News September 5, 2024

ఉత్తమ ఉపాధ్యాయులుగా 103 మంది ఎంపిక

image

TG: గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 103 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో పాఠశాల విద్యాశాఖ నుంచి 47 మంది, ఇంటర్ నుంచి 11, విశ్వవిద్యాలయాల నుంచి 45 మంది ఉన్నారు. ఎంపికైన వారిని నేడు రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పురస్కారాలతో పాటు రూ.10వేల నగదు, ప్రశంసాపత్రంతో సత్కరించనున్నారు.

News September 5, 2024

ఈనెల 11న బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈనెల 11న పార్టీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు KCR సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో రైతుల సమస్యలు, కాంగ్రెస్ హామీల అమలులో జాప్యం, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలనే దానిపై వ్యూహాలు రచించనున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కష్టాలు, రైతు భరోసాపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కేసీఆర్ నిరసనలు, రోడ్ షోలు చేపట్టనున్నట్లు సమాచారం.

News September 5, 2024

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్

image

AP: మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయనను అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.

News September 5, 2024

ఆహారం పడేస్తున్నారంటూ ఆరోపణలు.. కారణం అదేనా?

image

AP: వరద బాధితుల కోసం తయారు చేసిన ఆహారాన్ని కొందరు బయట పడేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఏలూరు రోడ్డులో గూడవల్లి ఫ్లై ఓవర్ పైనుంచి ఆహారాన్ని పడేస్తున్న ఫొటోలను ఓ నెటిజన్ Xలో పోస్ట్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం, పోలీసులను కోరారు. అయితే అది పాడైపోయిన ఆహారం కావొచ్చని, తెల్లవారుజామున పంపిన ఫుడ్ మధ్యాహ్నంకల్లా పాడైపోతోందని, ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి 3 రోజులుగా కరెంటు లేదంటూ కొందరు చెబుతున్నారు.

News September 5, 2024

వరదలకు వర్షాలతో పాటు కబ్జాలే కారణం: మంత్రి సీతక్క

image

TG: రాష్ట్రంలో వరదలకు భారీ వర్షాలతో పాటు కబ్జాలు కూడా కారణమని మంత్రి సీతక్క అన్నారు. అన్ని గ్రామాల్లో చెరువులు, వాగులు, కుంటలు, ఇతర జలాశయాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించి, వాటి వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో ఐదుగురు అధికారులతో వరద నిర్వహణ కమిటీలను నియమించాలన్నారు. రాష్ట్రంలోని పల్లె రహదారుల పునరుద్ధరణ కోసం రూ.24కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

News September 5, 2024

నేటి నుంచి దులీప్ ట్రోఫీ మ్యాచులు

image

దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ పోరు నేటి నుంచి జరగనుంది. తొలి రౌండ్‌లో భాగంగా ఇండియా-C, ఇండియా-D అనంతపురంలో, ఇండియా-A, ఇండియా-B బెంగళూరులో తలపడనున్నాయి. ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా బంగ్లాదేశ్‌తో టెస్టులకు ప్లేయర్లను సెలక్ట్ చేసే ఛాన్సుంది. సీనియర్లు రోహిత్, కోహ్లీ, బుమ్రా మినహా యువ ఆటగాళ్లందరూ ఈ టోర్నీలో ఆడనున్నారు. పలువురు గాయాల కారణంగా తొలి రౌండ్‌కు దూరమయ్యారు.

News September 5, 2024

‘దేవర’ మూవీ రన్ టైమ్ ఎంతంటే?

image

ఈనెల 27న విడుదల కాబోతున్న Jr.NTR దేవర మూవీ రన్ టైమ్ 3 గంటల 10 నిమిషాలు ఉంటుందని వార్తలొస్తున్నాయి. అయితే ఫైనల్ ఎడిట్ అయ్యి, సెన్సార్‌కు సబ్మిట్ చేసే ముందు నిడివి తగ్గొచ్చని సినీవర్గాలు చెబుతున్నాయి. 2 గంటల 47 నిమిషాల రన్ టైమ్ ఉండొచ్చని పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘దావూదీ’ పాటకు మిక్స్‌డ్ రియాక్షన్స్ వస్తున్నాయి.

News September 5, 2024

ఏసీకి అతిగా అలవాటు పడ్డారా?

image

ఏసీకి అతిగా అలవాటుపడితే అనేక రకాల వ్యాధుల బారిన పడాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీని అవసరానికి అనుగుణంగా వాడుకోవాలి. అతిగా వాడితే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఎయిర్ కండీషనర్ నుంచి వచ్చే గాలి ఆస్తమాను ప్రేరేపిస్తుంది. ఇన్ఫెక్షన్లు, తలనొప్పి, తల తిరగడం, చర్మం పొడిబారడం, మెదడు కణాలు బలహీనపడటం, అలెర్జిక్ రినైటిస్‌, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు.

News September 5, 2024

పవన్ చేస్తున్న సేవలకు విలువ కట్టలేం: CM

image

AP: వరద ప్రాంత ప్రజల కోసం భారీ <<14019137>>విరాళం<<>> ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను CM చంద్రబాబు అభినందించారు. ‘సీఎం సహాయ నిధికి రూ.కోటి, వరద బారిన పడ్డ 400 పంచాయితీలకు రూ.4 కోట్లు, తెలంగాణకు మరో రూ.కోటి ఇవ్వడం పవన్ కళ్యాణ్‌ విశాల హృదయానికి అద్దం పడుతోంది. ఆయన సమాజంలో ఎందరికో స్ఫూర్తి. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలకు విలువ కట్టలేం. ఆయన కురిపిస్తున్న వాత్సల్యానికి ఏదీ సరితూగదు’ అని ట్వీట్ చేశారు.

News September 5, 2024

దులీప్ ట్రోఫీ: కిషన్, సూర్య దూరం.. సంజూకు ఛాన్స్

image

దులీప్ ట్రోఫీ స్క్వాడ్‌లో బీసీసీఐ మార్పులు చేసింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ గాయాల కారణంగా తొలి రౌండ్ నుంచి వైదొలిగినట్లు వెల్లడించింది. కిషన్ స్థానంలో సంజూ శాంసన్‌ను ఇండియా-డి జట్టుకు ఎంపిక చేసింది. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్‌నెస్ క్లియర్ చేసుకుని సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. 4 <>జట్లు<<>> పాల్గొనే ఈ టోర్నీ ఇవాళ ప్రారంభం కానుంది.