News October 30, 2025

టెక్నాలజీ సాయంతో తుఫాన్ నష్టాన్ని తగ్గించాం: CBN

image

TG: మొంథా తుఫాన్ దాగుడుమూతలు ఆడిందని CM చంద్రబాబు అన్నారు. అనుకున్న చోట కాకుండా వేరే చోట వర్షాలు కురిశాయని సమీక్షలో చెప్పారు. టెక్నాలజీ సాయంతో తుఫాన్ నష్టాన్ని తగ్గించామన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయాల వరకు సమాచారం సేకరించినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ శాటిలైట్ ఇమేజ్‌లతో పరిస్థితులను అంచనా వేసినట్లు వెల్లడించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేశామని పేర్కొన్నారు.

News October 30, 2025

67 రకాల సామగ్రితో స్కూళ్లు, కాలేజీలకు స్పోర్ట్స్ కిట్లు

image

AP: క్రీడల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, జూ.కాలేజీలకు విద్యాశాఖ 67రకాల క్రీడా సామగ్రితో కూడిన కిట్లను అందిస్తోంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, బేస్‌బాల్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, రగ్బీ, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ పరికరాలు ఇందులో ఉన్నాయి. క్లస్టర్ కాంప్లెక్స్‌ల నుంచి వీటిని అందుకోవాలని స్కూళ్లకు ఆదేశాలిచ్చింది.

News October 30, 2025

ICMRలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ICMRలో 15 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, MBA, PG డిప్లొమా, CA, ICWA, M.COM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులో తప్పుల సవరణ NOV 5 – 7వరకు చేసుకోవచ్చు. NOV 10న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. NOV 15న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ తేదీని తర్వాత ప్రకటిస్తారు. వెబ్‌సైట్: www.icmr.gov.in/

News October 30, 2025

అపారనష్టం.. కేంద్రం జాతీయ విపత్తుగా పరిగణించాలి: పొన్నం

image

TG: భారీ వర్షాలతో పంటలకు అపారమైన నష్టం వాటిల్లిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రం దీనిని జాతీయ విపత్తుగా పరిగణించి సాయం అందించాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రూపొందిస్తుందని, అవసరమైన సాయం అందజేస్తుందని తెలిపారు. మరోవైపు రాజకీయాలకు తావు లేకుండా బీజేపీ నేతలు పరిస్థితిని కేంద్రానికి వివరించాలని సూచించారు.

News October 30, 2025

నిండు కుండల్లా కృష్ణా జలాశయాలు

image

AP, TGలతో పాటు పైరాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండడంతో నదులు, వాగులు, వంకలకు వరద పోటెత్తింది. దీంతో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళతో నిండుకుండల్లా మారాయి. ప్రాజెక్టుల నుంచి నీటిని కిందికి వదులుతున్నారు. నీటిమట్టాలు ఇలా. అల్మట్టి 1704.72(1705FRL), నారాయణపూర్ 1614.73(1615), జూరాల 1044.65(1045), తుంగభద్ర 1626.06 (1626.06), శ్రీశైలం 884.50(885), నాగార్జునసాగర్ 589.70(590), పులిచింతల 172.01(175)

News October 30, 2025

వర్షాలు – చేపల పెంపకంలో జాగ్రత్తలు

image

భారీ వర్షాల వల్ల పొలాల నుంచి వాననీటితో పాటు ఎరువులు, పురుగు మందుల అవశేషాలు చేరి చేపల చెరువుల్లోని నీటి నాణ్యతను తగ్గిస్తాయి. అందుకే వర్షాలు తగ్గాక చెరువు నీటిలో pH, ఉప్పుశాతం, క్షారత్వం, అమ్మోనియా తనిఖీ చేయాలి. ఆక్సిజన్ స్థాయి తగ్గితే చేపలు నీటి పైకి వచ్చి నోటితో గాలి తీసుకుంటూ కనిపిస్తాయి. అలాంటి పరిస్థితుల్లో నీటి మార్పిడి చేసి చెరువులో నిపుణుల సూచన మేరకు కాల్షియం కార్బోనేట్ (సున్నం) వేయాలి.

News October 30, 2025

ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.3వేలు: పవన్

image

AP: CM ముందుచూపు కారణంగా తుఫాను వేళ చాలా జాగ్రత్తలు తీసుకున్నామని Dy.CM పవన్ తెలిపారు. ‘పంచాయతీ‌రాజ్ శాఖ పరిధిలో బాగా నష్టం జరిగింది. 46వేల హెక్టార్లలో వరి, 14వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. తుఫాను బాధితులకు బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే ఒక్కో ఫ్యామిలీకి గరిష్ఠంగా ₹3వేలు అందిస్తున్నాం. డ్రెయిన్ల పూడికతీత ద్వారా నీరు నిల్వ లేకుండా చేశాం’ అని అన్నారు.

News October 30, 2025

పోషకాహార లోపం.. చిన్నారులకు శాపం

image

పోషకాహారలోపం వల్ల మనదేశంలోని 35% చిన్నారుల్లో ఎదుగుదల లోపాలు ఉన్నట్లు చిల్డ్రన్ ఇన్ ఇండియా నివేదిక వెల్లడించింది. పిల్లలకు 6 నెలలు వచ్చేవరకు తల్లిపాలు, తర్వాత ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ ఉన్న ఆహారం ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. పోషకాహారం తినేలా చూసుకోవాలి. అలాగే పిల్లలకు ఒక డోస్‌ బీసీజీ, మూడు డోస్‌ల డీపీటీ, 3 డోస్‌ల పోలియో, ఒక డోస్‌ మీజిల్స్‌ వ్యాక్సిన్లు తప్పనిసరని కేంద్రం తెలిపింది.

News October 30, 2025

చైనాపై టారిఫ్స్ తగ్గిస్తా: ట్రంప్

image

చైనాపై విధించిన టారిఫ్స్‌ను తగ్గిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతమున్న 57% టారిఫ్స్‌ను 47 శాతానికి పరిమితం చేస్తానని చెప్పారు. <<18146348>>జిన్‌పింగ్‌తో భేటీ <<>>సూపర్ సక్సెస్ అయిందని తెలిపారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను ఎగుమతి చేయడానికి, అమెరికన్ సోయాబీన్స్‌ను కొనడానికి చైనా అంగీకరించిందని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తాను చైనా వెళ్తానని, జిన్‌పింగ్ అమెరికాకు వస్తారని చెప్పారు.

News October 30, 2025

చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటా: రవితేజ

image

తాను సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోనని హీరో రవితేజ అన్నారు. చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ను, సినిమాల్లో జయాపజయాలను పట్టించుకోనని స్పష్టం చేశారు. వందశాతం కష్టపడి పనిచేస్తే ఫలితం వస్తుందని నమ్ముతానని తెలిపారు. ‘మాస్ జాతర’ చిత్రీకరణ సమయంలో తనకు గాయాలు కావడంతో చిత్రీకరణ వాయిదా పడినట్లు వెల్లడించారు. ఈ మూవీ రేపు థియేటర్లలో రిలీజ్ కానుంది.