News September 7, 2024

మహాభారతం రాసేందుకు వినాయకుడు విధించిన షరతు ఏంటంటే..!

image

మహాభారతాన్ని వేదవ్యాసుల వారు బోధించగా వినాయకుడు రాసినట్లు పురాణ ప్రశస్తి. అయితే.. రాసేందుకు గణేశుడు ఓ షరతు విధించినట్లు కథనం ఉంది. దాని ప్రకారం.. రాయడానికి తనకు అంగీకారమేనని, కథ మొత్తం ఏకధాటిగా చెప్పాలని ఆయన షరతు పెట్టాడట. వ్యాసులవారు చెప్పడం ఆగితే తాను కూడా రాయడం ఆపేస్తానని అనడంతో ఏకధాటిగా మూడేళ్ల పాటు వ్యాసుల వారు భారతాన్ని వినిపించారని ఓ కథనం.

News September 7, 2024

అసలు ప్రభుత్వం ఉందా? లేదా?: జగన్

image

AP: విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా ఇంకా ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘అసలు ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని అనిపిస్తోంది. ఐదారు లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందా? గతంలో చాలా సార్లు 30 సెం.మీ పైగా వర్షం పడినా ఈ మాదిరిగా 50 మందికి పైగా ప్రజలు చనిపోలేదు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరోజులోనే రేషన్ సరుకులు పంపిణీ చేశాం’ అని తెలిపారు.

News September 7, 2024

వాళ్లను చూస్తే గుండె తరుక్కుపోతోంది: చంద్రబాబు

image

AP: బుడమేరు వరదతో ఇప్పటికీ చాలా ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ పాపాలతోనే ఈ వరద వచ్చిందన్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో వారిని చూస్తే గుండె తరుక్కుపోతుందని చెప్పారు. విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో నాలుగు అడుగుల నీళ్లతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఇంకా 1 TMCకి పైగా నీరు విజయవాడ కాలనీల్లో ఉందన్నారు. వర్షాలతో మళ్లీ ఇబ్బందులు నెలకొన్నాయన్నారు.

News September 7, 2024

‘జైలర్’ విలన్ అరెస్ట్?

image

రజినీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘జైలర్’ విలన్ వినాయకన్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో భద్రతా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో అతడిపై RGI పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ నటుడిని అరెస్ట్ చేశారని వార్తలొస్తున్నాయి. గతంలో మహిళలను వేధించిన కేసులో వినాయకన్ అరెస్టైన సంగతి తెలిసిందే.

News September 7, 2024

మున్నేరుకు వరద.. పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి ఆదేశం

image

TG: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షంతో మున్నేరు నదికి వరద ప్రవాహం మొదలైంది. దీంతో ఖమ్మం నగరంలోని ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

News September 7, 2024

కృష్ణానదికి పెరిగిన వరద

image

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం 8 గేట్లు ఎత్తి 2.70 లక్షలు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 67వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. అటు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి సైతం వరద పెరుగుతోంది. 65 గేట్లు ఎత్తి 3.05 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు.

News September 7, 2024

కూటమి వినాయకులను చూశారా?

image

AP: విశాఖపట్నంలోని 37వార్డులో వినాయక చవితి సందర్భంగా పవన్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన గణేషుడి ప్రతిమలు తెగ వైరలవుతున్నాయి. రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలో ఉందనే విషయాన్ని చెప్పేలా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లా ఉన్న విగ్రహాలను ప్రతిష్ఠించారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ విగ్రహాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

News September 7, 2024

PHOTO: ‘దేవర’ వినాయకుడిని చూశారా?

image

వినాయక చవితి నేపథ్యంలో పలు చోట్ల కొందరు తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు. ఇప్పటికే క్రికెట్, పుష్ప థీమ్‌తో ఉన్న గణేషులు వైరలవుతోండగా ఏపీలో ఓ చోట దేవర గెటప్‌లో ఉన్న వినాయకుడిని ప్రతిష్ఠించారు. చేతిలో గొడ్డలితో ఉన్న విగ్రహం వైరలవుతోంది. అయితే అభిమానం మాటున ఇలాంటి విగ్రహాలను ఏర్పాటు చేయడం సరికాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

News September 7, 2024

మైనర్లకు పాన్ కార్డు అప్లై చేస్తున్నారా?

image

పిల్ల‌ల పేరిట పాన్ కార్డుకు అప్లై చేసేవారు ఫాం 49Aని వినియోగించాలి. దీనిపై తల్లిదండ్రుల సంతకం తప్పనిసరి. అలాగే పిల్లల బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఫొటో సహా ఇతర పత్రాలు అవసరం. మైన‌ర్ల‌కు జారీ చేసే పాన్‌కార్డులో వారి ఫొటో, సంత‌కం ఉండ‌దు. వాళ్లు మేజ‌ర్లు(18 ఏళ్లు) అయ్యేంత వ‌ర‌కు మాత్ర‌మే ఈ కార్డు చెల్లుతుంది. తిరిగి స‌వ‌ర‌ణ‌లకు దరఖాస్తు చేసుకోవాలి. కార్డు నంబ‌ర్ అలాగే కొన‌సాగుతుంది.

News September 7, 2024

దీప్తి జీవాంజికి రూ.కోటి నజరానా

image

TG: పారిస్ పారాలంపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న వరంగల్(D)కు చెందిన అథ్లెట్ దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ భారీ నజరానా ప్రకటించారు. ఆమెకు రూ.కోటి నగదుతో పాటు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. దీప్తి కోచ్‌కు రూ.10 లక్షలు నజరానా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు పారా గేమ్స్ క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు.

error: Content is protected !!