News September 5, 2024
మార్కెట్ల పతనానికి కారణాలు ఇవే!
లో ఫ్యూచర్స్ ప్రైస్‌తో కూడిన హై ఓపెన్ ఇంట్రెస్ట్ వల్ల భారతీ ఎయిర్‌టెల్, 1:1 బోనస్ షేర్ల ప్రకటన అనంతరం రిలయన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లు గురువారం నష్టాలబాటపట్టాయి. సెన్సెక్స్ 151 పాయింట్లు నష్టపోయి 82,201 వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 25,145 వద్ద నిలిచాయి. ప్రధాన దేశాల మార్కెట్లలో నెలకొన్న అస్థిరత మన మార్కెట్లపై ప్రభావం చూపాయి.
Similar News
News September 9, 2024
గ్రీన్ ఫార్మా సిటీ ప్రక్రియపై సీఎం రేవంత్ సమీక్ష
HYD శివారులోని ముచ్చెర్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఫార్మా పూర్తిగా కాలుష్య రహిత సిటీగా అభివృద్ధి జరగాలని చెప్పారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయలు కల్పించే ప్రక్రియ వేగంగా జరగాలని సమీక్షలో దిశానిర్దేశం చేశారు. పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకొస్తున్నాయని, త్వరలోనే సంప్రదింపులు జరపాలని సూచించారు.
News September 9, 2024
BREAKING: ఆ రెండు జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు
AP: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అల్లూరి జిల్లావ్యాప్తంగా రేపు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ దినేశ్ ఉత్తర్వులిచ్చారు. ఏలూరు జిల్లాలోని భీమడోలు, పెదపాడు, మండవల్లి, కైకలూరు, ఏలూరు, ముదినేపల్లి, కలిదిండి మండలాల్లోని పలు పాఠశాలలకు అధికారులు సెలవు ఇచ్చారు. మిగతా స్కూళ్లు యథాతథంగా నడుస్తాయని చెప్పారు.
News September 9, 2024
సీఎం మమత చెప్పేవి అబద్ధాలు: ట్రైనీ డాక్టర్ తల్లి
కోల్‌కతాలో హత్యాచారానికి గురైన వైద్యురాలి పేరెంట్స్‌కు పోలీసులు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలను CM మమత ఖండించారు. దీంతో ఆమెపై మృతురాలి తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. CM అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ‘మీకు పరిహారం ఇప్పిస్తానని CM అన్నారు. మీ కూతురి జ్ఞాపకార్థం ఏదైనా నిర్మించుకోవచ్చన్నారు. అయితే నా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు మీ ఆఫీస్‌కు వచ్చి పరిహారం తీసుకుంటానని చెప్పా’ అని పేర్కొన్నారు.