India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇవాళ తన 300వ వన్డే మ్యాచ్ ఆడనున్నారు. న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచులో ఆయన ఈ ఘనత సాధించనున్నారు. కోహ్లీ 299 వన్డేల్లో 93 స్ట్రైక్ రేట్‌తో 14,085 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలు, 73 ఫిఫ్టీలు ఉన్నాయి. సచిన్, సంగక్కర తర్వాత వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా కొనసాగుతున్నారు. ఈ ‘ఛేజ్ మాస్టర్’ ఛేజింగ్‌లో 105 మ్యాచుల్లోనే 5,913 పరుగులు సాధించడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి బ్రిటన్ సిటిజన్ షిప్ అందుకున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై మెగా టీమ్ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేసింది. ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా చిరంజీవికి యూకే గవర్నమెంట్ తమ పౌరసత్వం ఇచ్చి గౌరవించిందంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

TG: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ దగ్గరికి ఆక్సిజన్, ఎమర్జెన్సీ అంబులెన్సులు చేరుకున్నాయి. ఘటనా స్థలానికి ఫొరెన్సిక్ నిపుణులు కూడా చేరుకున్నారు. ఇవాళ సాయంత్రానికి కార్మికుల ఆచూకీ తెలుసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలింపు చేపట్టారు. అనుమానిత ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేస్తున్నారు. కాగా కొందరు టీబీఎమ్ అడుగుభాగాన ఇరుక్కుపోయి ఉండవచ్చని సమాచారం.

1935: ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జననం
1936: దిగ్గజ రంగస్థల నటుడు అబ్బూరి గోపాలకృష్ణ జననం
1938: తొలితరం నాటకకర్త వడ్డాది సుబ్బారాయుడు మరణం
1949: కవయిత్రి సరోజినీ నాయుడు మరణం
1956: ఫ్రాన్స్ నుంచి మొరాకో దేశానికి స్వాతంత్ర్యం
1963: మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ జననం
1977: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ జననం
1990: ఉమ్మడి ఏపీ తొలి ముస్లిం మహిళా మంత్రి మసూమా బేగం మరణం

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

WPLలో RCB వరుసగా నాలుగు మ్యాచులు ఓడి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచుల్లోనే చతికిలపడింది. నాలుగు సార్లు టాస్ కూడా ఓడడం గమనార్హం. ఇప్పటికే ఈ జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. కాగా IPLలోనూ ఆర్సీబీ ఇప్పటికీ కప్ కొట్టని విషయం తెలిసిందే.

మార్చి 2, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 5.22 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.34 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.23 గంటలకు
ఇష: రాత్రి 7.35 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

☛ తిథి: శుక్ల తదియ, రా.12.52 వరకు
☛ నక్షత్రం: ఉత్తరాభాద్ర, మ.12.17 వరకు
☛ శుభ సమయం: ఉ.7.58 నుంచి 8.34 వరకు, మ.2.22 నుంచి 2.34 గంటల వరకు
☛ రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
☛ యమగండం: మ.12.00 నుంచి 1.30 వరకు
☛ దుర్ముహూర్తం: సా.4.25-నుంచి 5.13 వరకు
☛ వర్జ్యం: రా.11.29 నుంచి 12.59 వరకు
☛ అమృత ఘడియలు: ఉ.7.48 గంటల నుంచి 9.17 వరకు

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే వైదొలగడంపై భారత మాజీ క్రికెటర్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అన్ని ఫార్మాట్లలో బజ్‌బాల్‌ను గుడ్డిగా ఫాలో అవ్వొద్దు. “వన్ నేషన్, వన్ స్టైల్” పనిచేయదు. సక్సెస్‌ఫుల్ టీమ్స్ పరిస్థితులకు తగ్గట్లు అడ్జస్ట్ అవుతాయి. జో రూట్‌ను ఫాలో అవ్వండి.. బజ్‌బాల్‌ను కాదు’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.