News March 1, 2025

డ్రగ్స్‌పై పంజాబ్ యుద్ధం

image

మాదకద్రవ్యాలను అరికట్టడమే లక్ష్యంగా పంజాబ్ ప్రభుత్వం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇవాళ ఒక్కరోజే 12వేల మందికి పైగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 750 ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. 8 కిలోల హెరాయిన్, 16వేలకు పైగా మత్తు ట్యాబ్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 290 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. తమ పోరాటానికి పార్టీలకతీతంగా మద్దతు ఇవ్వాలని ఆప్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

News March 1, 2025

తీవ్ర విషాదం.. ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని

image

TG: చదువు ఇష్టం లేకపోవడం, పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్(D)లో జరిగింది. నర్సాపూర్‌‌కు చెందిన వైష్ణవి HYDలోని ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. శివరాత్రి సందర్భంగా ఇంటికి వచ్చిన ఆమె ఇవాళ ఇంట్లోనే ఉరివేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలకు పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యం చెప్పాలని పేరెంట్స్, టీచర్లకు నిపుణులు సూచిస్తున్నారు.

News March 1, 2025

సౌతాఫ్రికా ఈ సారైనా..

image

గత రెండేళ్లుగా సౌతాఫ్రికాకు ఐసీసీ టోర్నీలు పీడకలను మిగిల్చాయి. 2023లో మెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. ఆ తర్వాతి ఏడాది టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్ చేరినా భారత జట్టు చేతిలో అనూహ్యంగా పరాజయం పాలై కన్నీటిలో మునిగింది. ఇక ఈ ఏడాది జూన్‌లో జరిగే WTC ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇదే ఊపులో ఉన్న ప్రోటీస్ జట్టు CT సెమీఫైనల్లో సత్తా చాటి ఫైనల్లోకి దూసుకెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది.

News March 1, 2025

సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న రంభ

image

సీనియర్ హీరోయిన్ రంభ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ప్రకటించారు. ‘సినిమానే నా ఫస్ట్ లవ్. కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు, ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనుకుంటున్నా’ అని తెలిపారు. 90ల్లో హీరోయిన్‌గా, ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్‌లో నటించిన ఆమె 2010లో ఇంద్రకుమార్ అనే వ్యాపారిని వివాహమాడారు. వీరికి ముగ్గురు పిల్లలు.

News March 1, 2025

గర్భిణులు, వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దు: APSDMA

image

APలో 3 నెలలపాటు ఎండలు, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని <>APSDMA<<>> వెల్లడించింది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయంది. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, బయటికెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. డీహైడ్రేట్ కాకుండా నీళ్లు, మజ్జిగ, కొబ్బరి, లెమన్ వాటర్ తాగాలని సూచించింది. ఎండలపై సమాచారం కోసం 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలంది.

News March 1, 2025

యూట్యూబ్ రూమర్లను నా భార్యకు పంపుతున్నారు: అనిల్ రావిపూడి

image

యూట్యూబ్‌లో వ్యూస్ కోసం రూమర్లు క్రియేట్ చేసే వారిపై డైరెక్టర్ అనిల్ రావిపూడి అసహనం వ్యక్తం చేశారు. మీనాక్షి చౌదరితో తనకు కెమిస్ట్రీ బాగుంటుందని యూట్యూబ్‌లో ఈ మధ్య రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో వాపోయారు. ఆ రోతను సన్నిహితులు తన భార్యకు పంపి ఇదేంటని అడుగుతున్నట్లు చెప్పారు. లేనివి సృష్టించి తాత్కాలికంగా లాభపడ్డా, అవి జీవితాలను ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలన్నారు.

News March 1, 2025

ఏటికొప్పాక బొమ్మలకు అరుదైన గౌరవం

image

AP: అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక లక్క బొమ్మలకు అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ఆ బొమ్మల స్టాల్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం శరత్ అనే కళాకారుడిని ఎంపిక చేసింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ పరేడ్‌లో ఏటికొప్పాక బొమ్మల శకటం ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

News March 1, 2025

పాపం ఇంగ్లండ్: 17 మ్యాచ్‌లలో ఓటమి.. ఒక్కటే గెలుపు

image

ఇంగ్లండ్ మెన్స్, ఉమెన్స్ క్రికెట్ జట్లు టెస్టు, వన్డే, టీ20ల్లో ఓటముల పరంపర కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది బట్లర్ సేన వరుసగా 8 సహా 10 మ్యాచ్‌లు ఓడిపోయింది. కేవలం ఒక్కదాంట్లోనే గెలిచింది. CT గ్రూప్ స్టేజీలో 3 మ్యాచుల్లోనూ ఓడిన తొలి జట్టుగానూ అపఖ్యాతి మూటగట్టుకుంది. మహిళల జట్టు కూడా వరుసగా ఏడు గేమ్స్ ఓడింది. ఈ ఏడాది ఇప్పటికీ గెలుపు ఖాతా తెరవలేదు. దీంతో ఆ దేశ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News March 1, 2025

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్

image

ఐపీఎల్ తరహాలో రాష్ట్రంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్(TPL) రానుంది. జూన్‌లో ఈ లీగ్‌ను ప్రారంభిస్తామని HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో క్రికెట్ సదుపాయాలను మరింత అభివృద్ధి చేసేందుకు సహకారం ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు పేర్కొన్నారు. ఈ లీగ్ అందుబాటులోకి వస్తే టీమ్స్‌కు ఏ పేర్లు పెడితే బాగుంటాయో కామెంట్ చేయండి?

News March 1, 2025

ఇంగ్లండ్‌కు నిరాశ.. సౌతాఫ్రికా విజయం

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచులో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యాన్ని 29.1 ఓవర్లలో ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లలో డస్సెన్ (72), క్లాసన్ (64) రాణించారు. ఇప్పటికే సౌతాఫ్రికాకు సెమీస్ బెర్తు ఖరారు కాగా, ఇంగ్లండ్ ఒక్క విజయం కూడా లేకుండానే నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.