి.

News September 8, 2024

సెప్టెంబర్ 08: చరిత్రలో ఈ రోజు

image

1910: సినీ దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ జననం
1933: బాలీవుడ్ సింగర్ ఆశా భోస్లే జననం
1936: మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి జననం
1951: డైరెక్టర్ మాధవపెద్ది సురేష్ జననం
1986: బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ జననం
1999: టీమ్ ఇండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ జననం
2020: టాలీవుడ్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణం
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం

News September 8, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

error: Content is protected !!