News September 7, 2024

‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌పై నో క్లారిటీ

image

రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ విడుదలపై సందిగ్ధత వీడలేదు. తాజాగా ఇచ్చిన <<14044354>>అప్డేట్‌లోనూ<<>> రిలీజ్ డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. మూడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా విడుదల తేదీపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి నెక్ట్స్ అప్డేట్‌లోనైనా ప్రకటిస్తారో లేదో వేచి చూడాలి. కాగా ఈ చిత్రం డిసెంబర్‌లో రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది.

News September 7, 2024

బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం: మంత్రి రవీంద్ర

image

AP: ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్స్ ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం దాగి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ బోట్లు వైసీపీ నాయకులకు చెందినవని అనుమానాలు ఉన్నాయన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇసుక తోలే హెవీ పడవలను తీసుకొచ్చి వదిలారని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖ అధికారి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గత YCP ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే బుడమేరుకు ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.

News September 7, 2024

పూజ ఖేడ్కర్‌‌పై కేంద్ర ప్రభుత్వం వేటు

image

అఖిల భారత సర్వీసుల నుంచి వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌ను కేంద్ర ప్ర‌భుత్వం తొల‌గించింది. యూపీఎస్సీ ఆమె సెలక్షన్‌ను రద్దు చేసిన నెల‌రోజుల త‌రువాత కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఐఏఎస్ నుంచి ఆమె తొల‌గింపు ఆదేశాలు త‌క్ష‌ణ‌మే అమల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. 1954 IAS (Probation) నియమావళి నిబంధన 12 కింద ఈ నిర్ణయం తీసుకుంది.

News September 7, 2024

వేర్వేరు బంకుల్లో పెట్రోల్ కొట్టిస్తే ప్రమాదమా?

image

వేర్వేరు బంకుల్లో ఇంధనం కొట్టిస్తే ఇంజిన్ పాడవుతుందనేది చాలామంది భావన. అయితే అది అపోహ మాత్రమేనని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. ఆయిల్ కంపెనీలు అన్ని స్టేషన్లలో దాదాపు ఒకే క్వాలిటీతో ఇంధనం సరఫరా చేస్తాయంటున్నారు. తెలియని పెట్రోల్ బంకుల్లో చీటింగ్ జరుగుతుందనే సందేహం వల్లే చాలామంది ఒకే చోట కొట్టిస్తున్నట్లు చెప్పారు. మీరూ ఒకే బంకులో పెట్రోల్ కొట్టిస్తారా? మీ అభిప్రాయం, అనుభవం ఏంటో కామెంట్ చేయండి.

News September 7, 2024

సేవింగ్స్ ఖాతాదారుల‌కు షాక్ ఇచ్చిన RBL

image

చిన్న మొత్తంలో నగదు పొదుపు చేసుకొనే ఖాతాదారుల‌కు RBL షాక్ ఇచ్చింది. సేవింగ్స్ అకౌంట్లలో రూ. లక్ష వరకు బ్యాలెన్స్ కలిగిన కస్టమర్లకు ప్రస్తుతం ఇస్తున్న‌ 3.75% వ‌డ్డీలో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అక్టోబ‌ర్ 1 నుంచి అమ‌ల్లోకి రానున్న ఈ నిబంధ‌న‌ల‌తో ఖాతాదారుల‌కు ఇక‌పై 3.50% మాత్ర‌మే వ‌డ్డీ ద‌క్క‌నుంది. ఈ మేర‌కు బ్యాంకు వెబ్‌సైట్‌లో ప్రకటించింది. రూ.లక్షపైన పొదుపు స్లాబ్స్‌లో ఎలాంటి మార్పు లేదు.

News September 7, 2024

భారీ వర్షం

image

TG: తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రాబోయే 1-2 గంటల్లో నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, హనుమకొండ, జనగాం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

News September 7, 2024

మోదీ మీద నాకు నమ్మకం లేదు: పునియా

image

రెజర్ల మధ్య విభేదాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తోందని కాంగ్రెస్ నేత, రెజ్లర్ బజరంగ్ పునియా మండిపడ్డారు. ప్రధాని మోదీపై తనకు నమ్మకం పోయిందన్నారు. ‘రెజ్లర్లు ఎక్కడికి వెళ్లినా మన దేశం కోసం, జెండా కోసం పోరాడుతాం. నేరస్థుడైన బ్రిజ్ భూషణ్‌కు బీజేపీ అండగా నిలిచింది. నాపై దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించింది. డోపింగ్ ఆరోపణలతో నన్ను నిషేధించింది’ అని ఆరోపించారు.

News September 7, 2024

వరదలకు 43 మంది మృతి: సిసోడియా

image

AP: రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 34 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. వరదలకు ఇప్పటివరకు 43 మంది మరణించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రూ.6,800 కోట్ల నష్టం జరిగినట్లు కేంద్రానికి నివేదించినట్లు పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ లేకపోయినా పంట నష్టం ఇస్తామన్నారు.

News September 7, 2024

దేశవాళీలో DRS.. బీసీసీఐ భేష్: అశ్విన్

image

ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో బీసీసీఐ DRSను తీసుకురావడంపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. దీని వల్ల దేశవాళీ క్రికెట్‌లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని ఆయన ట్విటర్‌లో అభిప్రాయపడ్డారు. యువ క్రికెటర్లు సైతం తమ తప్పుల్ని తెలుసుకుని తమను తాము మెరుగుపరుచుకుంటారని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రికీ భుయ్ తాజాగా ఔటైన విధానాన్ని ఆయన ఉదాహరణగా వివరించారు.

News September 7, 2024

భారీగా తగ్గిన ఐఫోన్ ధర

image

సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 సిరీస్ ఇండియాలో లాంచ్ కానుంది. దీంతో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా పడిపోతున్నాయి. గతేడాది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లాంచ్ చేసినప్పుడు ధర రూ.1,59,900గా ఉండేది. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో దాని రేటు రూ.1,32,990కు పడిపోయింది. క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే మరింత డిస్కౌంట్ ఇస్తున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ.1.59 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

error: Content is protected !!