News September 5, 2024

ప్రొడక్టివిటీ పెంచాలని ‘పెయిడ్ టిండర్ లీవ్’ ఇచ్చిన కంపెనీ

image

ఉద్యోగుల సంక్షేమం కోరుకున్న ఓ థాయ్ కంపెనీ వారికి పెయిడ్ టిండర్ లీవ్ ఇచ్చినట్టు స్ట్రైయిట్స్ టైమ్స్ తెలిపింది. వైట్‌లైన్ గ్రూప్ ఈ డిసెంబర్ వరకు టిండర్ గోల్డ్, ప్లాటినమ్‌ సబ్‌స్క్రిప్షన్‌కు డబ్బులు ఇస్తోందట. డేటింగ్‌ తేదీకి వారం ముందు నోటీస్ ఇవ్వాలని సూచించింది. ప్రేమ వల్ల సంతోషం దాంతో ప్రొడక్టివిటీ పెరుగుతుందని కంపెనీ భావన. డేటింగ్‌‌కు వెళ్లే టైమ్ లేదన్న ఓ ఉద్యోగి మాటలే ఈ నిర్ణయానికి కారణం.

News September 5, 2024

అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పులు?

image

త్రివిధ దళాల్లో నియామకాలకు తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌లో కీలక మార్పుల దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వయో పరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచడంపై చర్చలు జరుగుతున్నాయని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అలాగే ఎంపికైన వారిలో నాలుగేళ్ల తర్వాత ప్రస్తుతం 25 శాతం మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసులోకి తీసుకుంటుండగా, ఈ సంఖ్యను 50 శాతానికి పెంచే అవకాశం ఉందన్నారు.

News September 5, 2024

BREAKING: ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు

image

AP: మహిళపై లైంగిక దాడి ఆరోపణల <<14027071>>నేపథ్యంలో <<>> తమ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ చర్యలకు దిగింది. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.

News September 5, 2024

ఎమ్మెల్యే వీడియోలు వైరల్.. టీడీపీ ఆగ్రహం

image

AP: మహిళపై లైంగిక దాడి <<14026398>>ఆరోపణల<<>> నేపథ్యంలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తూ తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ఆదిమూలం అందుబాటులో లేరని తెలుస్తోంది.

News September 5, 2024

ప్రశాంత్ వర్మ కొత్త సినిమా అప్డేట్

image

‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కొత్త సినిమాను ప్రకటించారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్ట్ రూపొందుతున్నట్లు వెల్లడించారు. సింబా వస్తున్నాడని దీనికి సంబంధించిన అప్డేట్‌ను రేపు ఉదయం 10.36 గంటలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సినిమా ద్వారా నందమూరి బాలకృష్ణ వారసుడైన మోక్షజ్ఞ తేజను ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం ఉన్నట్లు సినీవర్గాలు పేర్కొంటున్నాయి.

News September 5, 2024

దండించినా ఎప్పటికీ విద్యార్థి గుండెల్లోనే!

image

ఎంతైనా 90sలో చదువులు వేరేలా ఉండేవి. ఉపాధ్యాయులు దండించడం వల్లే చాలా మంది విద్యార్థులు గాడినపడిన వారున్నారు. తమ చేతులపై ఎన్నో కర్రలు విరిగినప్పటికీ.. అవన్నీ ఇప్పుడు గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతున్నారు. అయితే, చదువులో ఎంకరేజ్ చేస్తూ, ఆటపాటలను సైతం ప్రోత్సహించిన ఫేవరెట్ టీచర్లు ప్రతి ఒక్కరికీ ఉంటారు. అలాంటి గొప్ప టీచర్‌తో మీకున్న అనుభవాలను, వారి పేర్లేంటో కామెంట్ చేయండి.

News September 5, 2024

హీరోలందు నాని స్టైల్ వేరయా..

image

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విడుదలకు ఒక తేదీని ఫిక్స్ చేసినా తీరా సమయానికి అనేక చిత్రాలు వాయిదా పడ్డాయి. కానీ ఈ విషయంలో నేచురల్ స్టార్ నాని మాత్రం డిఫరెంట్. సినిమాను ప్రకటించేటప్పుడే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసి అనుకున్నట్లుగానే చేస్తారు. దీంతో తమ హీరోలూ నానిలాగే అనుకున్న తేదీకి చిత్రాలను విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News September 5, 2024

‘35-చిన్న కథ కాదు’ రివ్యూ & రేటింగ్

image

కుమారుడికి గణిత పాఠాలు అర్థమయ్యేలా చేసేందుకు తల్లి ఏం చేసిందనేది ‘35-చిన్న కథ కాదు’. ఈ మూవీ రేపు రిలీజ్ కానుండగా పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. గృహిణిగా నివేదా థామస్, చిన్నారి అరుణ్ తమ నటనతో అదరగొట్టారు. ప్రియదర్శి, విశ్వదేవ్ యాక్టింగ్, స్టోరీ, డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్, బీజీఎం, సెకండాఫ్ సినిమాకు ప్లస్. సాగదీతగా ఉండే సన్నివేశాలు మైనస్. మొత్తంగా కుటుంబంతో కలిసి చూడాల్సిన ‘మంచి కథ’.
రేటింగ్: 3/5

News September 5, 2024

వరదల్లో పొలిటికల్ బురద.. టీడీపీ-వైసీపీ కార్టూన్ కౌంటర్స్

image

AP: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై టీడీపీ-వైసీపీ మధ్య కార్టూన్ కౌంటర్స్ కొనసాగుతున్నాయి. నటులు, ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్యులు మానవతా దృక్పథంతో బాధితులకు సాయం చేస్తుంటే సైకో జగన్ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని, విమర్శలు చేస్తున్నారని టీడీపీ ఓ కార్టూన్‌ను ట్వీట్ చేసింది. ఈ విపత్తే చంద్రబాబు విరాళమంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది.

News September 5, 2024

బెయిల్‌పై వాదనలు: కేజ్రీవాల్ పారిపోతాడన్న భయం లేదు

image

మద్యం స్కామ్‌ కేసులో CBI తనను రెండేళ్ల పాటు అరెస్టు చేయలేదని ఢిల్లీ CM కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ED పెట్టిన మనీ లాండరింగ్ కేసులో జూన్ 26న బెయిల్ రాగానే ముందస్తుగా అరెస్టు చేసిందని పేర్కొన్నారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. CBI FIRలో కేజ్రీ పేరులేదని, రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన విదేశాలకు పారిపోతాడన్న భయం లేదన్నారు. ఆయనతో సమాజానికి ముప్పు ఉండదన్నారు.