News September 5, 2024

Dy.CM పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతూనే విజయవాడ వరదలపై సమీక్షలు నిర్వహించారు. ఇవాళ కూడా అస్వస్థతతోనే అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఆయనకు ఫీవర్ ఇంకా ఎక్కువ కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

News September 5, 2024

ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతులు నొక్కడమా?: కేటీఆర్

image

TG: తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్ట్ అక్రమమని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని ఎక్స్‌లో డిమాండ్ చేశారు. ‘ప్రజాపాలన అంటే ప్రశ్నించే గొంతులను నొక్కడమేనా? ఇది రేవంత్ సర్కార్ అసమర్థతకు నిదర్శనం. అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చనుకుంటే అది మీ భ్రమే. రాష్ట్రంలో వాక్‌ స్వాతంత్ర్యం లేదు. నిరంకుశ పాలన సాగుతోంది’ అని ఫైర్ అయ్యారు.

News September 5, 2024

YCP MLC లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్

image

AP: టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఇదే కేసులో వైసీపీ నేతలు జోగి రమేశ్, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్ కోసం అధికారులు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. YCP మాజీ MP నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్ పడింది.

News September 5, 2024

అప్పుడు కృష్ణం రాజు.. ఇప్పుడు ప్రభాస్ ‌రాజు

image

తెలుగు రాష్ట్రాల్లో వరదలు రావడంతో బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్ రూ.2కోట్లు విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఇప్పుడే కాదు.. ఎప్పుడు విపత్తులు వచ్చినా విరాళమిచ్చేందుకు ముందుంటారు. అయితే ఆయన పెదనాన్న కృష్ణం రాజు కూడా తక్కువేం కాదు. ఆయన 1986లో తూ.గో, ప.గో జిల్లాల్లో వరదలు వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువగా రూ.1.05లక్షలు డొనేట్ చేశారు. కృష్ణ, దాసరి, రాజేశ్‌ఖన్నా రూ.లక్ష చొప్పున ఇచ్చారు.

News September 5, 2024

BJPలో చేరిన రవీంద్ర జడేజా

image

భారత క్రికెటర్ రవీంద్ర జడేజా BJPలో చేరారు. ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్న విషయాన్ని జడేజా సతీమణి రివాబా జడేజా వెల్లడించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జడేజా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఆల్‌రౌండర్ ఇటీవల టీ20I క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. తాజాగా పార్టీలో చేరడంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటారనే చర్చ మొదలైంది. రివాబా ఇప్పటికే గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి BJP MLAగా ఉన్నారు.

News September 5, 2024

గర్భిణి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్

image

యాపిల్ వాచ్ ప్రాణాలు కాపాడిందనే వార్తలు తరచూ వింటున్నాం. 2022లో ఓ గర్భిణిని అలర్ట్ చేసి తల్లీశిశువును కాపాడిన విషయం తాజాగా బయటకొచ్చింది. తాను 33వారాల గర్భంతో ఉన్నప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని యాపిల్ వాచ్ గుర్తించిందని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్(USA) రేచెల్ మనాలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. డాక్టర్‌ను కలవాలని సూచించడంతో తాను లాస్ ఏంజెలిస్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నట్లు తెలిపారు.

News September 5, 2024

సహాయక చర్యలపై పోస్టు.. స్పందించిన AP పోలీస్

image

AP: విజయవాడలో నీట మునిగిన కాలనీలను క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్లు బాధితుల పేరు, కులం అడుగుతున్నారని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర పోలీస్ విభాగం ‘విపత్కర సమయంలో తప్పుడు వార్తల ప్రచారం తీవ్రమైన నేరం. కులాలు, ప్రాంతాల మధ్య చీలికలు సృష్టించడానికి ప్రయత్నించడం క్షమించరానిది. ద్వేషాన్ని వ్యాప్తి చేసే పుకార్లు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది.

News September 5, 2024

ఆసీస్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్

image

ఆస్ట్రేలియాతో T20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ తగిలింది. కాలి కండరాల గాయంతో ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. అలాగే వన్డే సిరీస్‌లో కూడా ఆయన ఆడటం అనుమానంగా మారింది. ప్రస్తుతం ఆయన స్థానంలో ఫిల్ సాల్ట్‌ను కెప్టెన్‌గా ఇంగ్లండ్ క్రికెట్ ఎంపిక చేసింది. బట్లర్ స్థానంలో ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ నెల 11 నుంచి T20 సిరీస్ ప్రారంభం కానుంది.

News September 5, 2024

రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

image

AP: ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా రేపు స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

News September 5, 2024

హిందువులపై దాడి అంశాన్ని అతి చేశారు: బంగ్లా చీఫ్ అడ్వైజర్

image

హిందువులపై దాడులు రాజకీయమైనవే తప్ప మతపరమైనవి కావని బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ అన్నారు. వాటిని అతిచేసి చూపించారని PTI ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మోదీకీ ఇదే చెప్పాను. ఈ దాడులకు అనేక కోణాలు ఉన్నాయి. దుర్మార్గపు అవామీ లీగ్, షేక్ హసీనా ప్రభుత్వం పడిపోగానే ఆ కార్యకర్తలపై దాడులు జరిగాయి. హిందువులూ వారి పక్షం కాబట్టే దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వారికీ, అవామీ కార్యకర్తలకు తేడా లేదు’ అని అన్నారు.