News September 5, 2024

మద్యం షాపుల బంద్ వాయిదా

image

AP: రాష్ట్రంలో ఈ నెల 7 నుంచి <<13980417>>చేపట్టాల్సిన<<>> మద్యం షాపుల బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు బేవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం వెల్లడించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్ వైజర్లు, సేల్స్‌మెన్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో బంద్ చేపడతామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

News September 5, 2024

అదానీ, HUL, ITCతో పోటీకి రిలయన్స్ బిగ్ ప్లాన్

image

FMCG వ్యాపారంలో ఈక్విటీ, డెట్ రూపంలో రూ.3900 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ సిద్ధమైంది. హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ, కోకాకోలా, అదానీ విల్మార్ వంటి కంపెనీలకు గట్టిపోటీనిచ్చేందుకు సై అంటోంది. పెట్టుబడి సమీకరణకు RCPL బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది. FMCG విభాగంలో ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే తొలిసారి. పైగా ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్‌ను రూ.కోటి నుంచి రూ.100 కోట్లకు పెంచుకోవడం గమనార్హం.

News September 5, 2024

ఉపాధ్యాయులు.. ఆదర్శప్రాయులు!

image

చదువుకు కుటుంబ ఆర్థిక స్థితిని సైతం మార్చేసే శక్తి ఉంది. అలాంటి చదువు నేర్పించే గురువుకు విద్యార్థి జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. మెరుగైన సమాజాన్ని సృష్టించడంలో ఉపాధ్యాయుడు కీలక పాత్ర పోషిస్తుంటారు. మనం గొప్పవాళ్లమైతే బంధువులైనా ఈర్ష్య పడతారేమో కానీ గురువు మాత్రం తన విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరినందుకు గర్వపడతారు. ఉన్నత పదవులు, ఉద్యోగాల్లో ఉన్నవారు గతంలో గురువు చేత చివాట్లు తిన్నవాళ్లే.

News September 5, 2024

సంచలనం: 10 ఓవర్లు, 10 రన్స్, 10 వికెట్లు

image

టీ20 వరల్డ్ కప్ ఆసియా క్వాలిఫయర్‌-ఏలో సంచలనం నమోదైంది. సింగపూర్‌తో మ్యాచ్‌లో మంగోలియా జట్టు 10 ఓవర్లు ఆడి కేవలం 10 పరుగులకే ఆలౌటైంది. ఆ టీమ్‌లో ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కాగా, మరో నలుగురు ఒక పరుగుకే వెనుదిరిగారు. షురెంట్‌సెట్, గన్‌బోల్డ్ చెరో 2 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. సింగపూర్ జట్టులో హర్ష భరద్వాజ్ 6 వికెట్లతో చెలరేగారు. టార్గెట్‌ను సింగపూర్ 5 బంతుల్లో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది.

News September 5, 2024

పోలీసులు లంచం ఆఫర్ చేశారు: హత్యాచార బాధితురాలి పేరెంట్స్

image

తమ కుమార్తె మృతదేహాన్ని అప్పగిస్తూ పోలీసులు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆర్జీకర్ వైద్యురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. నిన్న రాత్రి కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ‘పోలీసులు ఈ కేసును త్వరగా మూసేసేందుకే ప్రయత్నించారు. ముందు మమ్మల్ని బాడీని చూడనివ్వలేదు. పోస్ట్‌మార్టం టైమ్‌లో మేం PSలోనే ఉన్నాం. బాడీని అప్పగిస్తూ సీనియర్ అధికారి డబ్బును ఆఫర్ చేశారు. మేం వెంటనే తిరస్కరించాం’ అని తెలిపారు.

News September 5, 2024

ఈనెల 10న ‘దేవర’ ట్రైలర్ రిలీజ్?

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ మూవీ ట్రైలర్ ఈనెల 10న రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనికోసం భారీ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, అదిరిపోయే డైలాగ్స్‌తో ఉన్న ట్రైలర్‌ను చిత్రబృందం ఖరారు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇప్పటికే రిలీజైన మూడు సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈనెల 27న ‘దేవర’ విడుదలవనుంది.

News September 5, 2024

ఖరీఫ్‌లో 100 శాతం వరి సాగు పూర్తి: వ్యవసాయ శాఖ

image

TG: ఖరీఫ్ సీజన్‌లో అన్ని రకాల పంటల సాధారణ విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 1.20 కోట్ల ఎకరాల్లో పూర్తయినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. వరి సాగు లక్ష్యం 57.18 లక్షల ఎకరాలు కాగా 100% నాట్లు పడినట్లు తెలిపింది. పత్తి 50.48L ఎకరాలు, పప్పు ధాన్యాలు 5.66L ఎకరాలు, మొక్కజొన్న 5.11L ఎకరాలు, సోయాబీన్ 3.97L ఎకరాల్లో సాగైనట్లు పేర్కొంది.

News September 5, 2024

BREAKING: మరో భారీ ఎన్‌కౌంటర్

image

TG: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన <<14010044>>ఎన్‌కౌంటర్‌లో<<>> 10 మంది మావోలు మృతి చెందారు.

News September 5, 2024

తుపాకీ హింసతో దాక్కోవాల్సిన పరిస్థితి: జో బైడెన్

image

జార్జియా స్కూల్లో విద్యార్థులపై కాల్పులు కలచివేశాయని US అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. చదవడం, రాయడానికి బదులు తుపాకీ గుళ్లకు బలికాకుండా దాక్కోవాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు. ఇకపై ఇలాంటి హింస జరగకుండా US కాంగ్రెస్‌లో భద్రతా చట్టం తెచ్చేందుకు రిపబ్లికన్లు సహకరించాలని కోరారు. ‘మతిలేని తుపాకీ హింసలో మరణించిన విద్యార్థులకు నేనూ, జిల్ సంతాపం ప్రకటిస్తున్నాం. దీనిని ఎంతమాత్రం సహించలేం’ అని అన్నారు.

News September 5, 2024

ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి 4 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీనితో పాటు ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వచ్చే 4 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది.