News September 5, 2024

YCP MLC లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్

image

AP: టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఇదే కేసులో వైసీపీ నేతలు జోగి రమేశ్, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్ కోసం అధికారులు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. YCP మాజీ MP నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్ పడింది.

Similar News

News September 10, 2024

లలితా జువెల్లర్స్, అన్నపూర్ణ స్టూడియోస్ విరాళం

image

TG: ఖమ్మం వరద బాధితులను ఆదుకునేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున నటి, నిర్మాత యార్లగడ్డ సుప్రియ రూ.50లక్షల చెక్కును CM రేవంత్‌కు అందజేశారు. ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు సీఎం ఆమెను అభినందించారు. మరోవైపు లలితా జువెల్లర్స్ ఓనర్ కిరణ్ రూ.కోటి, హైదరాబాద్ రేస్ క్లబ్ రూ.2కోట్లు, మైత్రా ఎనర్జీ గ్రూప్, అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా రూ.కోటిని CM సహాయ నిధికి అందజేశాయి.

News September 10, 2024

పారాలింపిక్స్ ‘గోల్డ్’ విజేతలకు రూ.75 లక్షలు: మాండవీయ

image

పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లను కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సత్కరించారు. గోల్డ్ మెడలిస్టులకు ₹75 లక్షలు, సిల్వర్ విజేతలకు ₹50 లక్షలు, బ్రాంజ్ పతకాలు సాధించిన వారికి ₹30 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్స్‌లో రాణించిన ప్లేయర్లకు ₹22.50 లక్షలు అందజేస్తామని చెప్పారు. 2028 పారాలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించేందుకు వీలుగా శిక్షణ, సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

News September 10, 2024

PAC మీటింగ్‌లో సెబీ చీఫ్‌పై BJP vs TMC

image

పార్లమెంట్ PAC మీటింగ్‌లో సెబీ చీఫ్ మాధబీ బుచ్‌పై BJP, TMC మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఆమెను కమిటీ ముందుకు పిలిపించాలని సౌగతా రాయ్ చేసిన డిమాండ్‌ను నిశికాంత్ దూబే (BJP) వ్యతిరేకించారు. కేంద్రం ఆదేశించకుండా కాగ్ ప్రిన్సిపల్ ఆడిటర్ సెబీ ఖాతాలను ఆడిట్ చేయలేరన్నారు. ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో అవకతవకలపై పక్కా ఆధారాలు లేకుండా పీఏసీ ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించలేదన్నారు.