News September 5, 2024

వరద బాధితులకు దగ్గుబాటి ఫ్యామిలీ రూ.కోటి సాయం

image

రెండు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం దగ్గుబాటి ఫ్యామిలీ రూ.కోటి సాయం ప్రకటించింది. ఇరు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షలు అందించింది. మరో వైపు AP, TGలోని అన్ని థియేటర్ల వద్ద విరాళాలు, వస్తువుల సేకరణ కోసం సెంటర్ ఏర్పాటు చేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. రెండు రాష్ట్రాలకు తలో రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. నిర్మాత దిల్ రాజు AP, TGలకు చెరో రూ.25 లక్షల సాయం ప్రకటించారు.

News September 5, 2024

మార్కెట్ల ప‌త‌నానికి కార‌ణాలు ఇవే!

image

లో ఫ్యూచ‌ర్స్ ప్రైస్‌తో కూడిన హై ఓపెన్ ఇంట్రెస్ట్ వ‌ల్ల‌ భార‌తీ ఎయిర్‌టెల్, 1:1 బోన‌స్ షేర్ల ప్ర‌క‌ట‌న‌ అనంతరం రిల‌య‌న్స్ షేర్లు అమ్మ‌కాల ఒత్తిడికి లోన‌వ్వ‌డంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లు గురువారం న‌ష్టాల‌బాటప‌ట్టాయి. సెన్సెక్స్ 151 పాయింట్లు న‌ష్ట‌పోయి 82,201 వ‌ద్ద‌, నిఫ్టీ 53 పాయింట్ల న‌ష్టంతో 25,145 వ‌ద్ద నిలిచాయి. ప్ర‌ధాన దేశాల మార్కెట్ల‌లో నెలకొన్న అస్థిరత మన మార్కెట్ల‌పై ప్రభావం చూపాయి.

News September 5, 2024

పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

image

AP: వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం <<14029230>>పవన్ కళ్యాణ్<<>> ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ‘అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి. బాధితులకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలి. సూపర్ క్లోరినేషన్ చేపట్టాలి’ అని ఆయన సూచించారు.

News September 5, 2024

AI టెక్నాలజీ విస్తరణకు HYD కేంద్ర బిందువు: CM రేవంత్

image

TG: AI టెక్నాలజీ విస్తరణకు HYD కేంద్ర బిందువుగా ఉంటుందని CM రేవంత్ అన్నారు. HICC వేదికగా 2రోజుల AI గ్లోబల్ సదస్సును CM ప్రారంభించారు. తెలంగాణ AI రోడ్ మ్యాప్, AI సిటీ నమూనాలను ఆవిష్కరించారు. సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో మార్పులు అసాధ్యమన్నారు. మార్పునకు సిద్ధంగా ఉంటేనే ముందుకు వెళ్లగలమని చెప్పారు. AI రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు HYD సిద్ధంగా ఉందన్నారు.

News September 5, 2024

మీకు తెలుసా: ‘ఓ’ క్లాక్‌లో ఓ అంటే అర్థమేంటంటే..!

image

సమయాన్ని 2’0′ clock, 3’0′ clock అంటూ చెబుతుండటం తెలిసిందే. ఇలా అనడం వెనుక కారణమేంటంటే.. గడియారాలు రాకముందు సన్ డయల్ వంటి పలు రకాలైన మార్గాల్లో సమయాన్ని గణించేవారు. గడియారాలు వచ్చాక అందులో సమయం చెప్పి ‘ఆఫ్ ది క్లాక్(గడియారంలో ఇంత అయింది)’ అని చెప్పడం మొదలైంది. ఉదాహరణకు గడియారంలో 2 గంటలు అయితే ‘2 of the clock’ అనేవారు. అదే కాలక్రమంలో ‘o clock’గా రూపాంతరం చెందింది.

News September 5, 2024

కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య

image

కోటాలో మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మెడిక‌ల్ ఎంట్రన్స్ టెస్టు కోసం కోచింగ్ పొంద‌డానికి వారం క్రితం కోటాలోని ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన UPకి చెందిన ప‌ర‌సురామ్ త‌న అద్దె గ‌దిలో ఉరివేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలపై జ‌వ‌హార్ న‌గ‌ర్ పోలీసులు విచారిస్తున్నారు. కోచింగ్ సెంట‌ర్‌ నిర్వాహకులపై బాధితుడి తండ్రి చేసిన ఆరోప‌ణ‌ల‌పై కూడా విచార‌ణ చేస్తున్నట్టు వెల్లడించారు.

News September 5, 2024

ఘోరం: అంబులెన్స్‌లో భర్త.. భార్యపై లైంగిక దాడి

image

చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భర్తతో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న మహిళపై అందులోని సిబ్బంది లైంగిక దాడికి ఒడిగట్టారు. ఆమె నగల్ని దోచుకుని, భర్తకున్న ఆక్సిజన్‌ సపోర్ట్ తీసేసి అంబులెన్స్‌ నుంచి కిందికి తోసేశారు. అనంతరం ఆమె భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. యూపీలోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News September 5, 2024

కేజ్రీవాల్ బెయిల్‌పై వాదనలు.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

image

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ <<14028580>>బెయిల్‌పై వాద‌న‌ల‌<<>> సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. CBI కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తే అది హైకోర్టు నిర్ణ‌యాన్ని నిరుత్సాహ‌ప‌రిచిన‌ట్టే అవుతుంద‌ని అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్వీ రాజు వాదించారు. అయితే, ఈ వ్యాఖ్యల‌ను ఆక్షేపించిన జస్టిస్ భూయాన్ ‘అలా చెప్పకండి’ అంటూ వారించారు. CM క‌స్ట‌డీలో ఉన్నందున సెక్షన్41ఏ నోటీసులు అవ‌స‌రం లేద‌ని రాజు వాదించారు.

News September 5, 2024

Dy.CM పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతూనే విజయవాడ వరదలపై సమీక్షలు నిర్వహించారు. ఇవాళ కూడా అస్వస్థతతోనే అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఆయనకు ఫీవర్ ఇంకా ఎక్కువ కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

News September 5, 2024

ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతులు నొక్కడమా?: కేటీఆర్

image

TG: తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్ట్ అక్రమమని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని ఎక్స్‌లో డిమాండ్ చేశారు. ‘ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతులను నొక్కడమేనా? ఇది రేవంత్ సర్కార్ అసమర్థతకు నిదర్శనం. అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చనుకుంటే అది మీ భ్రమే. రాష్ట్రంలో వాక్‌ స్వాతంత్ర్యం లేదు. నిరంకుశ పాలన సాగుతోంది’ అని ఫైర్ అయ్యారు.