News September 7, 2024

మమ్ముట్టి బర్త్‌డే.. స్పెషల్ ఫొటో షేర్ చేసిన మోహన్‌లాల్

image

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పుట్టిన రోజు సందర్భంగా అగ్రహీరో మోహన్‌లాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే డియర్ ఇచ్చక్కా’ అంటూ ఓ స్పెషల్ ఫొటోను Xలో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్ డే డియర్ ఇచ్చక్కా’ అని రాసుకొచ్చారు. మమ్ముట్టిని మోహన్‌లాల్ ప్రేమగా ‘ఇచ్చక్కా’(పెద్దన్న) అని పిలుస్తుంటారు. కాగా తమ అభిమాన హీరోలిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉండటంతో సోషల్ మీడియాలో ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు.

News September 7, 2024

కశ్మీర్‌లో ఉగ్రవాదుల్ని అడ్డుకునేందుకు ప్రజలకు శిక్షణ

image

ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేందుకు గాను జమ్మూకశ్మీర్‌లో ప్రజలకు భారత సైన్యం శిక్షణ ప్రారంభించింది. కశ్మీర్ పోలీసులతో కలిసి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్(VDG)లను సిద్ధం చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం 600మంది వరకు శిక్షణ పొందుతున్నారని, ఆటోమేటిక్ రైఫిల్స్ వాడకం, డ్రిల్స్, చిన్నపాటి మెళకువలు వారికి నేర్పిస్తున్నామని పేర్కొంది. ఒక్కో VDG విభాగానికి 3రోజుల శిక్షణ అందిస్తున్నట్లు స్పష్టం చేసింది.

News September 7, 2024

FLASH: ఆర్టీసీ బస్సు బోల్తా

image

AP: శ్రీసత్యసాయి జిల్లా గుమ్మలకుంట దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సు ముందు టైర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 7, 2024

‘సింగం అగైన్’లో ప్రభాస్, సూర్య క్యామియో రోల్స్?

image

రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో అజయ్ దేవగణ్ హీరోగా ‘సింగం అగైన్’ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ చిత్రంలో ఒరిజినల్ సింగం సూర్య, ప్రభాస్ క్యామియో రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. గతంలో ప్రభాస్ యాక్షన్ జాక్సన్ సినిమాలో, సూర్య సర్ఫిరా మూవీలో గెస్ట్ రోల్స్‌ చేశారు.

News September 7, 2024

SEP 12న నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘మిస్టర్ బచ్చన్’

image

రవితేజ హీరోగా డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఈనెల 12న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఇది రిలీజ్ అవుతుంది. ఆగస్టు15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇందులో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించారు.

News September 7, 2024

హత్యాచార నిందితుడికి బెయిల్ ఇచ్చేయాలా?.. సీబీఐపై జడ్జి ఆగ్రహం

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార కేసు విచారణకు సీబీఐ తరఫు లాయర్ 40 నిమిషాలు ఆలస్యంగా హైకోర్టుకు వచ్చారు. దీంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది సీబీఐ అలసత్వానికి నిదర్శనం. చాలా దురదృష్టకరం. నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ మంజూరు చేయమంటారా?’ అని మండిపడ్డారు. చివరికి వాదనలు విన్న జడ్జి నిందితుడిని 14 రోజుల జుడీషియల్ కస్టడీకి పంపారు

News September 7, 2024

అడగకుండా మామిడాకులు కోశాడని..

image

AP: వినాయక చవితి వేళ దారుణం జరిగింది. కృష్ణా జిల్లా యనమలకుదురులో అర్జునరావు అనే వ్యక్తి మామిడాకుల కోసం బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే అడగకుండా ఎందుకు కోస్తున్నావంటూ ఇంటి యజమాని అతడితో గొడవకు దిగాడు. వాగ్వాదం పెరగడంతో అర్జునరావుపై యజమాని కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు.

News September 7, 2024

ఈ నెల 10న ‘దేవర’ ట్రైలర్

image

‘దేవర’ ట్రైలర్ ఈ నెల 10న రిలీజ్ చేయనున్నట్లు హీరో ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

News September 7, 2024

గణేశ్ మండపాలు ఈ దిశలో అస్సలు వద్దు!

image

గణేశ్ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా వినాయక మండపాలే దర్శనమిస్తున్నాయి. అయితే చాలామంది యువతకు ఏ దిశలో విగ్రహం పెట్టాలనే సందేహం ఉంటుంది. వాస్తు ప్రకారం వినాయకుడిని తూర్పు దిశలో ప్రతిష్ఠించడం వల్ల మంచి శుభం కలుగుతుందని పండితులు అంటున్నారు. తూర్పున సాధ్యం కాకపోతే ఉత్తరం వైపు పెట్టుకోవచ్చని చెబుతున్నారు. అయితే యముని స్థానమైన దక్షిణం వైపు అస్సలు పెట్టకూడదంటున్నారు.

News September 7, 2024

అఖండ-2: బాలయ్య విలన్‌గా గోపీచంద్?

image

బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబినేషన్‌లో మరో మూవీ పట్టాలెక్కనుంది. ఇది అఖండ-2 అనే ప్రచారం జరుగుతోంది. ఇందులో విలన్‌గా గోపీచంద్‌ను తీసుకోవాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయనకు స్టోరీ చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి ముగ్గురు కాంబోలో మూవీ వస్తే క్రేజీగా ఉంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ ఆరంభంలో జయం, నిజం, వర్షం సినిమాల్లో గోపీచంద్ విలనిజం పండించారు.

error: Content is protected !!