India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ సీఎం KCR కనబడుటలేదంటూ HYDలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. కొన్ని మెట్రో పిల్లర్లతో పాటు పలు చోట్ల గోడలపై పోస్టర్లు అంటించారు. ‘రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్’ అని వాటిలో రాసి ఉంది. ఖమ్మంలో భారీ వరదల రోజు సీఎం, మంత్రులు ప్రజలను రక్షించకుండా ఎక్కడికి వెళ్లారన్న BRS ఆరోపణలకు కౌంటర్‌గా ఈ పోస్టర్లు వెలిసినట్లు తెలుస్తోంది.
AP: భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలం అయ్యింది. దీంతో నష్టం అంచనాకు కేంద్ర హోంశాఖ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి అమిత్‌షా వెల్లడించారు. త్వరలోనే ఈ బృందం రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని వరద పరిస్థితిని తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణలో ఈనెల 7, 17న సెలవు దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7న గణేశ్ చతుర్థి, 17న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. హాలీడే క్యాలెండర్ ప్రకారం 16న మిలాద్ ఉన్ నబీకి సర్కార్ సెలవు ఇచ్చింది. కానీ నెలవంక దర్శనం తేదీని బట్టి దాన్ని17కు మార్చినట్లు తెలిపింది. అదేరోజు హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం జరగనుంది. దీంతో 2 కార్యక్రమాల కోసం సెలవు ఇచ్చినట్లయింది.
ఢిల్లీకి చెందిన అమిత్ లాథియా ఓ సాదాసీదా కానిస్టేబుల్. అయితేనేం.. 12 ఏళ్లుగా ప్రతి నెలా తన జీతం వెచ్చించి నిరుపేద పిల్లలకు అండగా నిలుస్తున్నారు. పనులు చేసుకునే 185మంది పిల్లలు ఆయన చలవతో నేడు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పేద విద్యార్థులను గుర్తించడం, ఉచితంగా ఆహారం, నివాసం, స్టడీ మెటీరియల్స్ అందించి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం.. ఇదే అమిత్ పని. తన భార్య కూడా ఈ విషయంలో ఆయనకు అండగా ఉన్నారు.
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ పార్టీ నుంచి గెలిచిన MLAలు మరో పార్టీలోకి మారకుండా తెచ్చిన కొత్త బిల్లుకు అసెంబ్లీ అమోదం తెలిపింది. దీని ప్రకారం ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడిన MLAలకు పెన్షన్ రద్దు కానుంది. వారి జీవితంలో ఏ సమయంలోనైనా పార్టీ మారితే ఇది వర్తిస్తుంది.
TG: రాష్ట్రంలో నేటి నుంచి 9వ తేదీ వరకు భారీ వర్షాలు కురవనుండటంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వాగులు, వంకలు, జలాశయాలు, నదుల దగ్గరకు వెళ్లొద్దు. మ్యాన్ హోల్స్‌ను చూసుకుని నడవాలి. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు తాకవద్దు. వాహనాలను పరిమిత వేగంతో నడపాలి. వాతావరణ నిపుణుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అనుసరించాలి. విపత్కర సమయాల్లో 040-21111111 నంబరును సంప్రదించాలి.
‘దేవర’ నుంచి తాజాగా రిలీజైన దావూదీ సాంగ్‌లో ఎన్టీఆర్ స్టెప్పులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆ స్టెప్స్ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ కండరాల నొప్పులు, గాయాలతో బాధపడ్డారని ఆ మూవీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ట్విటర్లో తెలిపారు. ‘అంత నొప్పిలోనూ తారక్ చాలా అలవోకగా డాన్స్ వేసేశారు. ఆయనకు హ్యాట్సాఫ్’ అని ట్వీట్ చేశారు. ‘దేవర’ ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
TG: భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రయాణించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ మార్గంలో టికెట్ ధరలో 10శాతం రాయితీ ఇస్తున్నట్లు TGSRTC ప్రకటించింది. రాజధాని, ఏసీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://tgsrtcbus.inని సంప్రదించాలని కోరింది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
చరిత్రలో తొలిసారి IPL ఎంటర్‌ప్రైజ్ విలువ పడిపోయిందని D&P అడ్వైజరీ రిపోర్టు పేర్కొంది. నిరుడు రూ.92,500 కోట్లుగా ఉన్న విలువ 10.6% తగ్గి రూ.82,700 కోట్లకు చేరిందని వెల్లడించింది. డిస్నీ, రిలయన్స్ విలీనం, ప్రసార హక్కులన్నీ వారివద్దే ఉండటం, మీడియా హక్కులకు పోటీ తగ్గడం కారణాలని చెప్పింది. ఇప్పటికీ MI అత్యంత విలువైన ఫ్రాంచైజీ అని, CSK తర్వాతి స్థానంలో ఉందంది. WPL విలువ 8% ఎగిసి ₹1,344 కోట్లకు చేరింది.
విభిన్న వస్త్రధారణతో తరచూ వార్తల్లో నిలిచే హిందీ నటి ఉర్ఫీ జావేద్ తాను ఓ బాలుడి చేతిలో వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘‘నిన్న నాకు, నా ఫ్యామిలీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఫొటోలు దిగుతుండగా అటుగా ఓ కుర్రాళ్ల గుంపు వెళ్లింది. అందులో ఓ వ్యక్తి ‘నీ బాడీ కౌంట్ ఎంత?’ అని అందరిముందు అరిచాడు. అతడికి నిండా 15ఏళ్లు కూడా లేవు’’ అని వాపోయారామె.
Sorry, no posts matched your criteria.